
సల్మాన్ కేసులో వెలువనున్న సుప్రీం తీర్పు!
న్యూఢిల్లీ: కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పై సుప్రీంకోర్టు బుధవారం వెలువరించే అవకాశముంది. ఈ కేసులో సల్మాన్కు విధించిన శిక్ష అమలుపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించడాన్ని రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.
'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా నిర్మాణ సమయంలో సల్మాన్ ఖాన్, సోనాలి బెంద్రె, టబు, నీలమ్ తదితరులు రక్షిత జంతువైన కృష్ణజింకను వేటాడారంటూ అప్పట్లో కేసు నమోదైంది. 2006లో ఈ కేసులో సల్మాన్ఖాన్కు శిక్ష పడింది. హైకోర్టు గత సంవత్సరం నవంబర్ 12న ఆ శిక్షపై స్టే విధించింది.