ప్రతీకాత్మక చిత్రం
లక్నో : బీజేపీకి ఓటమి రుచి ఎలా ఉంటుందో చూపిస్తామని సమాజ్ వాదీ పార్టీ చెబుతోంది. ఉత్తర ప్రదేశ్ లో త్వరలో రెండు లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీని మట్టి కరిపిస్తామని ఎస్పీ ప్రకటించింది.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యలు రాజీనామాలతో గోరఖ్‌పూర్, ఫూల్‌పూర్ లోక్‌సభ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. బీజేపీని చిత్తు చేసే ఉద్దేశంతో ఎన్నడూ లేని విధంగా ఈ ఉప ఎన్నికల కోసం ఎస్పీ-బీఎస్పీలు చేతులు కలపటం విశేషం.
ఎస్పీ అధికార ప్రతినిధి గోవింద్ చౌదరి నేడు మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమన్నారు. కమలం పార్టీ పతనం ఇక్కడి నుంచే ప్రారంభం కాబోతుందని ఆయన జోస్యం పలికారు. ఇక 2019 ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు ఉంటుందా? అన్న ప్రశ్నకు.. ఆ నిర్ణయం పార్టీ చీఫ్‌లు అఖిలేశ్, మాయావతి చేతుల్లోనే ఉంటుందని బదులిచ్చారు. మరోవైపు గోరఖ్‌పూర్ యోగి కంచుకోట కావటంతో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలన్న లక్ష్యంతో బీజేపీ కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment