షార్ప్ షూటర్ అరెస్ట్ | Gujarat ATS captures sharp shooter, involved in killing of witnesses in Asaram Bapu case | Sakshi
Sakshi News home page

షార్ప్ షూటర్ అరెస్ట్

Published Mon, Mar 14 2016 8:08 PM | Last Updated on Tue, Aug 21 2018 2:39 PM

Gujarat ATS captures sharp shooter, involved in killing of witnesses in Asaram Bapu case

అహ్మదాబాద్: షార్ప్ షూటర్ కార్తిక్ హల్దార్ ను గుజరాత్ ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేశారు. వివాదస్పద స్వామిజీ ఆశారాం బాపు కేసులో ముగ్గురు సాక్ష్యులను అతడు హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కార్తిక్ హల్దార్ ను ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు సోమవారం పోలీసులు వెల్లడించారు.

మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు ఆరోపణలు రావడంతో ఆశారాం బాపును 2013లో జోధ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో రేప్ కేసులో ఆయన కుమారుడు నారాయణసాయిని కూడా అరెస్టయ్యారు. 2001- 2005 మధ్య కాలంలో నారాయణసాయి తనపై పలు సార్లు అత్యాచారం చేశాడని ఓ మహిళ గుజరాత్లోని సూరత్ నగరంలో 2013లో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement