తల్లి మృతదేహాన్ని నాలుగు రోజులు బెడ్ కింద దాచిన కుమారుడు | Up Gorakhpur Man Kept Mothers Body Under Bed For 4 Days | Sakshi
Sakshi News home page

తల్లి మృతదేహాన్ని ఇంట్లో బెడ్ కింద  దాచిన కుమారుడు.. నాలుగు రోజుల తర్వాత.. 

Published Tue, Dec 13 2022 9:28 PM | Last Updated on Wed, Dec 14 2022 6:02 AM

Up Gorakhpur Man Kept Mothers Body Under Bed For 4 Days - Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పుర్‌లో ఓ వ్యక్తి తన తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే బెడ్ కింద దాచాడు. నాలుగు రోజుల పాటు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. అయితే ఇంట్లో నుంచి దుర్వాసన ఎక్కువగా రావడంతో చుట్టుపక్కల వాళ్లకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన వారు ఆ వ్యక్తి ఇంట్లో బెడ్ కింద అతని తల్లి శవాన్ని చూసి షాక్ అయ్యారు.

ఆమె నాలుగు రోజుల క్రితమే చనిపోయిందని కుమారుడు పోలీసులకు చెప్పాడు. దుర్వాసన రాకుండా రోజూ ‍‍అగరొత్తులు వెలిగించినట్లు పేర్కొన్నాడు. మృతురాలిని శాంతి దేవి(82)గా గుర్తించారు. ఆమె విశ్రాంత ఉపాధ్యాయురాలు. భర్త 10 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. కుమారుడు నిఖిల్‌తో పాటు శివ్‌పుర్‌ సహబాజ్‌గంజ్‌లో నివసిస్తోంది. 

అయితే నిఖిల్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని పోలీసులు తెలిపారు. అతను డ్రగ్స్‌కు బానిస కావడంతో భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. శాంతి దేవి అనారోగ్య కారణాలతోనే మరణించి ఉంటుందని, పోస్టుమార్టం నివేదిక వచ్చాక నిజా నిజాలు తెలుస్తాయని పేర్కొన్నారు.
చదవండి: శ్రద్ధ వాకర్‌ తరహా ఘటన..తండ్రిని చంపి 32 ముక్కలు చేసిన కుమారుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement