terrorists arrest
-
హైదరాబాద్ ఉగ్రవాదుల అరెస్ట్ కేసులో కొత్తకోణం
-
Azadi Ka Amrit Mahotsav: అమృత్ సెల్యూట్
మువ్వన్నెల రెపరెపల నడుమ స్వాతంత్య్ర అమృతోత్సవ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. 76వ స్వాతంత్య్ర దినాతోత్సవాలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఢిల్లీలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన చారిత్రక ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం జాతీయ పతాకాన్ని ఎగరవేయనున్నారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. అమృతోత్సవాల్లో భాగంగా కేంద్రం చేపట్టిన పలు కార్యక్రమాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా పంద్రాగస్టు జోష్‌ను పతాక స్థాయికి తీసుకెళ్లాయి. హర్ ఘర్ తిరంగా పిలుపును ప్రజలంతా ఉద్యమ స్ఫూర్తితో అందిపుచ్చుకున్నారు. దాంతో త్రివర్ణ పతాక రెపరెపలతో ప్రతి ఇల్లూ పండుగ చేసుకుంటోంది. రెండేళ్లుగా కరోనా కల్లోలం మధ్యే పంద్రాగస్టు వేడుకలు జరిగాయి. దాని పంజా నుంచి బయట పడుతుండటం ఈసారి పంద్రాగస్టు ఉత్సహాన్ని రెట్టింపు చేస్తోంది. పంద్రాగస్టు ప్రసంగంలో కేంద్ర సాఫల్యాలను ప్రస్తావించడంతో పాటు పలు కొత్త పథకాలు ప్రకటించడం మోదీకి ఆనవాయితీగా వస్తోంది. 2021 ప్రసంగంలో గతి శక్తి మాస్టర్‌ప్లాన్, నేషనల్ హైడ్రోజన్ మిషన్ వంటివాటిని ఆయన ప్రకటించారు. 2020లో దేశంలోని 6 లక్షల గ్రామాలను ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు. త్రివిధ దళాల పనితీరును మరింత మెరుగు పరిచేందుకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకాన్ని 2019లో ప్రకటించారు. ఆ క్రమంలో ఈసారి మోదీ ఆరోగ్య రంగానికి సంబంధించి హీల్ ఇన్ ఇండియా, హీల్ బై ఇండియా పేరిట కొత్త పథకాలు ప్రకటిస్తారంటున్నారు. ఆయన ఎర్రకోటపై జెండా ఎగరేయడం, పంద్రాగస్టు ప్రసంగం చేయడం ఇది వరుసగా తొమ్మిదోసారి. రక్షణ వలయంలో ఢిల్లీ పంద్రాగస్టు నేపథ్యంలో కశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి దాకా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరిగాయి. ఢిల్లీలో శుక్రవారం ఆరుగురు అనుమానిత ఉగ్రవాదుల అరెస్టు నేపథ్యంలో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. 144వ సెక్షన్ అమల్లో ఉంది. అడుగడుగునా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎర్రకోట వద్ద పతాకావిష్కరణ వేడుకకు 7,000 మందికి పైగా అతిథులు రానుండటంతో 10 వేల మంది భద్రతా సిబ్బంది కోటను శత్రు దుర్భేద్యంగా మార్చేశారు. 2017లో మోదీ పంద్రాగస్టు ప్రసంగ సమయంలో ఓ పతంగి ఆయన ముందున్న పోడియంపై వచ్చి పడింది. ఈ నేపథ్యంలో ఈసారి వేడుక ముగిసేదాకా ఎర్రకోటకు 5 కిలోమీటర్ల పరిసర ప్రాంతాల్లో పతంగులు, బెలూన్లు, డ్రోన్లు ఎగరేయడాన్ని పూర్తిగా నిషేధించారు. పంద్రాగస్టు వేడుకలను బహిష్కరించాలన్న పిలుపుల నేపథ్యంలో కశ్మీర్లో భద్రతను మరింతగా పెంచారు. సరిహద్దుల వెంబడి సైన్యం, బీఎస్‌ఫ్ మరింత అప్రమత్తమయ్యాయి. – న్యూఢిల్లీ -
ఇద్దరు అల్ కాయిదా ఉగ్రవాదుల అరెస్ట్
