bad smell
-
ముక్కు‘మూసీ’..
భూదాన్‌పోచంపల్లి: మూసీ కాలుష్య కాసారంగా మారింది. హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి వరద దిగువకు వచ్చి మూసీలో చేరుతోంది. దీంతో మంగళవారం మూసీ నది పరవళ్లు తొక్కింది. అయితే జంటనగరాల్లోని మురుగు, కాలుష్యం, చెత్తాచెదారం, గుర్రపుడెక్క ఆకు అంతా మూసీలోకి వచ్చి చేరడంతో.. దుర్గంధం వెదజల్లుతూ ప్రవాహం సాగుతోంది.యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్‌పోచంపల్లి మండలం పిలాయిపల్లి, జూలూరు. పెద్దరావులపల్లి వద్ద నల్లటి మూసీ నది నీరు దుర్వాసన వెదజల్లుతూ చెత్తాచెదారంతో ప్రవహించింది. కాగా జూలూరు వద్ద లోలెవల్ బ్రిడ్జిపై నుంచి మూసీ ప్రవహించడంతో.. ఈ మార్గంలో బీబీనగర్, భువనగిరికి రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ ప్రవహిస్తున్న విషయం తెలియక.. ఇబ్రహీంపట్నం నుంచి పోచంపల్లి మీదుగా భువనగిరికి వెళ్లే ఆర్టీసీ బస్సు మూసీనది వరకు వచ్చి తిరిగి వెనక్కి వెళ్లి పెద్దరావులపల్లి మీదుగా భువనగిరికి చేరింది. అయితే మూసీ ఉధృతి కొనసాగుతుండటంతో ఈ మార్గంలో వాహనాలు వెళ్లకుండా అధికారులు మూసీకి ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. -
ఇదేం పువ్వురా బాబూ.. ముక్కు పేలిపోతోంది.. ఇది ప్రపంచంలోనే
అది ప్రపంచంలోనే అత్యంత పెద్ద పుష్పం.. అయితే దానిని చూడాలని ముచ్చట పడితే.. అంతే సంగతులు. ఎందుకంటే దానికి మనం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండగానే.. దాని నుంచి మన ముక్కులు పేలిపోయేంత దుర్వాసన వస్తుంది. రండి.. ఆ పువ్వు కథేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత దుర్వాసన వెదజల్లే పువ్వు పేరు ‘కార్ప్స్ ఫ్లవర్’ ఈ పుష్పం ఎంతో ప్రత్యేకమైనది. ఈ పువ్వు పదేళ్లకు ఒకసారి మాత్రమే వికసిస్తుంది. ఈ పువ్వు వికసించగానే దాని నుంచి కొన్ని కిలోమీటర్ల దూరం వరకూ దుర్వాసన వ్యాపిస్తుంది. కార్ప్స్ ఫ్లవర్‌ను టైటాన్ వాన్కాగ్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఇది అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీలో వికసించింది. ఈ పుష్పం 24 గంటల నుంచి 48 గంటల పాటు వికసిస్తుంది. దీని నుంచి కుళ్లిన మాంసం వాసన వస్తుంది. అందుకే దీనిని శవ పుష్పమని, మృత్యు పుష్పమని కూడా అంటారు. దీనికి ముందు ఈ పుష్పం కరోనా కాలంలో అమెరికాలోని ఫ్రాన్సిస్కోలో కనిపించింది. అప్పుడు కూడా ఈ పుష్పం చర్చల్లో నిలిచింది. కొన్ని కిలోమీటర్ల వరకూ దీని దుర్వాసన వ్యాపిస్తుండంతో స్థానికులు పలు ఇబ్బందులు పడుతుంటారు. 2011లోనూ ఈ పుష్పం వికసించింది. ఇది చూసేందుకు ఎంతో వింతగా ఉంటుంది. ఇది అతి అరుదైన పుష్పం. ఈ పుష్పం 12 అడుగుల ఎత్తు కలిగివుంటుంది. ఈ పుష్పం వికసించేందుకు 10 ఏళ్లు పడుతుంది. ఈ కాలం ముగిశాకనే అది పూర్తిస్థాయిలో వికసిస్తుంది. అప్పుడు అది ఎంతో అందంగా కనిపిస్తుంది. అయితే దీనిని చూడాలనుకుంటే ముక్కు మూసుకోవాల్సిందే. ఇది కూడా చదవండి: ఇకపై రెంట్‌కు డాడీ.. మమ్మీ చిల్ అవ్వొచ్చు! -
ఒడిశా: ప్రమాద స్థలంలో ఇంకా మృతదేహాలు ఉన్నాయా?
ఒడిశాలో రైలు ప్రమాదం జరిగిన స్థలం దగ్గర విపరీతమైన దుర్వాసనలు వెలువడుతున్నాయి. దీనిపై ఫిర్యాదు చేసిన స్థానికులు అక్కడ ఇంకా మృతదేహాలు ఉన్నాయనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదు అందగానే రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దుర్వాసన రావడానికి గల కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు. భువనేశ్వర్ అది ఒడిశాలోని బాలాసోర్ పరిధిలోని బహనాగా బాజార్ రైల్వే స్టేషన్. వారం రోజుల క్రితం (జూన్ 2)న ఈ స్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 288 మంది ప్రయాణికులు మృతిచెందారు. ఈ ఘటన జరిగిన 7 రోజులు గడిచినా ఇప్పటికీ బహనాగా బాజార్ ప్రజలు ప్రమాద దృశ్యాలను మరువలేకపోతున్నారు. బహనాగా బాజార్ ప్రాంతంలో ఉంటున్నవారు చెబుతున్న దానిప్రకారం సంఘటనా స్థలంలో ఇంకా మృతదేహాలు ఉండే అవకాశం ఉంది. అటువైపు వెళుతున్నప్పుడు దుర్వాసన వెలువడుతోందని వారు చెబుతున్నారు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తిన దరిమిలా రైల్వే అధికారులు సంఘటనా స్థలంలో తనిఖీలు చేపట్టగా, ఒక్క మృతదేహం కూడా లభ్యం కాలేదు. ఘటనా స్థలంలో రెండు సార్లు పరిశీలనలు సౌత్ ఈస్ట్రన్ రైల్వే సీపీఆర్ఓ ఆదిత్య కుమార్ చౌదరి మాట్లాడుతూ ఎన్డీఆర్ఎఫ్ సంఘటనా స్థలంలో రెండుసార్లు పరిశీలనలు జరిపిందని, ఆ తరువాతనే సైట్ క్లియరెన్స్ ఇచ్చిందని తెలిపారు. ఇది జరిగిన తరువాత కూడా స్థానికుల ఫిర్యాదుతో రాష్ట్రప్రభుత్వ అధికారుల బృందం సంఘటనా స్థలంలో పరిశీలనలు జరిపిందన్నారు. అయితే సంఘటనా స్థలంలోవున్న గుడ్ల కారణంగానే ఈ విధమైన దుర్వాసన వస్తున్నదన్నారు. ఇది కూడా చదవండి: దేశానికి మరో ముప్పు ఉంది దుర్ఘటన సమయంలో 4 టన్నుల గుడ్ల రవాణా రైల్వే సీపీఆర్ఓ తెలిపిన వివరాల ప్రకారం యశ్వత్‌పూర్- హౌరా ఎక్స్‌ప్రెస్‌లో సుమారు 4 టన్నుల గుడ్లు లోడ్ చేశారు. ప్రమాద సమయంలో ఆ గుడ్లన్నీ పగిలిపోయాయి. ఈ ఘటన జరిగి ఏడు రోజులు కావడంతో ఆ గుడ్లన్నీ విపరీతంగా కుళ్లిపోయాయి. అందుకే ఇప్పుడు ఆ ప్రాంతంలో విపరీతమైన దుర్వాసన వస్తున్నదన్నారు. ఈ గుడ్ల చెత్తను తొలగించేందుకు బాలాసోర్ మున్సిపల్ సిబ్బంది సహాయం తీసుకుంటున్నామన్నారు. ఇది కూడా చదవండి: మృతదేహాలను ఉంచిన స్కూల్ కూల్చివేత -
తల్లి మృతదేహాన్ని నాలుగు రోజులు బెడ్ కింద దాచిన కుమారుడు
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పుర్‌లో ఓ వ్యక్తి తన తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే బెడ్ కింద దాచాడు. నాలుగు రోజుల పాటు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. అయితే ఇంట్లో నుంచి దుర్వాసన ఎక్కువగా రావడంతో చుట్టుపక్కల వాళ్లకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన వారు ఆ వ్యక్తి ఇంట్లో బెడ్ కింద అతని తల్లి శవాన్ని చూసి షాక్ అయ్యారు. ఆమె నాలుగు రోజుల క్రితమే చనిపోయిందని కుమారుడు పోలీసులకు చెప్పాడు. దుర్వాసన రాకుండా రోజూ అగరొత్తులు వెలిగించినట్లు పేర్కొన్నాడు. మృతురాలిని శాంతి దేవి(82)గా గుర్తించారు. ఆమె విశ్రాంత ఉపాధ్యాయురాలు. భర్త 10 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. కుమారుడు నిఖిల్‌తో పాటు శివ్‌పుర్ సహబాజ్‌గంజ్‌లో నివసిస్తోంది. అయితే నిఖిల్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని పోలీసులు తెలిపారు. అతను డ్రగ్స్‌కు బానిస కావడంతో భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. శాంతి దేవి అనారోగ్య కారణాలతోనే మరణించి ఉంటుందని, పోస్టుమార్టం నివేదిక వచ్చాక నిజా నిజాలు తెలుస్తాయని పేర్కొన్నారు. చదవండి: శ్రద్ధ వాకర్ తరహా ఘటన..తండ్రిని చంపి 32 ముక్కలు చేసిన కుమారుడు -
Bad Breath: నోటి దుర్వాసనా.. భోజనం చివర్లో పెరుగన్నం తింటే!
Top 7 Remedies For Bad Breath: నేటి తరుణంలో నోటి దుర్వాసన సమస్య చాలా మందిని ఇబ్బందులు పెడుతున్నది. కొందరికి ఏం తిన్నా తినకపోయినా నోటి దుర్వాసన వస్తుంటుంది. అయితే అందుకు అనేక కారణాలు ఉంటాయి. అవేమి ఉన్నప్పటికీ నోటి దుర్వాసనను పోగొట్టుకోవడం సులభమే. అదెలాగంటే... భోజనం చేశాక ఈ కింది పదార్థాలు తీసుకుంటే సరి! దాంతో నోటి దుర్వాసన సమస్యను తగ్గించుకోవచ్చు. నోటి దుర్వాసన నివారణకు సులువైన చిట్కాలు 1. పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి నోటి దుర్వాసన సమస్యను పోగొడతాయి. భోజనం చివర్లో కచ్చితంగా పెరుగన్నంతో తినడం అలవాటు చేసుకుంటే నోట్లో ఉండే చెడు బాక్టీరియా నశిస్తుంది. ఫలితంగా నోరు దుర్వాసన రాదు. 2. భోజనం చేశాక 30 నిమిషాల తరువాత గ్రీన్ టీ తాగండి. ఇందులో ఉండే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు క్రిములను నాశనం చేస్తాయి. దీంతో నోట్లో ఉండే బాక్టీరియా నశించి నోటి దుర్వాసన తగ్గుతుంది. 3. ఆహారంలో క్యాప్సికమ్, బ్రొకోలిలను భాగం చేసుకోవాలి. వీటిలో ఉండే విటమిన్ సి క్రిములను చంపేస్తుంది. దీంతో నోరు దుర్వాసన రాకుండా ఉంటుంది. 4. విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను తినాలి. నారింజ, కివీ, స్ట్రాబెర్రీ, పైనాపిల్ వంటి పండ్లను తింటుంటే నోటి దుర్వాసన రాదు. దంత సమస్యలు కూడా పోతాయి. చిగుళ్లు, దంతాలు దృఢంగా మారుతాయి. 5. భోజనం చేశాక ఒకటి రెండు లవంగాలను నోట్లో వేసుకుని చాలా సేపు అలాగే చప్పరించాలి. దీంతో నోటి దుర్వాసనను తగ్గించుకోవచ్చు. లవంగాల్లో ఉండే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు క్రిములను నాశనం చేసి నోటి దుర్వాసనను తగ్గిస్తాయి. 6. భోజనం చేసిన తరువాత టీస్పూన్ సోంపు తిన్నా నోటి దుర్వాసన తగ్గి, నోరు ఫ్రెష్ అవుతుంది. 7. భోజనం చేశాక ఒకటి రెండు పుదీనా లేదా తులసి ఆకులను అలాగే పచ్చిగా నమిలేయాలి. దీంతో నోటి దుర్వాసన సమస్య నుంచి బయట పడవచ్చు. చదవండి👉🏾Barley Water Health Benefits: బార్లీ నీళ్లు.. అద్భుత ప్రయోజనాలు.. రోజూ గ్లాసుడు తాగారంటే! -
నోటి దుర్వాసనా.. ఇలా దూరం చేసుకోండి!
పదిమందిలో మాట్లాడాలంటే ఎంతో ఇబ్బంది కలిగించే అంశం.. నోటి నుంచి దుర్వాసన! సాధారణంగా ధూమపానం, మద్యపానం, గుట్కా, తంబాకు, వక్కపొడి లాంటి అలవాట్లున్నవారిలో ఈ సమస్య అధికం. కానీ కొంతమందిలో పైన చెప్పిన ఎలాంటి అలవాట్లు లేకున్నా, ఈ సమస్య కనిపిస్తుంటుంది. ఇందుకు ప్రధానంగా రెండు కారణాలుంటాయి. మొదటిది సరైన నోటి శుభ్రత (ఓరల్ హైజీన్) పాటించకపోవడం, రెండవది కడుపులో జీర్ణవ్యవస్థ పనితీరు సరిగా లేకపోవడం. నోటి దుర్వాసన సమస్యను వైద్య పరిభాషలో ‘హాలిటోసిస్’ అంటారు. నోటి నుంచి దుర్వాసన వస్తోందంటూ డాక్టరును సంప్రదిస్తే మొదటగా ఆయన అడిగే ప్రశ్న ‘మీరు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారో కాస్త చెప్పండి’ అంటూ మనం తీసుకునే ఆహారం గురించే అడుగుతారు.ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లతో కూడిన ఆహారం, తాజా తాజా పండ్లు, కూరగాయలు సమృద్ధిగా తినాలంటారు. అలాగే ద్రవ పదార్థాలు పుష్కలంగా తాగాలంటారు. ఇవన్నీ మీ గ్యాస్ట్రో ఇంటస్టైనల్ ట్రాక్ట్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. దాంతో కడుపులో ఎలాంటి అనారోగ్యకరమైన పరిస్థితులూ తలెత్తవు. ఆహారం తీసుకున్న తర్వాత తీసుకోవాల్సిన మరో జాగ్రత్త కూడా ఉంది. అదే... ఆహారం తీసుకున్న ప్రతిసారీ ఫ్లాసింగ్ ప్రక్రియ ద్వారా దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాలు బెటర్.. నోటి దుర్వాసనను సమర్థంగా ఎదుర్కోవడంలో కొత్తిమీర, పుదీన, యూకలిప్టస్, రోజ్మేరీ, ఏలక్కాయ వంటివి బాగా పని చేస్తాయి. ఈ ఔషధీయ పదార్థాలను అలాగే నమలడం లేదా వాటిని నీటిలో మరిగించి ఆ టీని తాగడం వల్ల జీర్ణవ్యవస్థలోని అపసవ్యతలు తగ్గి, పనితీరు మెరుగవుతుంది. దాంతో నోటి దుర్వాసనా దూరమవుతుంది. అలాగే మనం రెగ్యులర్‌గా తీసుకునే ఆహారం తరవాత కూడా చివరగా ఏలక్కాయ, కొత్తిమీర, పుదీన వంటి వాటిని తినడం ద్వారా నోటి దుర్వాసనను దూరంగా ఉండవచ్చు. తాజాపరిశోధనల ప్రకారం... రోజూ తాజా పెరుగు తీసుకోవడం ద్వారా నోటి దుర్వాసనకు కారణమైన హైడ్రోజెన్ సల్ఫేడ్ పాళ్లను అదుపుచేయవచ్చు. పెరుగును క్రమంతప్పకుండా తీసుకోవడం ద్వారా దంతాల మీద పాచి పేరుకోవడాన్ని, చిగుళ్ల వ్యాధులను కూడా నివారించవచ్చు. నమిలినప్పుడు కరకరలాడే (అంటే క్రంచీగా అనిపించే పండ్లు) పండ్లు అయిన ఆపిల్స్, క్యారట్స్ వంటి పీచు పదార్ధాలు సమృద్ధిగా ఉండేవాటినీ, కూరగాయలు నోటి దుర్వాసనకు విరుగుడుగా పని చేస్తాయి. వీటిని తినడం వల్ల లాలాజలం ఎక్కువగా విడుదలై నోటిని శుభ్రంగా ఉంచుతుంది. కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లతో కూడిన చాలా రకాల పోషకాహారం దంతాల మీద పాచి పేరుకోవడానికి దోహదం చేస్తుంది. ఈ సమస్యను పండ్లు, ఆకుకూరలు, కాయగూరలను తీసుకోవడం ద్వారా అధిగమించవచ్చు. హాలిటోసిస్‌కు చిగుళ్ల వ్యాధులు, జింజవైటిస్ వంటి దంతాల సమస్యలు ముఖ్యమైన కారణాలు. వీటిని నివారించాలంటే‘సి’ విటమిన్ పుష్కలంగా ఉండే నిమ్మజాతి పండ్లు, ఉసిరితో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. చదవండి: నిద్ర రావడం కోసం అద్భుత చిట్కాలు -
‘సాగర్ దుర్గంధం భరించలేకున్నాం’
సాక్షి,హైదరాబాద్: నెక్లెస్ రోడ్డుపై వెళుతూ కారు అద్దాలు మూసుకున్నప్పటికీ హుస్సేన్‌సాగర్ నుంచి వచ్చే దుర్వాసన భరించలేనిదిగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. మురికినీరు శుద్ధికి ఏర్పాటు చేసిన శుద్ధి కేంద్రాలు కొన్ని చోట్ల పనిచేస్తున్నట్లు కనిపించడం లేదంది. గతంలో చెరువుల్లో నీరు ఎంత పరిశుభ్రంగా ఉండేదో ఆ స్థితికి చెరువులను తీసుకొచ్చినప్పుడే వాటిని పరిరక్షించినట్లని తెలిపింది. జంట నగరాల్లో చెరువుల శుద్ధికి జియో ట్యూబ్ టెక్నాలజీని ఉపయోగించే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ల ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి పరిధిలోని మల్కం చెరువును ఆక్రమణల నుంచి కాపాడాలని కోరుతూ ఐపీఎస్ అధికారి అంజనాసిన్హా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై సామాజిక కార్యకర్త లుబ్నా సారస్వత్, మత్స్యకారుడు సుధాకర్‌లు కూడా వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను సీజే నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. -
ఏందీ..వాసన..!
ఒకప్పుడు స్వచ్ఛమైన జలాలతో అలరారిన చారిత్రక హుస్సేన్‌సాగర్ గరళ కాసారంగా మారింది. మండుటెండలో సాగర తీరాన సేదదీరేందుకు నెక్లెస్ రోడ్‌కు వచ్చేవారికి సాగర్ నుంచి వచ్చే దుర్వాసన స్వాగతం పలుకుతోంది. దీంతో కొందరు తలనొప్పి, వాంతులు, కళ్లు తిరగడం వంటి సమస్యలతో సతమతమవుతుండడం పరిపాటిగా మారింది. ఇప్పటికే ఘనవ్యర్థాలు, గుర్రపుడెక్కతో సాగరజలాలు నిండిపోయాయి. ఇందులోని బ్యాక్టీరియా..కూకట్పల్లి, బాలానగర్ నాలా ద్వారా చేరుతున్న పారిశ్రామిక రసాయన వ్యర్థజలాల్లోని సల్ఫేట్‌ను గ్రహిస్తుండడంతో రసాయనిక చర్య జరిగి ‘హైడ్రోజన్ సల్ఫేట్’ వాయువు పెద్ద మొత్తంలో వెలువడుతోంది. ఈ దుర్వాసనకు ఇదే కారణమని నిపుణులు తేల్చారు. ప్రస్తుతం జలాశయం నీటిలో కరిగిన ఆక్సిజన్ శాతం సున్నాకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మండుటెండలకు ఈ వాయువు తీవ్రత మరింత పెరుగుతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరో వైపు సాగర్ ప్రక్షాళన పేరిట వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఫలితం లేదు. సాక్షి, సిటీబ్యూరో: హుస్సేన్‌సాగర్ జలాల్లోకి కూకట్పల్లి నాలా రసాయన వర్థాలు కలవకుండా ఉండేందుకు నాలా మళ్లింపు పనులను పూర్తిచేసినట్లు ఆర్భాటంగా ప్రకటించిచారు. కానీ ఈ నాలా నుంచి పారిశ్రామిక వ్యర్థాలు జలాశయంలోకి నేటికీ చేరుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు దశాబ్దాలుగా బల్క్‌డ్రగ్, ఫార్మా కంపెనీలు వెదజల్లిన గరళాన్ని తన గర్భంలో దాచుకుని.. జలాశయం అట్టడుగున గడ్డకట్టుకుపోయిన ఘన వ్యర్థాల తొలగింపు పనులను తాత్కాలికంగా నిలిపివేయడంతో ప్రక్షాళనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే తరుణంలో జలాశయం ఉపరితల భాగంలో తెట్టులా పేరుకున్న వ్యర్థాల తొలగింపునకు విదేశాల్లో వినియోగించే ఎనిమిదికాళ్ల ఎక్స్‌కవేటర్‌ను ప్రక్షాళనకు వినియోగిస్తున్నప్పటికీ ఇవన్నీ పైపై మెరుగులేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. జలాశయం ప్రక్షాళన పర్వంలో ప్రస్తుతానికి సాధించింది గోరంతేనని.. చేయాల్సిన పనులు కొండంత ఉన్నాయని పర్యావరణ వాదులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం పీవీ జ్ఙానభూమి నుంచి కిమ్స్ ఆస్పత్రి మార్గంలో సాగరజలాల్లో ఘన వ్యర్థాలు గుట్టలుగా పోగుపడడం ప్రస్తుతం సాగర్ దుస్థితికిఅద్దంపడుతోంది. మిషన్ హుస్సేన్సాగర్లోచేపట్టాల్సినవి.. జలాశయం నీటిని ల్యాండ్ స్కేపింగ్, గార్డెనింగ్ అవసరాలకు వాడుకునే స్థాయిలో నీటి నాణ్యతను మెరుగుపరచాలి. సాగర్‌లోకి ఘనవ్యర్థాలు చేరకుండా చర్యలు చేపట్టాలి. దశాబ్దాలుగా జలాశయం అడుగున బెడ్‌లా ఏర్పడిన ఘన వ్యర్థాలను డ్రెడ్జింగ్ ప్రక్రియ ద్వారా తొలగించాలి. నాలుగు నాలాల నుంచి చేరుతున్న మురుగునీటిని దారి మళ్లించడం తప్పనిసరి. జలాశయం, దాని పరిసరాల్లో జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలి. హుస్సేన్‌సాగర్ వద్దనున్న 20 ఎంఎల్డీ ఎస్టీపీ అధునికీకరణతో పాటు సామర్థ్యం పెంచాలి. హుస్సేన్‌సాగర్ చుట్టూ రింగ్ సీవర్ మెయిన్స్ నిర్మించి మురుగునీరు జలాశయంలో చేరకుండా చూడాలి. శుద్ధిచేసిన నీరు మాత్రమే జలాశయంలోకి ప్రవేశించే ఏర్పాటు చూడాలి. జలాశయంలో ఆక్సిజన్ శాతం పెంచేందుకు ఏరియేషన్ వ్యవస్థ ఏర్పాటు తప్పనిసరి. స్వచ్ఛ‘సాగర’ం దిశగా.. హుస్సేన్ సాగర్‌ను స్వచ్ఛంగా మార్చే దిశగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఆథారిటీ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాన్నివ్వలేదు. కెనడాకు చెందిన ఎజాక్స్ ఎన్విరాన్మెంట్ ఎల్ఎల్పీ ఆధునిక సాంకేతికతతో జలాశయంలో ఆక్సిజన్ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు గతేడాది మార్చిలో ప్రయోగాత్మకంగా ఓ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా శాటిలైట్ సహాయంతో మైక్రోవేవ్స్‌ను నీటిలోకి పంపించారు. దీంతో నీటిలో ఆక్సిజన్ మోతాదు పెరుగుతుందని.. తద్వారా సాగర గర్భంలో ఉన్న నైట్రేట్, పాస్పేట్ వంటి మూలకాలు ఉపరితలంపైకి వచ్చి ఆల్గేగా ఏర్పడుతాయని ఆర్భాటంగా ప్రకటించారు. ఈ ఆల్గేను దశలవారీగా తొలగించడం ద్వారా నీటి నాణ్యత మెరుగుపడుతుందనీ చెప్పారు. కానీ ఈ ప్రయోగం విఫలమవడంతో నెలరోజుల క్రితమే ఈ పనుల నుంచి ఎజాక్స్ కంపెనీ తప్పుకున్నట్లు తెలిసింది. మరోసారి హెచ్ఎండీఏ సన్నద్ధం.. కాలుష్యంతో నిండిన హుస్సేన్‌సాగర్‌ను స్వచ్ఛంగా మార్చేందుకు హెచ్ఎండీఏ మరోసారి సన్నద్ధమవుతోంది. అత్యాధునిక పరిజ్ఞానంతో ఆరు నెలల నుంచి ఏడాదిలోపు మార్పు కనిపించేలా సాంకేతిక చికిత్స అందజేసేందుకు ముందుకు రావాలంటూ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. దాదాపు ఎనిమిది అంతర్జాతీయ కంపెనీలు బిడ్ దాఖలు చేశాయి. ఆయా కంపెనీల అనుభవం, పనితీరును బట్టి త్వరలోనే ఫైనల్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా జలమండలి సీఐపీపీ సాంకేతిక పరిజ్ఞానంతో తెలుగుతల్లి ఫైఓవర్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వరకు భారీ మురుగునీటి పైప్‌లైన్ మరమ్మతు పనుల వల్ల నేరుగా మురుగునీరు, రసాయన కారకాలు సాగర్‌లో కలుస్తుండడంతో మురికి కూపంగా మారడం గమనార్హం. దీనివల్ల డీఓ (కరిగిన ఆక్సిజన్) తగ్గి, బయాలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ) డిమాండ్ పెరిగిపోయినట్టుగా స్పష్టమవుతోంది. సాగర మథనం సాగుతోందిలా.. ♦ ప్రధానంగా కలుస్తోన్న నాలాలు: కూకట్పల్లి, పికెట్, బుల్కాపూర్, బంజారా నాలా ♦ ప్రక్షాళనకు తీసుకున్న చర్యలు: 2006లో రూ.270 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం, ఘన వ్యర్థాల తొలగింపు ♦ 2014లో: రూ.56 కోట్లతో కూకట్పల్లి నాలా డైవర్షన్ పనులు ♦ 2015: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఎనిమిదికాళ్ల ఎక్స్‌కవేటర్‌తో వ్యర్థాలు తొలగింపు ♦ 2017: హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో సాగర జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు కెనడాకు చెందిన ఎజాక్స్ కంపెనీ శాటిలైట్ ఆధారిత టెక్నాలజీ వినియోగం (ఈ ప్రయోగాన్ని ఉచితంగానే చేశారు) ♦ ప్రక్షాళనకు దశాబ్దకాలంలో చేసిన వ్యయం: సుమారు రూ.326 కోట్లు -
కంపుకొడుతోంది..
మందమర్రి : పట్టణంలోని కూరగాయల మార్కెట్ ప్రాంతం కంపుకొడుతోంది. ఇష్టారా జ్యంగా నిర్వాహకులు చికెన్, చేపల వ్యర్థాలు మురుగుకాల్వల్లో పడేస్తుండడంతో దుర్వాసన వెదజల్లుతోంది. అయినా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణ వ్యాప్తంగా ఒకే ఒక కూరగాయల మార్కెట్ ఉంది. ప్రధాన మార్కెట్‌కు ఓ వైపు కూరగాయలు విక్రయిస్తుంటారు. మరోవైపు చికెన్ సెంటర్, అదేవిధంగా చేపల దుకాణాలు సైతం ఉన్నాయి. చికెన్ సెంటర్, చేపల నుంచి, మార్కెట్ సెంటర్లోని టిఫిన్ సెంటర్ల వచ్చే వ్యర్థాలను మురుగుకాల్వల్లో పడేస్తున్నారు. దిగువ ప్రాంతంలో మురుగుకాల్వల్లో నీరు నిలిచి పోవడంతో దుర్గంధం వ్యాపిస్తోంది. అయినా మున్సిపాలిటీ సిబ్బంది మురుగు కాల్వలను శుభ్రం చేయడం లేదు. డ్రెయినేజీల్లో మురుగు శుభ్రం చేయకపోతే అంటువ్యాధుల బారిన పడే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రతీరోజు చెత్త తొలగించడంతోపాటు డ్రెయినేజీ కాల్వల్లోని మురుగు తీసివేయాలని పలువురు కోరుతున్నారు. పట్టించుకునే వారు కరువు కూరగాయల మార్కెట్ శుభ్రతపై మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదని విక్రయదారులు ఆరోపిస్తున్నారు. ప్రతీరోజు వీరి నుంచి తైబజార్ రుసుం వసూలు చేస్తారు. ఒక్కో దుకాణానికి రూ.10ల చొప్పున తీసుకుంటున్నారు. కానీ మార్కెట్ నిర్వహణ గాలికొదిలేస్తున్నారు. మార్కెట్లో పశువులు సంచరిస్తున్న పట్టించుకునేవారే కరువయ్యారు. మరుగుదొడ్ల కోసం కేటాయించినా స్థలాన్ని కొందరు కబ్జాకు యత్నిస్తే అడ్డుకున్నామని వ్యాపారులు చెబుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా మార్కెట్ అభివృద్ధికి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో ఎలా ఉండేది కూరగాయలు అమ్ముకోవడానికి గ్రామాల నుంచి వస్తున్నాం. కొన్ని రోజులుగా మార్కెట్లో భరించలేని వాసన వల్ల ఉండలేక పోతున్నాం. ఏ సార్లకు చెప్పినా ఎవరూ పట్టించుకుంట లేరు. చికెన్ సెంటర్లను, చేపల దుకాణాల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. లేదంటే ఎప్పటికప్పుడు మురుగుకాల్వలు శుభ్రం చేయాలి. – శ్రీనివాస్, బార్బర్ షాపు నిర్వాహకుడు, మందమర్రి వ్యర్థాలు కాల్వల్లో వేయొద్దు చికెన్, చేపల దుకాణాల యజమానులతో అధికారులు సమావేశం ఏర్పాటు చేయాలి. ఆయా దుకాణాల నుంచి వెలువడే వ్యర్థాలను కాల్వల్లో వేయకుండా చూడాలి. లేకుంటే ఈ వాసనతో వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. – సంతోష్, మార్కెట్ సెంటర్, మందమర్రి -
మురుగు పారేదెలా..
మంచిర్యాలటౌన్ : మంచిర్యాల పట్టణంలోని రాంనగర్లో డ్రెయినేజీలు పూర్తిగా చెత్తతో నిండిపోయాయి. దీంతో మురు గు నీరు సరిగ్గా పారడం లేదు. ఒకే చోట నీరు నిలిచి పోవడంతో దుర్గంధం వెదజల్లుతుంది. దోమలు విజృంభిస్తున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. నిత్యం ఇక్కడ చెత్తకుప్పగా తయారు కావడం వల్ల వాసన భరించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టించుకుని డ్రెయినేజీలో చెత్తా చెదారాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. -
వరంగల్ జిల్లాలో విద్యార్థులకు అస్వస్థత
వరంగల్: స్కూల్ విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన శనివారం వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. గణపురం మండలం చేల్పుర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ప్రార్థన చేసున్న విద్యార్థులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. 10 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో.. వారిని ఆస్పత్రికి తరలించారు. అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాఠశాల వెనుక భాగంలో ఉన్న పెద్ద బావిలో నుంచి దుర్వాసన రావడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.