
సాక్షి, హైదరాబాద్: రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ అధీనంలోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో జరిగిన రేవ్ పార్టీ కేసులో నిందితుడిగా ఉండి, ప్రస్తుతం పరారీలో ఉన్న కిరణ్ రాజు పెనుమత్స నుంచి పోలీసులకు ఈ–మెయిల్ వచ్చింది. తాను సదరు పబ్‌లో భాగస్వామినని, పెట్టుబడి పెట్టాను తప్ప కార్యకలాపాలను పర్యవేక్షించట్లేదని తెలిపారు. తన సోదరికి ఆపరేషన్ కావడంతో కొన్ని నెలలుగా తాను అమెరికాలో ఉంటున్నానని పేర్కొన్నారు. పబ్‌పై దాడి జరిగిన తర్వాత తాను పారి పోయినట్లు మీడియాలో వస్తోందని, కానీ తాను పరారీలో లేనంటూ ఈ–మెయిల్‌లో వివరణ ఇచ్చారు.
తాను హైదరాబాద్‌కు వచ్చిన తర్వా త పోలీసుల ఎదుట హాజరై పూర్తి వివరణ ఇస్తానన్నారు. ఈ మెయిల్‌ను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు సాంకేతిక అంశా లపై ఆరా తీస్తున్నారు. ఏ ప్రాంతం నుంచి కిరణ్ దీన్ని పంపారో పరిశీలిస్తున్నారు. కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడు అర్జున్ వీరమాచినేని కోసం గాలింపు కొనసా గుతోంది. ఈయన పశ్చిమ బెంగాల్‌లో ఉన్న ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతర నిందితులు అభిషేక్ ఉప్పల, అనిల్‌కుమార్‌ల కస్టడీ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు సోమవారం తీర్పు వెలువరించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment