![Aquarium in lobby of Berlin Radisson Blu hotel building bursts - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/17/AQUARIUM.jpg.webp?itok=R6F2Kvt9)
బెర్లిన్: గిన్నిస్ రికార్డులకెక్కిన ప్రపంచంలోకెల్లా అతి పెద్ద అక్వేరియం ఉన్నట్టుండి బళ్లున బద్దలైంది. అందులోని 1,500 చేపలు చనిపోవడంతో పాటు ఏకంగా 10 లక్షల లీటర్ల పై చిలుకు నీళ్లు అక్వేరియమున్న హోటల్‌తో పాటు పరిసర వీధులనూ ముంచెత్తాయి! అక్వాడాం అని పిలిచే సిలిండర్ ఆకృతిలోని ఈ 46 అడుగుల ఎల్తైన అక్వేరియం జర్మనీలోని బెర్లిన్‌లో రాడిసన్ బ్లూ హోటల్‌లో ఉంది.
2003 నుంచీ సందర్శకులను అలరిస్తోంది. దీని నిర్మాణానికి రూ.100 కోట్లకు పైగా రూపాయలు ఖర్చయింది. ఇది బెర్లిన్‌లో అతి పెద్ద పర్యాటక ఆకర్షణగా మారింది. ఇందులో 10 నిమిషాల లిఫ్ట్ ప్రయాణం అద్భుతమైన అనుభూతి అని సందర్శకులు చెబుతుంటారు. రెండేళ్ల క్రితం దీన్ని ఆధునీకరించారు. ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 10 డిగ్రీలకు పడిపోయినందుకే అక్వేరియం బద్దలై ఉంటుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment