ఇద్దరు పాకిస్తానీ ఉగ్రవాదుల అరెస్ట్ | Two suspected Pakistani terrorists arrested in Gorakhpur | Sakshi
Sakshi News home page

ఇద్దరు పాకిస్తానీ ఉగ్రవాదుల అరెస్ట్

Published Thu, Mar 27 2014 8:50 AM | Last Updated on Sat, Mar 23 2019 8:40 PM

Two suspected Pakistani terrorists arrested in Gorakhpur

గోరఖ్పూర్ : ఉత్తరప్రదేశ్లో ఇద్దరు పాకిస్తానీ ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాట్మండ్ నుంచి గోరఖ్ పూర్ వచ్చిన వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. గోరఖ్‌పూర్‌లో జరగనున్న మోడీ బహిరంగసభలో ఆత్మాహుతిదాడికి పాల్పడేందుకు వీరు యత్నిస్తున్నట్లు తెలిసింది.

ఉగ్రవాదుల దగ్గర్నుంచి రెండు ఏకే-47 తుపాకులు, నాలుగు పిస్టళ్లు, ఇతర పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల గురించి ఇటీవల అరెస్టైన వకాస్‌, ఇతర టెర్రరిస్టులు సమాచారం ఇచ్చారని తెలిసింది. ఉగ్రవాదుల అరెస్ట్‌ నేపధ్యంలో గోరఖ్‌పూర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement