సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ వర్సెస్ సమాజ్‌వాదీపార్టీ అన్నట్టుగా నడుస్తోంది ఎన్నికల రాజకీయం. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ అర్బన్ నియోజకవర్గం స్థానం నుంచి పోటీ చేస్తుండటంతో ఆ స్థానం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదేక్రమంలో గోరఖ్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా రాధా మోహన్‌దాస్ అగర్వాల్‌కు బీజేపీ హైకమాండ్ ఏ సీటు కేటాయిస్తుందో ఇంకా స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో గోరఖ్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాధా మోహన్‌దాస్ అగర్వాల్‌కు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు.
సమాజ్‌వాదీ పార్టీలో చేరి సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై పోటీచేయాలని ప్రతిపాదించారు. ఆయన రావడానికి ఆసక్తిగా ఉంటే,.. గోరఖ్‌పూర్ అర్బన్ సీటును కేటాయించడానికి సిద్ధమని అన్నారు. 2002 నుంచి రాధా మోహన్‌దాస్ గోరఖ్‌పూర్ అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటీవలే ముగ్గురు మంత్రులు, ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రంలో ఫిబ్రవరి 10న మొదలయ్యే అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మార్చి 10 వరకు కొనసాగనుంది. మొత్తం 7 దశల్లో ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల సంఘం ఇటీవలే షెడ్యూల్ ప్రకటించింది.
(చదవండి: పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన కేజ్రీవాల్)
Comments
Please login to add a commentAdd a comment