న్యూఢిల్లీ/భువనేశ్వర్: అల్ కాయిదాకు చెందిన వారిగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో అరెస్టయిన మహమ్మద్ ఆసిఫ్ (41) భారత్‌లో అల్ కాయిదా (ఏక్యూఐఎస్) వ్యవస్థాపక సభ్యుడిగా భావిస్తున్నారు. అల్ కాయిదాలో చేరేందుకు యువతను ప్రేరేపించడం, రిక్రూట్మెంట్, శిక్షణ వంటి కార్యకలాపాలను ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్ నుంచి ఆసిఫ్ నిర్వహిస్తున్నాడు. ఒడిశా కటక్‌లోని జగత్పూర్లో అబ్దుల్ రెహమాన్‌ను అరెస్ట్ చేశారు. ఆసిఫ్ నుంచి మూడు సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, జిహాదీ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. రెహమాన్‌కు ఒక భార్య, ముగ్గురు పిల్లలున్నారు. కటక్ దగ్గర్లోని టాంగీ ప్రాంతంలో ఓ మదరసాను నడుపుతున్నట్లు సమాచారం. -
తీవ్రవాది అరెస్ట్
చెన్నైలో అనేక విధ్వంసాలకు పాల్పడేందుకు సిద్ధమవుతున్న ఐఎస్ఐ తీవ్రవాది అరుణ్ సెల్వరాజ్‌ను బుధవారం రాత్రి జాతీయ భద్రతా దళ అధికారులు చెన్నైలో అరెస్ట్ చేశారు. ఇతని నుంచి పెద్ద ఎత్తున సమాచార సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడులో, ముఖ్యంగా చెన్నైలో విధ్వంసాలను సృష్టించేందుకు తీవ్రవాదులు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు కొంతకాలంగా కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం అందుతోంది. ఇందుకు అనుగుణంగా అధికారులు చెన్నైని జల్లెడ పడుతూనే ఉన్నారు. భారత రహస్యాలను పాకిస్తాన్‌కు చేరవేస్తున్న తంజావూరుకు చెందిన పాకిస్తాన్ తీవ్రవాది తమీమ్ అన్సారీని 2012లో పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుచ్చి నుంచి శ్రీలంకకు పారిపోతుండగా వలపన్ని పట్టుకున్నారు. తంజావూరులో ఒకప్పుడు ఎర్రగడ్డల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న అన్సారీకి పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు మొదలయ్యూయి. అలాగే కొన్ని నెలల క్రితం చెన్నై తిరువల్లిక్కేనీలో దాక్కున్న తీవ్రవాది జాకీర్‌హుస్సేన్‌ను అరెస్ట్ చేశారు. ఇతనిచ్చిన సమాచారంతో అనుచరులు సలీం, శివబాలన్ పట్టుపడ్డారు. ఇలా వరుసగా తీవ్రవాదులు పట్టుపడుతున్న నేపథ్యంలో మరో కీలక వ్యక్తి నగరంలో సంచరిస్తున్నట్లు సమాచారం అందింది. నగరంలో గాలింపు చర్యల్లో ఉన్న జాతీయ భద్రాతా దళాల వారు అరుణ్ సెల్వరాజ్‌ను బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. శ్రీలంక నుంచి మూడేళ్ల క్రితమే చెన్నైకి చేరుకున్న అరుణ్ సెల్వరాజ్ ఎవరికీ అనుమానం రాకుండా ఈవెంట్ మేనేజర్ అవతారం ఎత్తి ప్రముఖులతో పరిచయాలు పెంచుకున్నాడు. మరోపక్క చెన్నైలోని ముఖ్య ప్రదేశాలను ఫొటోలు తీసి పాకిస్థాన్‌కు పంపేవాడు. పరంగిమలైలోని సైనిక శిక్షణ కేంద్రం, జాతీయ భద్రతా దళాల క్యాంప్, ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాలు ఇతను తీసిన ఫొటోల్లో ఉన్నాయి. ఈ ఫొటోలు ఇతర సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేసేందుకు ఉపయోగిస్తున్న ల్యాప్‌టాప్, పెన్ డ్రైవ్, శ్రీలంక నుంచి తీసుకున్న పాస్‌పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరుణ్ సెల్వరాజ్‌ను పూందమల్లిలోని ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి మోని ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ విధించారు. గతంలో అరెస్టయిన జాకీర్‌హుస్సేన్, శివబాలన్, తాలిక్, రబీక్లను పోలీస్ కస్టడీలో విచారించేందుకు అనుమతించాలని పోలీసులు కోరగా 25వ తేదీ వరకు విచారణకు న్యాయమూర్తి అనుమతించారు. బాంబు బూచీలు నగరంలో తీవ్రవాదుల అరెస్ట్‌లు ఒకవైపు కొనసాగుతుండగా కొందరు ఆకతాయిలు బాంబు బూచీలతో ఆడుకుంటున్నారు. సెంట్రల్ రైల్వే స్టేషన్‌లోని 4,5 ఫ్లాట్‌ఫారాల్లో మరికొంత సేపట్లో బాంబులు పేలనున్నాయంటూ చెన్నై జాంబజార్‌కు చెందిన శ్రీధర్ అనే వ్యక్తికి బుధవారం అర్ధరాత్రి 12.50 గంటలకు ఫోన్ వచ్చింది. ఆయన పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయగా హుటాహుటిన పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. తెల్లవారుజాము 5 గంటల వరకు సెంట్రల్లో తనిఖీలు చేపట్టి ఆకతాయి చేష్టగా తీర్మానించారు. అలాగే తిరువత్తియూరులోని పాలిటెక్నిక్ కళాశాలలో మరికొద్దిసేపట్లో బాంబులు ఉన్నాయి, కాపాడండీ అంటూ విదేశం నుంచి ఫోన్ వచ్చింది. విద్యార్థులను క్లాసు రూముల నుంచి బయటకు పంపి బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. అదికూడా ఆకతాయి పనేనని తేలింది. -
ఇద్దరు పాకిస్తానీ ఉగ్రవాదుల అరెస్ట్
గోరఖ్‌పూర్ : ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు పాకిస్తానీ ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాట్మండ్ నుంచి గోరఖ్ పూర్ వచ్చిన వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. గోరఖ్‌పూర్‌లో జరగనున్న మోడీ బహిరంగసభలో ఆత్మాహుతిదాడికి పాల్పడేందుకు వీరు యత్నిస్తున్నట్లు తెలిసింది. ఉగ్రవాదుల దగ్గర్నుంచి రెండు ఏకే-47 తుపాకులు, నాలుగు పిస్టళ్లు, ఇతర పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల గురించి ఇటీవల అరెస్టైన వకాస్, ఇతర టెర్రరిస్టులు సమాచారం ఇచ్చారని తెలిసింది. ఉగ్రవాదుల అరెస్ట్ నేపధ్యంలో గోరఖ్‌పూర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. -
నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్
-
నలుగురు తీవ్రవాదుల అరెస్ట్
జైపూర్: ఎన్నికల్లో బాంబు పేలుళ్లు సృష్టించాలనుకున్న తీవ్రవాదుల కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎం) తీవ్రవాదులుగా అనుమానిస్తున్న నలుగురిని అరెస్ట్ రాజస్థాన్‌లో అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పాకిస్థాన్ తీవ్రవాది టెర్రరిస్ట్ ఖ్వాస్ అలియాస్ మోనూ ఉన్నట్టు తెలుస్తోంది. జైపూర్‌లో ముగ్గురు, జోథ్‌పూర్‌లో ఒకరిని ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి భారీగా డిటోనేటర్లు, బాంబు తయారీ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై, పాట్నా, బుద్ధగయ పేలుళ్లతో మోనూకు సంబంధం ఉంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎక్కడెక్కడ బాంబు పేలుళ్లకు కుట్రలు పన్నారనే అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.