
గోరఖ్‌పూర్ : తన చెల్లెలు.. గదిలో ప్రియుడితో అభ్యంతరకర పరిస్థితిలో ఉండటాన్ని చూసిన ఓ అన్న ఆమె ప్రియున్ని తుపాకితో కాల్చాడు. అంతేకాకుండా యువతి కుటుంబసభ్యులు, గ్రామస్తులు కలిసి అతన్ని దారుణంగా కొట్టిచంపారు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గోరఖ్‌పూర్‌లోని షేర్‌పూర్‌కు చెందిన సురాజ్ అనే 24ఏళ్ల యువకుడు తన ప్రియురాలితో కలిసి ఆమె ఇంటికి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత ఆమె అన్న గౌతమ్.. సంజయ్, అతని చెల్లెలు అభ్యంతరకర పరిస్థితిలో ఉండటం చూసి ఆగ్రహించాడు. వెంటనే లైసెన్స్‌లేని తుపాకిని తెచ్చి సంజయ్‌ని కాల్చాడు. తుపాకి పేలిన శబ్ధం గట్టిగా రావటంతో కొంతమంది గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు.
విషయం తెలిసుకుని, వారు కూడా యువతి కుటుంబంతో కలిసి సంజయ్‌ని బయటకు లాగి చితకబాదారు. అంతటితో ఆగకుండా చెక్క కర్రలతో, పదునైన వస్తువులతో అతడిపై దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన సంజయ్‌ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా చేరుకుని ఆరుగురిపై కేసు నమోదు చేశారు. పోస్టుమార్టమ్ నిమిత్తం సంజయ్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment