లక్నో : గోరఖ్‌పూర్ బాబా రాఘవ్ దాస్ (బీఆర్డీ) ఆసుపత్రిలో చిన్నారుల మరణాలు ఆగడం లేదు. ప్రైవేటు వైద్య ఖర్చులు భరించే స్థోమత లేక ప్రభుత్వాసుపత్రికి వచ్చే నిరుపేద కుటుంబాలు కడుపు కోతతో తల్లడిల్లిపోతున్నాయి. ఆదివారం బీఆర్డీ ఆసుపత్రిలో 16 మంది చిన్నారులు మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో పది మంది పసిపిల్లలు ఉన్నారు.
ఎన్‌సిఫలైటిస్ వ్యాధితో బాధపడుతున్న వీరందరూ ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల నుంచి వచ్చి ఆసుపత్రిలో చేరినట్లు వెల్లడించాయి. ఇదే వ్యాధితో ఆసుపత్రిలో ఇంకా 36 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నట్లు తెలిపాయి. వీరిలో ఐదుగురు బిహార్ నుంచి వచ్చినట్లు సమాచారం.
ఈ ఏడాది జనవరి నుంచి మొత్తం 1,470 మంది రోగులు బీఆర్డీ ఆసుపత్రిలో చేరగా.. 310 మంది ప్రాణాలు విడిచారు. ఈ ఏడాది ఆగష్టులో ఆసుపత్రిలో అత్యధికంగా 63 మంది చిన్నారులు ఆక్సిజన్ కొరతతో చనిపోయారు. తాజా మరణాలు ఆక్సిజన్ కొరత వల్ల కాదని వైద్యులు తెలిపారు. క్రిటికల్ కండీషన్‌లో వారిని ఆసుపత్రి తీసుకురావడం వల్లే కాపాడలేకపోయామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment