ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎం) తీవ్రవాదులుగా అనుమానిస్తున్న నలుగురిని అరెస్ట్ రాజస్థాన్లో అదుపులోకి తీసుకున్నారు.
జైపూర్: ఎన్నికల్లో బాంబు పేలుళ్లు సృష్టించాలనుకున్న తీవ్రవాదుల కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎం) తీవ్రవాదులుగా అనుమానిస్తున్న నలుగురిని అరెస్ట్ రాజస్థాన్లో అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పాకిస్థాన్ తీవ్రవాది టెర్రరిస్ట్ ఖ్వాస్ అలియాస్ మోనూ ఉన్నట్టు తెలుస్తోంది. జైపూర్‌లో ముగ్గురు, జోథ్‌పూర్‌లో ఒకరిని ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా వీరిని అదుపులోకి తీసుకున్నారు.
వీరి వద్ద నుంచి భారీగా డిటోనేటర్లు, బాంబు తయారీ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై, పాట్నా, బుద్ధగయ పేలుళ్లతో మోనూకు సంబంధం ఉంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎక్కడెక్కడ బాంబు పేలుళ్లకు కుట్రలు పన్నారనే అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.