Radisson Blu Hotel
-
రాడిసన్ డ్రగ్స్ కేసు: వీఐపీలకు షాక్.. పోలీసుల సరికొత్త ప్రయోగం!
సాక్షి, హైదరాబాద్: రాడిసన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాడిసన్ హోటల్లో పార్టీకి వెళ్లిన వారిలో డ్రగ్స్ ఆనవాళ్లను గుర్తించేందుకు తెలంగాణ పోలీసులు సరికొత్త ప్రయోగానికి ప్లాన్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా క్రోమోటోగ్రఫీ పరీక్ష చేసేందుకు రెడీ అయ్యారు పోలీసులు. వివరాల ప్రకారం.. రాడిసన్ హోటల్లో డ్రగ్స్ వాడిన వారిని గుర్తించేందుకు పోలీసులు క్రోమోటగ్రఫీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కోసం పోలీసులు కూకట్పల్లి కోర్టు అనుమతి కోరారు. అయితే, కోర్టు అనుమతి ఇవ్వకపోవడంతో పోలీసులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు అనుమతిస్తే ఆరోజు రాడిసన్‌కు వెళ్లిన వారిలో డ్రగ్స్ ఎవరు తీసుకున్నారో గుర్తించే అవకాశం ఉంటుంది. ఇక, ఫిబ్రవరి 24వ తేదీన రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ జరిగింది. ఈ పార్టీకి మొత్తం 14 మంది హాజరైనట్టు పోలీసులు గుర్తించారు. కాగా, వీరికి డ్రగ్స్ టెస్టులు చేయగా కేవలం ముగ్గురికి మాత్రమే పాజిటివ్‌గా తేలింది. అయితే, వీరిలో సెలబెట్రీలు పార్టీ జరిగిన రోజు నుంచి ఎక్కువ సమయం తీసుకుని డ్రగ్స్ టెస్టు కోసం విచారణకు హాజరయ్యారు. దీంతో, వారి నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు కనపించలేదు. ఈ నేపథ్యంలోనే రాడిసన్‌కి వచ్చిన వారిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. వారి శరీరాల్లో డ్రగ్స్‌ను గుర్తించేందుకు క్రోమోటోగ్రఫీ నిర్వహించాలని పోలీసులు ప్లాన్ చేశారు. ఇక, క్రోమోటోగ్రఫీ పరీక్షలు నిర్వహించడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా.. రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీలో పాలు పంచుకున్న పది మంది వీఐపీలపై కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఇద్దరు అమ్మాయిలతో పాటు మొత్తం 9 మందిపై కేసులు నమోదైంది. వ్యాపారవేత్తలు గజ్జల వివేకానంద్, అబ్బాస్, కేదార్, సందీప్‌లు.. సెల్రబిటీ శ్వేతతో పాటు లిశి, నీల్‌పైనా కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. అలాగే.. డ్రగ్స్ సేవించిన నిర్భయతో పాటు రఘు చరణ్‌పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. అబ్బాస్ దగ్గర వివేకానంద డ్రగ్స్ కొనుగోలు చేసి.. తన స్నేహితులతో పార్టీ చేసుకున్నట్లు తేలింది. వీళ్లంతా కొకైన్ పేపర్లో చుట్టి డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొని ఉంది. అంతేకాదు.. ఈ డ్రగ్స్ పార్టీలో మరికొంత మంది ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక, ఈ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ కూడా ఉన్నారు. -
గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో నిందితుల డ్రామాలు!
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో నిందితులు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు నిందితులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నట్లు పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. అధునాతన డ్రగ్స్ టెస్టులకు సైతం చిక్కకుండా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని చూసి అధికారులు నివ్వెరపోతున్నట్లు తెలుస్తోంది. హెయిర్ శాంపిల్స్ టెస్టు.. యూరిన్ టెస్ట్.. రెండింటిలోనూ నెగెటివ్ ఫలితం గచ్చిబౌలి పోలీసులను కంగుతినేలా చేస్తోంది. ఈ క్రమంలో ఇక చివరగా నిందితుల బ్లడ్ శాంపిల్స్ నివేదికలపైనే పోలీసులు ఆధారపడుతున్నారు. అయితే.. అలా ఎలా?.. గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో.. నీల్ అనే నిందితుడు మినహా మిగతా 12 మంది విచారణకు హాజరయ్యారు. అయితే వాళ్లకు నిర్వహిస్తున్న టెస్టుల్లో నెగెటివ్ రావడంతో దర్యాప్తు అధికారులు కంగుతింటున్నారు. వాస్తవానికి.. డ్రగ్స్ పార్టీ జరిగిన మరుసటి రోజే ముగ్గురు నిందితుల శాంపిల్స్‌లో పాజిటివ్‌గా తేలింది. అయితే వారం రోజుల గడువుతో మళ్లీ విచారణకు వచ్చారు నిందితులు. ఈలోపు పూర్తి డైట్ పాటించడంతోనే ఇప్పుడు ఫలితం నెగెటివ్‌గా వచ్చి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు హెయిర్‌శాంపిల్స్‌లోనూ నెగెటివ్ ఫలితంపై అధికారులు విశ్లేషణ జరుపుతున్నారు. హెయిర్ శాంపిల్స్ టెస్టుల్లో బయటపడకుండా ఉండేందుకు డై వేసుకుని వస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చివరగా.. వాళ్ల నుంచి బ్లడ్ శాంపిల్స్‌ను పోలీసులు సేకరించారు. త్వరలోనే వాటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. అయితే అందులో పాజిటివ్ వచ్చినా కన్జూమర్స్ పేరుతో వాళ్లు బయటపడేందుకు యత్నాలు చేసే అవకాశం లేకపోలేదని పోలీసులు వర్గాలు చెబుతున్నాయి. -
క్రిష్ బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్స్ ను కోర్టుకు అందజేయనున్న పోలీసులు
-
గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం
-
డ్రగ్స్ టెస్ట్ కోసం క్రిష్ వద్ద శాంపిల్స్ సేకరించిన పోలీసులు
-
పరారీలో దర్శకుడు క్రిష్
-
సాక్షీ టీవీ చేతిలో గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్
-
క్రిష్ విచారణ ఎప్పుడు?
గచ్చిబౌలి: రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్ కేసులో అనుమానితునిగా ఉన్న తెలుగు సినీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ విచారణ ఎప్పుడు ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. క్రిష్ ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉందని, ముంబైలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. అయినప్పటికీ క్రిష్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. అనుమానితునిగా ఉన్న క్రిష్ పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు జాప్యానికి గల కారణాలను అధికారులు వెల్లడించడం లేదు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న రఘు చరణ్, సందీప్, లిషీ, శ్వేత, నీల్ కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. రాడిసన్ హోటల్లో గత శనివారం డ్రగ్ పార్టీ నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రధాన నిందితుడు గజ్జల వివేకానంద పార్టీ ముగి సే వరకు హోటల్ గదిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. రఘు చరణ్, నీల్‌తో కలిసి వచ్చిన డైరెక్టర్ క్రిష్ నేరుగా వివేకానంద ఉన్న గదిలోకి వెళ్లి 30 నిమిషాల పాటు గడిపినట్లు పోలీసు లు గుర్తించారు. కేదార్, లిషీ, నిర్బయ్ కలిసి రాడిసన్ హోటల్‌కు వెళ్లారు. సందీప్, శ్వేత రాడిసన్‌కు వచ్చారు. రాత్రి 8.30 గంటలకు పార్టీ ముగించుకొని వెళ్లగా పోలీసులు రాత్రి 12.30 గంటలకు హోటల్ కు చేరుకున్నారు. అప్పటికే డ్రగ్ పార్టీ ముగించుకొని అక్కడి నుంచి అందరూ ఉడాయించారు. సీసీ కెమెరాలపై అనుమానాలెన్నో స్టార్ హోటల్‌గా గుర్తింపు ఉన్న రాడిసన్ హోటల్లో సీసీ కెమెరాల నిర్వహణ ఆధ్వానంగా ఉండటం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. హోటల్లో మొత్తం 209 కెమెరాలు ఉండగా కేవలం 16 సీసీ కెమెరాలు మాత్రమే పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. డ్రగ్ పార్టీ జరిగిన రూమ్ వైపు ఉన్న కెమెరాలు పని చేయకపోవడం గమనార్హం. కావాలనే సీసీ కెమెరాలు పని చేయకుండా చేశారా అనే అనుమానాలు నెలకొన్నాయి. -
డ్రగ్స్ పార్టీలకు అడ్డాగా రాడిసన్ హోటల్
-
రోజుకో మలుపు..భారీ ట్విస్ట్
-
విశాఖలో జీ–20 సదస్సుకు సర్వ సన్నద్ధం
సాక్షి, విశాఖపట్నం : విశాఖ మహా నగరం మరో ప్రతిష్టాత్మక సదస్సుకు ఆతిథ్యమిస్తోంది. ఇప్పటికే ఈనెల 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను (జీఐఎస్) ఘనంగా నిర్వహించి దేశ, విదేశాల దృష్టిని ఆకర్షించగా, తాజాగా.. మంగళవారం నుంచి జీ–20 దేశాల రెండో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ (ఐడబ్ల్యూజీ) సమావేశాలు జరగనున్నాయి. ఈ సదస్సు వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అనే థీమ్‌తో 28, 29, 30, 31 తేదీల్లో విశాఖలో జరగనుంది. నగరంలోని రాడిసన్ బ్లూ హోటల్లో నాలుగు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు జీ–20 దేశాలతో పాటు యూరోపియన్ దేశాలకు చెందిన 57 మంది ప్రతినిధులు విశాఖ చేరుకున్నారు. వీరికి అవసరమైన రవాణా, వసతి, భద్రతా ఏర్పాట్లు వంటివి అధికారులు పూర్తిచేశారు. అతిథులను స్వాగతించడానికి ప్రత్యేక సాంస్కృతిక బృందాలను సిద్ధంచేశారు. పూణే, కడియంల నుంచి తెచ్చిన పూలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. విద్యుత్ స్తంభాలకు విద్యుద్దీపాలను అలంకరించారు. ఇలా.. విశాఖ నగరం మునుపెన్నడూ లేని రీతిలో ఎటు చూసినా ఎంతో సుందరంగా కనిపిస్తోంది. ఇక జీ–20 సదస్సుపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆదివారం వైఎంసీఏ నుంచి ఆర్కే బీచ్ వరకు వైజాగ్ కార్నివాల్, ఆర్కే బీచ్ నుంచి 3కే, 5కే, 10 మారథాన్, పారా మోటార్ ఎయిర్ సఫారీ కూడా నిర్వహించారు. గత కొన్నిరోజులుగా మంత్రులు గుడివాడ అమర్నాథ్, విడదల రజని, ఆదిమూలపు సురేష్ తదితరులు ఈ సదస్సు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 2,500 మందితో భద్రతా ఏర్పాట్లు జీ–20 సదస్సు నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. సుమారు 2,500 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. బందోబస్తుకు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల నుంచి కూడా సిబ్బందిని రప్పించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పటిష్ట ఏర్పాట్లుచేశారు. జీ–20 దేశాలివీ.. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా,ఫ్రాన్స్, జర్మనీ, భారత్,ఇండోనేసియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, యూకే, అమెరికా, యూరోపియన్ యూనియన్. నేడు సదస్సు ప్రారంభం.. హాజరుకానున్న సీఎం జగన్ జీ–20 సదస్సు తొలిరోజు సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరవుతారు. సదస్సులోని ప్రతినిధులతో ముఖాముఖి మాట్లాడి అనంతరం గాలా డిన్నర్లో పాల్గొంటారు. రాత్రికి ముఖ్యమంత్రి తిరిగి తాడేపల్లికి పయనమవుతారు. మరోవైపు.. జీ–20 దేశాల ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి రాష్ట్ర సమాచారాన్ని అందజేస్తారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరిస్తారు. ఈ సదస్సు ద్వారా విశాఖకు ప్రపంచస్థాయి గుర్తింపు లభిస్తుందని భావిస్తున్నారు. రూ.157 కోట్లతో నగర సుందరీకరణ జి–20 సమావేశాలు పురస్కరించుకుని రూ.157 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన నగరం సర్వాంగ సుందరంగా తయారైంది. నగరంలో ఏ మూల చూసినా విద్యుద్దీపాలతో ధగధగలాడుతోంది. విదేశీ ప్రతినిధులు పర్యటించే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేశారు. రహదారులన్నీ మిలమిల మెరిసిపోతున్నాయి. ♦ 46 కి.మీల మేర రోడ్డు పనులు, 24 కి.మీల మేర పెయింటింగు పనులు, 10 కి.మీల మేర ఫుట్‌పాత్‌ల నిర్మాణం చేపట్టారు. ♦ రూ.2.39 కోట్లతో సీతకొండపై బీచ్ వైఎస్సార్ వ్యూ పాయింట్‌ను ఆధునీకరించారు. ఐ లవ్ వైజాగ్ సెల్ఫీ పాయింట్, సోలార్ ట్రీ ఏర్పాటుచేశారు. ♦ సాగర్‌నగర్, గుడ్లవానిపాలెం, జోడుగుళ్లపాలెం బీచ్‌లను అభివృద్ధి చేశారు. రూ.1.31 కోట్లతో కైలాసగిరి రోప్‌వే నుంచి తిమ్మాపురం వరకు 11 కి.మీల మేర ఫుట్‌పాత్‌లకు మరమ్మతులు చేసి టెర్రాకోట్ వేశారు. ♦ రోడ్ల పక్కన గోడలకు, కల్వర్టులకు విశాఖ, ఏపీ సంస్కృతిని ప్రతిబింబించే అందమైన చిత్రాలు కనువిందు చేస్తున్నాయి. అందాల కళాకృతులు ఆకట్టుకుంటున్నాయి. ♦ ఎయిర్‌పోర్టు నుంచి బీచ్‌రోడ్డులో సదస్సు జరిగే రాడిసన్ బ్లూ హోటల్ వరకు ఇరువైపులా వివిధ రకాలతో వైఎస్సార్ జిల్లా మేదర నిపుణులు రూపొందించిన వెదురు ఆకృతులపై పూలమొక్కలను అమర్చారు. రోడ్ల మధ్యనున్న డివైడర్లు పచ్చని మొక్కలతో అలరిస్తున్నాయి. సదస్సు షెడ్యూలు ఇలా.. ♦ 28 ఉదయం రాడిసన్ బ్లూ హోటల్లో అల్పాహారం తర్వాత ప్రధాన సమావేశం హోటల్లోని కన్వెన్షన్ హాలులో జరుగుతుంది. సా.3.30 నుంచి 6.30 వరకు మూడు రకాల సమావేశాలు నిర్వహిస్తారు. రాత్రి 7.30 నుంచి 9.30 వరకు హోటల్ సమీపంలోని బీచ్‌లో గాలా డిన్నర్ ఉంటుంది. దీనికి సీఎం వైఎస్ జగన్ హాజరవుతారు. ముఖ్యమంత్రి ప్రసంగం కూడా ఉంటుంది. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. ♦ 29న హోటల్ సమీపంలోని బీచ్‌లో యోగా, మెడిటేషన్, పౌష్టికాహార వినియోగంపై నిపుణులతో అవగాహన కార్యక్రమాలుంటాయి. ఆ రోజంతా మౌలిక సదుపాయాల కల్పన అనే అంశంపై ప్రధాన సమావేశం ఉంటుంది. ♦ 30న ఉ.10 నుంచి మ.1.30 గంటల వరకు కెపాసిటీ బిల్డింగ్ వర్క్‌షాపు ఉంటుంది. అనంతరం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ముడసర్లోవ, కాపులుప్పాడ ప్రాంతాల్లో విదేశీయులు పర్యటిస్తారు. స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్, మెగా ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ పనితీరు, జిందాల్ కంపెనీ పరిధిలో నిర్వహించే వేస్ట్ మేనేజ్మెంట్ ఎనర్జీ తయారీ యూనిట్ పనితీరు గురించి అధికారులు వివరిస్తారు. ♦ 31న దేశవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమిషనర్లతో పట్టణీకరణ, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సింగపూర్, దక్షిణ కొరియా ప్రతినిధులతో చర్చిస్తారు. జన్‌భాగీదారీ కార్యక్రమం కింద స్థానిక నిపుణులతో వివిధ అంశాలపై చర్చా సమావేశాలు జరుగుతాయి. అనంతరం.. విదేశీ ప్రతినిధులు తిరుగు ప్రయాణమవుతారు. -
అక్వేరియం బద్దలైంది..!
బెర్లిన్: గిన్నిస్ రికార్డులకెక్కిన ప్రపంచంలోకెల్లా అతి పెద్ద అక్వేరియం ఉన్నట్టుండి బళ్లున బద్దలైంది. అందులోని 1,500 చేపలు చనిపోవడంతో పాటు ఏకంగా 10 లక్షల లీటర్ల పై చిలుకు నీళ్లు అక్వేరియమున్న హోటల్‌తో పాటు పరిసర వీధులనూ ముంచెత్తాయి! అక్వాడాం అని పిలిచే సిలిండర్ ఆకృతిలోని ఈ 46 అడుగుల ఎల్తైన అక్వేరియం జర్మనీలోని బెర్లిన్‌లో రాడిసన్ బ్లూ హోటల్లో ఉంది. 2003 నుంచీ సందర్శకులను అలరిస్తోంది. దీని నిర్మాణానికి రూ.100 కోట్లకు పైగా రూపాయలు ఖర్చయింది. ఇది బెర్లిన్‌లో అతి పెద్ద పర్యాటక ఆకర్షణగా మారింది. ఇందులో 10 నిమిషాల లిఫ్ట్ ప్రయాణం అద్భుతమైన అనుభూతి అని సందర్శకులు చెబుతుంటారు. రెండేళ్ల క్రితం దీన్ని ఆధునీకరించారు. ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 10 డిగ్రీలకు పడిపోయినందుకే అక్వేరియం బద్దలై ఉంటుందని భావిస్తున్నారు. -
‘ఆసియా జ్యువెలరీ’లో సినీతారల సందడి
-
పరారీలో లేను.. అమెరికాలో ఉన్నా..
సాక్షి, హైదరాబాద్: రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ అధీనంలోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో జరిగిన రేవ్ పార్టీ కేసులో నిందితుడిగా ఉండి, ప్రస్తుతం పరారీలో ఉన్న కిరణ్ రాజు పెనుమత్స నుంచి పోలీసులకు ఈ–మెయిల్ వచ్చింది. తాను సదరు పబ్‌లో భాగస్వామినని, పెట్టుబడి పెట్టాను తప్ప కార్యకలాపాలను పర్యవేక్షించట్లేదని తెలిపారు. తన సోదరికి ఆపరేషన్ కావడంతో కొన్ని నెలలుగా తాను అమెరికాలో ఉంటున్నానని పేర్కొన్నారు. పబ్‌పై దాడి జరిగిన తర్వాత తాను పారి పోయినట్లు మీడియాలో వస్తోందని, కానీ తాను పరారీలో లేనంటూ ఈ–మెయిల్లో వివరణ ఇచ్చారు. తాను హైదరాబాద్‌కు వచ్చిన తర్వా త పోలీసుల ఎదుట హాజరై పూర్తి వివరణ ఇస్తానన్నారు. ఈ మెయిల్‌ను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు సాంకేతిక అంశా లపై ఆరా తీస్తున్నారు. ఏ ప్రాంతం నుంచి కిరణ్ దీన్ని పంపారో పరిశీలిస్తున్నారు. కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడు అర్జున్ వీరమాచినేని కోసం గాలింపు కొనసా గుతోంది. ఈయన పశ్చిమ బెంగాల్లో ఉన్న ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతర నిందితులు అభిషేక్ ఉప్పల, అనిల్‌కుమార్‌ల కస్టడీ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు సోమవారం తీర్పు వెలువరించే అవకాశం ఉంది. -
బంజారా హిల్స్ ర్యాడిసన్ బ్లూ హోటల్ పై టాస్క్ ఫోర్స్ దాడులు
-
మాలి దాడుల వెనక....
బమాకా: ఆఫ్రికా దేశమైన మాలి గత మూడేళ్లుగా టెర్రరిజంతో అల్లాడిపోతోంది. 2012లో అప్పటి మాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలెత్తిన తిరుగుబాటు టెర్రరిజానికి దారి తీసింది. నేడు ఇప్పుడది దేశవ్యాప్తంగా విస్తరించి ప్రజలను భయకంపితులను చేస్తోంది. త్వారెగ్ సంచార తెగకు చెందిన తిరుగుబాటుదారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదట తిరుగుబాటు చేశారు. మాజీ లిబియన్ సైనికులతో ఏర్పడిన 'నేషనల్ మూవ్మెంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ అజావద్ (ఎంఎన్ఎల్ఏ)' ఆ తిరుగుబాటుకు మద్దతిచ్చింది. మాలి ఉత్తర భాగంలోని అజావద్ ప్రాంతాన్ని ఎంఎన్ఎల్ఏ తిరుగుబాటుదారులు ఆక్రమించుకొని స్వతంత్ర ప్రాంతంగా ప్రకటించారు. మాలిలో షరియా చట్టాన్ని అమలు చేయడం కోసం మాలి ప్రభుత్వాన్ని పడగొట్టడంలో తిరుగుబాటుదారులకు ముస్లిం తీవ్రవాదులైన అన్సర్ థైస్, అల్ కాయిదా గ్రూపులు కూడా మద్దతిచ్చాయి. ముస్లిం తీవ్రవాదులను అణచివేతకు 2013, జనవరి నెలలో ఫ్రెంచ్ సైన్యం 'సర్వల్' పేరిట ఓ ఆపరేషన్ నిర్వహించింది. అప్పటికే మాలి ఉత్తరాది ప్రాంతాలను ఆక్రమించుకున్న ఇస్లాం తీవ్రవాదులు దక్షిణ ప్రాంతాలను కూడా ఆక్రమించుకునే ఉద్దేశంతో టెర్రరిస్టు దాడులకు పాల్పడుతూ వస్తున్నారు. గత మార్చి 6వ తేదీన ఇస్లామిక్ తీవ్రవాదులు దేశ రాజధాని బమాకాలోని ఓ రెస్టారెంట్‌పై దాడి చేసి ఐదుగురిని కాల్చి చంపారు. మృతుల్లో ఇద్దరు యూరోపియన్లు కూడా ఉన్నారు. ఇస్లామిక్ తీవ్రవాదులు దేశంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ముఖ్యమంగా ఉత్తరాదిలో దాడులకు పాల్పడవచ్చంటూ మాలి విదేశాంగ కార్యాలయం దేశ ప్రజలను, ముఖ్యంగా విదేశీ పర్యాటకులను హెచ్చరిస్తూ వస్తోంది. శుక్రవారంనాడు రాడిసన్ బ్లూ హోటల్లోకి ముస్లిం మిలిటెంట్లు జొరబడి ప్రజలపై కాల్పులు జరపడం ఆ తరహా దాడిగానే కనిపిస్తోంది. మాలి ప్రజలకు రక్షణ కల్పించడం కోసం ఐక్యరాజ్య సమితి తరఫున 12వేల మంది సైనికులు మాలికి రక్షణ కల్పిస్తున్నారు. -
9మందిని హతమార్చిన ఉగ్రవాదులు?
-
9మందిని హతమార్చిన ఉగ్రవాదులు?
మాలి: మాలి రాజధాని బమాకోలోని రాడిసన్ బ్లూ హోటల్లో 170మందిని బందీలుగా చేసుకున్న ఉగ్రవాదులు... వారిలో 9మందిని హతమార్చినట్లు సమాచారం. మృతుల్లో ఐక్యరాజ్యసమితి సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఫ్రెంచ్, బెల్జియం దేశస్తులు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా ఓ ఫ్రెంచ్ దేశస్తుడు సహా ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. సుమారు 10మంది ఉగ్రవాదులు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలతో హోటల్ లోకి చొరబడినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల చెర నుంచి బందీలను విడిపించేందుకు భద్రతా దళాలు యత్నిస్తున్నాయి. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా హోటల్ సమీపంలో పేలుడు వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు స్థానిక మీడియాకు తెలిపారు. మరోవైపు మాలి ప్రధాని అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే ఈ దాడులకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మాలిలో పారిస్ తరహా దాడి!
-
మాలిలో పారిస్ తరహా దాడి!
మాలి : ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పారిస్‌పై నరమేథాన్ని మరువకముందే పశ్చిమ ఆఫ్రికా దేశం మాలీలోనూ బరితెగించారు. మాలి రాజధాని బమాకోలో పారిస్ తరహా దాడులకు పాల్పడ్డారు. బమాకోలోని రాడిసన్ బ్లూ హోటల్‌పై 10మంది ఆగంతకులు విరుచుకుపడ్డారు. హోటల్లో ఉన్న170మందిని బందీలుగా చేసుకున్నారు. బందీల్లో ఎక్కువమంది అమెరికా, బ్రిటిష్ టూరిస్టులున్నారు. ఉగ్రవాదుల చెరలో 170మంది ఉండగా, వారిలో 140మంది అతిథులు కాగా, 30 మంది హోటల్ సిబ్బంది ఉన్నారు. మరోవైపు భద్రతాదళాలు హోటలును చుట్టుముట్టాయి. ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా ఉగ్రవాదుల వద్ద భారీగా పేలుడు పదార్థులు ఉన్నట్లు సమాచారం. కాగా గత ఆగస్టులోనూ మాలిలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో మొత్తం తొమ్మిదిమంది మరణించారు.