గోరఖ్‌పూర్ పిక్నిక్ స్పాట్ కాదు: యోగి
Published Sat, Aug 19 2017 2:39 PM | Last Updated on Tue, Sep 12 2017 12:30 AM
గోరఖ్‌పూర్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకొని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విమర్శలు చేశారు. శనివారం గోరఖ్‌పూర్‌లో రాహుల్‌గాంధీ పర్యటించనున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘స్వచ్ఛ్ భారత్ ప్రాముఖ్యత ఢిల్లీలో కూర్చునే యువరాజుకు ఎలా తెలుస్తుంది. గోరఖ్‌పూర్‌ను ఆయన తన పిక్నిక్ స్పాట్‌గా మార్చుకునేందుకు అనుమతిచ్చేదిలేదని’ అన్నారు. స్వచ్ఛ్‌భారత్ కింద యూపీ సీఎం యోగి ఈ రోజు ‘స్వచ్ఛ్ ఉత్తర్‌ప్రదేశ్- స్వస్థ్ ఉత్తరప్రదేశ్’ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Advertisement
Advertisement