
లక్నో: ఓ మహిళ ఫోన్‌లో మాట్లాడుతూ.. చూసుకోకుండా పాముల మీద కూర్చుని మృతి చెందిన సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ గోరక్‌పూర్‌లో చోటు చేసుకుంది. రివాయ్ గ్రామానికి చెందిన జయసింగ్ థాయ్‌ల్యాండ్‌లో ఉంటాడు. అక్కడి నుంచి ఆయన తన భార్య గీతకు ఫోన్ చేశాడు. భర్తతో ఫోనులో మాట్లాడుతూ పక్కనే ఉన్న మంచంపై కూర్చుంది గీత. అయితే అప్పటికే ఆ మంచంపై రెండు పాములున్నాయి. ఆమె చూసుకోకుండా వాటిపైననే కూర్చుంది. దీంతో ఒక పాము ఆమెను కాటువేసింది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.
Comments
Please login to add a commentAdd a comment