
లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. గురువారం చౌరీ-చౌరా పోలీస్ స్టేషన్‌లో చిన్నపాటి వాగ్వాదంతో హెడ్‌కానిస్టేబుల్ అరవింద్ యాదవ్ ఏకంగా కన్న కుమారుడినే కాల్చిచంపిన ఘటన వెలుగుచూసింది. ఈ ఘటనలో నిందితుడు అరవింద్ యాదవ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన లైసెన్స్డ్ గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. తండ్రీకొడుకుల మధ్య చిన్నపాటి వివాదంతో ఆగ్రహంతో ఊగిపోయిన అరవింద్ యాదవ్ కుమారుడిపై కాల్పులు జరపగా ఘటనా స్థలంలోనే బాధితుడు మరణించాడని సీఐ సుమిత్ శుక్లా తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి అతడి నుంచి లైసెన్స్డ్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మృతుడిని నిందితుడి మొదటి భార్య కుమారుడు, ఘజీపూర్‌లో నివసించే వికాస్ యాదవ్‌గా గుర్తించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment