
బేస్‌బాల్ బ్యాట్.. క్రికెట్ బ్యాట్ లాగే చాలా బలంగా ఉంటుంది. గొడ్డలితో నరికితేగానీ ప్రాపర్‌గా విరగదు. అలాంటి బలమైన బ్యాట్స్‌ను తన చేతితో విరగ్గొట్టాడు మార్షల్ ఆర్టిస్ట్ మహమ్మద్ కహ్రిమనోవిక్. హ్యామర్ హ్యాండ్స్‌గా పేరుపొందిన జర్మనీకి చెందిన 63 ఏళ్ల మహమ్మద్.. ఒక నిమిషంలో 68 బ్యాట్స్‌ను విరగ్గొట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు.
ఇటీవల ఇటలీలోని మిలన్‌లో ఈ ఫీట్ సాధించాడు. కూరగాయలు కట్‌చేసినంత ఈజీగా అతను బ్యాట్స్ విరగ్గొడుతున్న వీడియోను గిన్నిస్ వరల్డ్‌రికార్డ్స్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. వీడియోను చూసిన కొందరు అతనికి కుడోస్ చెబుతుంటే... ఆ వీడియో చూశాక తమ చెయ్యి నొప్పెట్టిందంటూ మరికొందరు చలోక్తులు విసురుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment