మాలి : ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పారిస్‌పై నరమేథాన్ని మరువకముందే పశ్చిమ ఆఫ్రికా దేశం మాలీలోనూ బరితెగించారు. మాలి రాజధాని బమాకోలో పారిస్ తరహా దాడులకు పాల్పడ్డారు. బమాకోలోని రాడిసన్ బ్లూ హోటల్‌పై 10మంది ఆగంతకులు విరుచుకుపడ్డారు. హోటల్‌లో ఉన్న170మందిని బందీలుగా చేసుకున్నారు. బందీల్లో ఎక్కువమంది అమెరికా, బ్రిటిష్ టూరిస్టులున్నారు.
ఉగ్రవాదుల చెరలో 170మంది ఉండగా, వారిలో 140మంది అతిథులు కాగా, 30 మంది హోటల్ సిబ్బంది ఉన్నారు. మరోవైపు భద్రతాదళాలు హోటలును చుట్టుముట్టాయి. ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా ఉగ్రవాదుల వద్ద భారీగా పేలుడు పదార్థులు ఉన్నట్లు సమాచారం. కాగా గత ఆగస్టులోనూ మాలిలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో మొత్తం తొమ్మిదిమంది మరణించారు.
మాలిలో పారిస్ తరహా దాడి!
Published Fri, Nov 20 2015 3:12 PM | Last Updated on Sun, Sep 3 2017 12:46 PM
Advertisement
Advertisement