న్యూజిలాండ్‌పై వెస్టిండీస్‌ సంచలన విజయం | Hayley stars in thrilling West Indies win against new zealand | Sakshi
Sakshi News home page

Icc women's world cup 2022: న్యూజిలాండ్‌పై వెస్టిండీస్‌ సంచలన విజయం

Published Sat, Mar 5 2022 7:42 AM | Last Updated on Sat, Mar 5 2022 9:19 AM

Hayley stars in thrilling West Indies win against new zealand - Sakshi

మౌంట్‌ మాంగనుయ్‌: మహిళల వన్డే ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ సంచలన విజయంతో బోణీ కొట్టింది. ఆతిథ్య న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో విండీస్‌ 3 పరుగుల తేడాతో గెలిచింది. 260 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 49.5 ఓవర్లలో 256 పరుగులకు ఆలౌటైంది. చివరి ఓవర్లో న్యూజిలాండ్‌ విజయానికి 6 పరుగులు అవసరంకాగా చేతిలో 3 వికెట్లు ఉన్నాయి.

విండీస్‌ బౌలర్‌ డీండ్రా డాటిన్‌ (0.5–0–2–2) కట్టుదిట్టమైన బౌలింగ్‌కు న్యూజిలాండ్‌ ఐదు బంతుల్లో 2 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయి ఓడిపోయింది. కేటీ మార్టిన్‌ (44), జెస్‌ కెర్‌ (25)లను డాటిన్‌ అవుట్‌ చేయగా... ఫ్రాన్‌ జొనాస్‌ రనౌట్‌ కావడంతో విండీస్‌ విజయం ఖాయమైంది. అంతకుముందు విండీస్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 259 పరుగులు చేసింది. ఓపెనర్‌ హేలీ మాథ్యూస్‌ (119; 16 ఫోర్లు, 1 సిక్స్‌) సూపర్‌ సెంచరీ సాధించింది.

చదవండి: Shane Warne: చరిత్రలో నిలిచిపోయిన వార్న్‌ 'బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement