
లక్నో: ఒక మహిళ బ్లాక్ కళ్లజోడు, మాస్కో ధరించి ఒక జ్యూవెలరీ షాపుకి వచ్చింది. సరిగ్గా అదే సమయానికి ఆ షాపు కూడా కస్టమర్‌లతో చాలా బిజీగా ఉంది. దీంతో ఆ మహిళ ఇదే అవకాశం అనుకుందో ఏమో గానీ ఆ షాపు అతనితో నెక్లెస్ మోడళ్లను చూపించమంది. దీంతో అతను రకరకాల మోడల్స్‌ను చూపించాడు.
ఆమె తెలివిగా ఒక మోడల్ నెక్లెస్‌ని చూస్తున్నట్లుగా పక్కనే ఉన్న మరో నెక్లెస్ బాక్స్‌ని క్లోజ్ చేసి ఆ బాక్స్‌పై తాను చూస్తున్న నగ బాక్స్‌ని పెట్టింది. ఆ తర్వాత షాపు వాడు గమనించడం లేదనుకుని డిసైడ్ అయ్యాక నెమ్మదిగా తన వొడిలో పెట్టుకున్నట్లుగా పెట్టుకుని ఆ క్లోజ్ చేసి ఉన్న నగల బాక్స్‌ని చీర మడతల్లో తెలివిగా దాచింది. ఆ తర్వాత తనకు ఏం నగలు నచ్చలేదున్నట్లుగా కామ్‌గా పైకి లేచి వెళ్లిపోయింది.
అక్కడ ఉన్న షాపు అతను ఆమె ఏం కొనక్కుండా ఎందుకలా వెళ్లిపోతుంది అని కూడా అనుమానించ లేదు. ఆమె మాత్రం భలే గమ్మత్తుగా రూ. 10 లక్షలు ఖరీదు చేసే చెవి పోగోలు తోపాటుగా ఉన్న నెక్లెస్ బాక్స్‌తో జంప్ అయిపోయింది. ఈ ఘటన నవంబర్ 17న గోరఖ్‌పూర్‌లో చోటు చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. మీరు కూడా ఓ లుక్కేమండి.
(చదవండి: చిన్నారిని గాల్లోకి విసిరే స్టంట్: మండిపడుతున్న నెటిజన్లు)
Comments
Please login to add a commentAdd a comment