గోరఖ్‌పూర్: రానున్న ఎన్నికల్లో మతతత్వ బీజేపీని ఎదుర్కోవడమే తమ తర్వాత లక్ష్యమని సమాజ్‌వాదీ పార్టీ అధినేత నేత అఖిలేష్ యాదవ్, బీఎస్‌పీ అధినేత్రి మాయవతి స్సష్టం చేశారు. అందులో భాగంగానే గోరఖ్‌పూర్ ఉపఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ నిషాద్‌కి తమ పార్టీ మద్దతు ఇచ్చిందని మాయవతి తెలిపారు. 25 ఏళ్ల తరువాత ఇద్దరి మధ్య పొత్తు చిగురించడంతో ఉప ఎన్నికల విజయంపై భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తే రాష్ట్రంలో తామే బలమైన శక్తిగా ఉంటామని, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని పార్టీ అభ్యర్థి నిషాద్ ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని దళితుల ఓటు బ్యాంక్‌ను తమ వైపు మలుపుకునేందుకు ఏడాది ముందుగానే మాయవతితో చేతులు కలిపారు. గోర్‌ఖ్‌పూర్ ఉప ఎన్నికలను రెండు పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గోరఖ్‌పూర్ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కాగా..గతంలోఅక్కడి నుంచి యోగీ ఆదిత్యానాథ్ ఐదు సార్లు విజయం సాధించిన సాధించారు. బీజేపీ తన అభ్యర్ధిగా బ్రాహ్మణ వర్గానికి చెందిన ఉపేంద్ర శుక్లాను నిలిపింది. కాగా ఎస్పీ, బీఎస్‌పీ కలిసి పోటీ చేస్తుండటంతో కాంగ్రెస్ తమ అభ్యర్ధుల నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పొత్తు పెట్టుకున్న అఖిలేష్.. బీజేపీ చేతిలో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment