jagarlamudi krish
-
క్రిష్ విచారణ ఎప్పుడు?
గచ్చిబౌలి: రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్ కేసులో అనుమానితునిగా ఉన్న తెలుగు సినీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ విచారణ ఎప్పుడు ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. క్రిష్ ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉందని, ముంబైలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. అయినప్పటికీ క్రిష్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. అనుమానితునిగా ఉన్న క్రిష్ పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు జాప్యానికి గల కారణాలను అధికారులు వెల్లడించడం లేదు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న రఘు చరణ్, సందీప్, లిషీ, శ్వేత, నీల్ కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. రాడిసన్ హోటల్లో గత శనివారం డ్రగ్ పార్టీ నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రధాన నిందితుడు గజ్జల వివేకానంద పార్టీ ముగి సే వరకు హోటల్ గదిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. రఘు చరణ్, నీల్‌తో కలిసి వచ్చిన డైరెక్టర్ క్రిష్ నేరుగా వివేకానంద ఉన్న గదిలోకి వెళ్లి 30 నిమిషాల పాటు గడిపినట్లు పోలీసు లు గుర్తించారు. కేదార్, లిషీ, నిర్బయ్ కలిసి రాడిసన్ హోటల్‌కు వెళ్లారు. సందీప్, శ్వేత రాడిసన్‌కు వచ్చారు. రాత్రి 8.30 గంటలకు పార్టీ ముగించుకొని వెళ్లగా పోలీసులు రాత్రి 12.30 గంటలకు హోటల్ కు చేరుకున్నారు. అప్పటికే డ్రగ్ పార్టీ ముగించుకొని అక్కడి నుంచి అందరూ ఉడాయించారు. సీసీ కెమెరాలపై అనుమానాలెన్నో స్టార్ హోటల్‌గా గుర్తింపు ఉన్న రాడిసన్ హోటల్లో సీసీ కెమెరాల నిర్వహణ ఆధ్వానంగా ఉండటం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. హోటల్లో మొత్తం 209 కెమెరాలు ఉండగా కేవలం 16 సీసీ కెమెరాలు మాత్రమే పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. డ్రగ్ పార్టీ జరిగిన రూమ్ వైపు ఉన్న కెమెరాలు పని చేయకపోవడం గమనార్హం. కావాలనే సీసీ కెమెరాలు పని చేయకుండా చేశారా అనే అనుమానాలు నెలకొన్నాయి. -
అవసరాల.. నవరసాల శ్రీనివాస్ అయ్యారు
‘‘కంచె’ సినిమా అప్పుడు అవసరాలగారు.. ‘హైట్‌గా లేననో, జుట్టు లేదనో, కలర్‌గా లేననో అనేకమైన ఇన్‌సెక్యూరిటీస్‌తో కొందరు తమ జీవితాలను నరకప్రాయంగా మార్చుకుంటారు. దాన్ని హిలేరియస్‌గా చూపిస్తాను’ అంటూ ఓ ఇరవై నిమిషాల కథ చెప్పారు. ఆ పాయింట్ నాకు, రాజీవ్‌గారికి బాగా నచ్చింది’’ అన్నారు దర్శకుడు జాగర్లమూడి క్రిష్. రాచకొండ విద్యాసాగర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ హీరో హీరోయిన్లుగా ‘దిల్’రాజు, క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. సెప్టెంబర్ 3న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో క్రిష్ మాట్లాడుతూ – ‘‘2017లో దర్శకుడు సాగర్ ఓ థ్రిల్లర్ కథ చెప్పారు. ఆ కథను అవసరాలతో చేద్దామని నేను, రాజీవ్‌గారు అనుకున్నాం. అయితే ‘కంచె’ అప్పుడు చెప్పిన కథ గురించి అవసరాలను అడిగితే, ఆ కథకు ‘నూటొక్క జిల్లాల అందగాడు’ అనే టైటిల్ పెట్టానని చెప్పారు. ఆ సినిమా చేద్దామను కున్నాం. అవసరాల అంకితభావం ఉన్న నటుడు. టెక్నాలజీ సాయంతో బట్టతల కనిపించేలా చేస్తామన్నాం.. కానీ బట్టతల కనిపించేలా షేవ్ చేసుకుని ఓ నాలుగైదు నెలలు ఆయన అలానే ఉన్నారు. అందంగా, కొత్తగా అవసరాల శ్రీనివాస్.. నవరసాల శ్రీనివాస్ అయ్యారు. నిర్మాతలుగా ఎవరూ చెప్పని కథలను చెప్పాలని కంకణం కట్టుకున్న మాకు ‘దిల్’ రాజు, శిరీష్ వంటి నిర్మాతలు తోడయ్యారు. ఈ సినిమా కథ వెండితెరపైకి రావడానికి కృషి చేసిన రాజీవ్ రెడ్డిగారికి థ్యాంక్స్’’ అన్నారు. రాచకొండ విద్యాసాగర్ మాట్లాడుతూ– ‘‘నాకు చిన్న ఫిజికల్ ప్రాబ్లమ్ ఉంది (సరిగా నడవలేకపోవడం, చేయి సరిగా ఉండకపోవడం). నేను డిఫరెంట్‌గా నడుస్తుంటే అందరూ ఏమనుకుంటారో అని బాధపడేవాడిని. నా ఇబ్బందిని యాక్సెప్ట్ చేయడానికి భయపడ్డాను. అమేజింగ్ కథ రాశారు శ్రీని (అవసరాల శ్రీనివాస్). సినిమా తీసిన రెండేళ్లకు అర్థమైంది.. అది నా కథ కూడా అని. ఈ సినిమా కథ చాలామందిని ఆలోచింపజేస్తుంది. నన్ను చూసి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, నా డైరెక్షన్ టీమ్, చిత్రయూనిట్‌తో పాటు నా లైఫ్‌లో నన్ను సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘ఫస్ట్ ఈ సినిమా ఐడియా వచ్చినప్పుడు నా ఐడియా అనుకున్నాను. స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టి క్రిష్‌గారికి చెప్పిన తర్వాత అది మా ఐడియా అయింది. ఆ తర్వాత ఆ ఐడియా సినిమాగా మారింది. సినిమా మీలోని నిజమైన మిమ్మల్ని మీకు పరిచయం చేస్తుంది’’ అన్నారు అవసరాల శ్రీనివాస్. -
సోనూ ఉండుంటే ఆ సినిమా మరోస్థాయిలో ఉండేది
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముందుగా బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సదాశివ్ పాత్రలో నటించేందుకు అంగీకరించగా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాక మధ్యలో సినిమా నుంచి తప్పుకున్నాడు. తాజాగా ఈ సినిమాలో ఆయన పాత్రకు సంబంధించిన ఓ ఫొటోను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. దర్శకుడు క్రిష్‌తో కలిసి తన సిక్స్ ప్యాక్‌తో కండల వీరుడిగా, గంభీరంగా నడుస్తున్న సోనూ గెటప్ అభిమానుల్ని తెగ ఆకట్టుకుంటోంది. దీనికి 'జీవితంలో మంచి కోసం నడవండి... ఏదో ఒక రోజు మీరు సాధిస్తారు' అనే క్యాప్షన్‌తో ఫొటో షేర్ చేశారు. ఈ ఫొటో చూసిన ప్రేక్షకులు సోనూ సినిమాలో నటించి ఉంటే మణికర్ణిక మరో స్థాయిలో ఉండేదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి తప్పుకోవడంపై అప్పట్లో కొన్ని రూమర్స్ వినిపించాయి. చిత్రంలో మార్పులు చేయాలని, సోనూసూద్ పాత్రను తగ్గించాలని కంగనా వాదించడంతో క్రిష్ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ తరువాత కంగన స్క్రిప్టులో మార్పులు చేశారనే ప్రచారం జరిగింది. (సోనూసూద్‌కి ఐరాస అవార్డ్) View this post on Instagram Walk towards the good in life and one day you will arrive ❣️#throwback A post shared by Sonu Sood (@sonu_sood) on Oct 4, 2020 at 7:43am PDT -
‘దాసరి లేరనకండి.. వింటారు...’
హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణరావు మరణం పట్ల యావత్ దక్షిణాది సినిమా పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమలో ‘పెద్దాయన’గా వెలుగొందిన దాసరికి ఘన నివాళులు అర్పిస్తోంది. దాసరి చనిపోతేదని విశ్రాంతి తీసుకుంటున్నారని దర్శకుడు జాగర్లమూడి క్రిష్ తన నివాళి సందేశంలో పేర్కొన్నారు. గురూ గారికి మరణం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ‘గుండె ఆడకపోతే ఏం? దాసరి గారి సినిమా ఆడుతూనే ఉంటుందిగా. ధియేటర్లోనో, టీవీ చానెల్స్‌లోనో.. తాతా మనవడు నుంచి 151 సినిమాలున్నాయి. ఆడుతూనే ఉంటాయి. భూమ్మీద సినిమా అనేది లేనప్పుడు దాసరిగారు లేరనాలి. అది జరగదుకదా. దాసరి గారంటే 74 ఏళ్లు నిండిన వ్యక్తి కాదు, 24 శాఖలు కలిసిన శక్తి. ఇలాంటి వారికి జయ జయ ద్వానాలు ఉంటాయి. కానీ జోహార్లు ఉండవు. దర్శకుడే సినిమాకి కెప్టెన్ అని ఎక్కడ ఎవరంటున్నా దాసరిగారు వింటారు. ఏ తెలుగు దర్శకుడికి ఏ గౌరవం దక్కినా అందులో దాసరిగారు ఉంటారు. పెద్దాయన విశ్రాంతి తీసుకుంటున్నారు. లేరనకండి, వింటారు’ అని క్రిష్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘శకాలు అంతరించిపోవచ్చు కానీ దిగ్గజాలు చిరస్థాయిగా జీవించే ఉంటార’ని దర్శకుడు పూరి జగన్నాథ్ ట్వీట్ చేశారు. దాసరి నారాయణరావు దిగ్గజమని, ఆయన మరణం తెలుగు సినిమా పరిశ్రమకు పూడ్చలేని లోటని మరో దర్శకుడు అనిల్ రావిపూడి పేర్కొన్నారు. తెలుగు సినిమా ఒక లెజెండరీ దర్శకుడిని కోల్పోయిందని దర్శకుడు హరీశ్ శంకర్ అన్నారు. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)