ముంబైలో ఉన్నారంటున్న పోలీసులు.. రేపు విచారణకు రావొచ్చని అంచనా
గచ్చిబౌలి: రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్ కేసులో అనుమానితునిగా ఉన్న తెలుగు సినీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ విచారణ ఎప్పుడు ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. క్రిష్ ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉందని, ముంబైలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. అయినప్పటికీ క్రిష్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. అనుమానితునిగా ఉన్న క్రిష్ పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు జాప్యానికి గల కారణాలను అధికారులు వెల్లడించడం లేదు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న రఘు చరణ్, సందీప్, లిషీ, శ్వేత, నీల్ కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
రాడిసన్ హోటల్‌లో గత శనివారం డ్రగ్ పార్టీ నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రధాన నిందితుడు గజ్జల వివేకానంద పార్టీ ముగి సే వరకు హోటల్ గదిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. రఘు చరణ్, నీల్‌తో కలిసి వచ్చిన డైరెక్టర్ క్రిష్ నేరుగా వివేకానంద ఉన్న గదిలోకి వెళ్లి 30 నిమిషాల పాటు గడిపినట్లు పోలీసు లు గుర్తించారు. కేదార్, లిషీ, నిర్బయ్ కలిసి రాడిసన్ హోటల్‌కు వెళ్లారు. సందీప్, శ్వేత రాడిసన్‌కు వచ్చారు. రాత్రి 8.30 గంటలకు పార్టీ ముగించుకొని వెళ్లగా పోలీసులు రాత్రి 12.30 గంటలకు హోటల్ కు చేరుకున్నారు. అప్పటికే డ్రగ్ పార్టీ ముగించుకొని అక్కడి నుంచి అందరూ ఉడాయించారు.
సీసీ కెమెరాలపై అనుమానాలెన్నో
స్టార్ హోటల్‌గా గుర్తింపు ఉన్న రాడిసన్ హోటల్‌లో సీసీ కెమెరాల నిర్వహణ ఆధ్వానంగా ఉండటం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. హోటల్‌లో మొత్తం 209 కెమెరాలు ఉండగా కేవలం 16 సీసీ కెమెరాలు మాత్రమే పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. డ్రగ్ పార్టీ జరిగిన రూమ్ వైపు ఉన్న కెమెరాలు పని చేయకపోవడం గమనార్హం. కావాలనే సీసీ కెమెరాలు పని చేయకుండా చేశారా అనే అనుమానాలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment