మ్యాచ్‌ చూస్తుండగా గుండె ఆగింది! | UP man dies of heart attack during India-Bangladesh thriller | Sakshi
Sakshi News home page

మ్యాచ్‌ చూస్తుండగా గుండె ఆగింది!

Mar 24 2016 8:06 PM | Updated on Sep 3 2017 8:29 PM

మ్యాచ్‌ చూస్తుండగా గుండె ఆగింది!

మ్యాచ్‌ చూస్తుండగా గుండె ఆగింది!

నరాలు తెగే ఉత్కంఠ నడుమ హోరాహోరీగా జరిగిన భారత్‌-బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్‌ చూస్తూ.. ఓ వృద్ధుడు గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు.

గోరఖ్‌పూర్‌: నరాలు తెగే ఉత్కంఠ నడుమ హోరాహోరీగా జరిగిన భారత్‌-బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్‌ చూస్తూ.. ఓ వృద్ధుడు గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్ జిల్లాలోని బిస్తావలి గ్రామంలో జరిగింది. ఓమ్‌ ప్రకాశ్ శుక్లా అనే వయోవృద్ధుడు బుధవారం భారత్‌-బంగ్లాదేశ్ మ్యాచ్‌ చూశాడు. చివరి ఓవర్‌లో హార్థిక్ పాండ్యా బౌలింగ్‌లో బంగ్లా ఆటగాడు ముష్ఫకర్ రహీమ్‌ రెండు ఫోర్లు కొట్టడం.. బంగ్లా జట్టు దాదాపు విజయం అంచుల వరకు వెళ్లడంతో ఆయన ఉత్కంఠకు లోనయ్యారు.

ఛాతిలో తీవ్ర నొప్పి వస్తుందంటూ కుటుంబసభ్యులకు తెలిపారు. మరో మూడు బంతులు ముగిసేసరికి భారత్‌ అనూహ్యరీతిలో విజయం సాధించింది. ఆ విజయాన్ని ఆస్వాదించేలోపే శుక్లా గుండెపోటుతో కన్నుమూశారు. శుక్లా చాలాకాలం పాటు ఢిల్లీలో ఓ దుకాణాన్ని నడిపారు. ఆ తర్వాత గోరఖ్‌పూర్‌ వచ్చి తన స్వగ్రామంలో స్థిరపడ్డారు. ఆయనకు ముగ్గురు కొడుకులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement