paris attack
-
ప్యారిస్‌లో ఉగ్రదాడి: ఏకే 47తో కాల్పులు
-
ప్యారిస్‌లో ఉగ్రదాడి: ఏకే 47తో కాల్పులు
ప్యారిస్: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరం ఉగ్రదాడితో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది తుపాకీతో చాంప్స్ ఎలీసెస్ ఏరియాలో కాల్పులకు తెగబడ్డాడు. యుద్ధంలో వినియోగించే ఆయుధంతో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు మృతిచెందాడు. అనంతరం అప్రమత్తమైన సిబ్బంది జరిపిన కాల్పుల్లో సాయుధుడు హతమయ్యాడని అధికారులు వెల్లడించారు. మరికొందరు వ్యక్తుల హస్తం ఉందని, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. సెంట్రల్ ప్యారిస్ అంతా హై అలర్ట్ ప్రకటించారు. అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, లేవాంట్ ఉగ్రవాద సంస్థలు ప్రకటించాయి. ఈ ఉగ్రదాడి తమ పనేనని కాల్పులు జరిపిన కొన్ని నిమిషాల్లోనే ఉగ్రసంస్థ పేర్కొంది. అధ్యక్ష ఎన్నికలకు మూడు రోజుల ముందు ప్యారిస్‌లో ఉగ్రవాదులు దాడికి పాల్పడటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 'నేను చూస్తుండగానే ఓ వ్యక్తి ఏకే 47తో జన సంచారంలోకి వచ్చాడు. ఫ్రెండ్ కోసం నా కారులో ఎదురుచూస్తున్నాను. నల్లని దుస్తువులు ధరించిన వ్యక్తి పోలీసులపై కాల్పులు జరిపి ఓ అధికారిని పొట్టన పెట్టుకున్నాడు' అని సిరిల్ అనే ప్రత్యక్షి సాక్షి చెప్పాడు. -
ప్యారిస్ దాడిలో కొత్తగా మరో ఇద్దరు
బ్రస్సెల్స్: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో గతేడాది ఉగ్రదాడికి పాల్పడి 130మందిని హతమార్చిన ఘటనలో తాజాగా ఇద్దరు నిందితులపై బెల్జియం పోలీసులు అభియోగాలు నమోదుచేసి గురువారం అదుపులోకి తీసుకున్నారు. నిందితులిద్దరిని కే ఫరీద్, మర్యమ్ ఈబీగా గుర్తించిన అధికారులు.. వీరికి గతేడాది మార్చిలో బ్రసెల్స్‌లో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఖలీద్ ఎల్ బక్రోయ్తో సంబంధాలున్నాయని అనుమానిస్తున్నారు. సిరియా, లిబియాలో ఫ్రాన్స్ సైనిక జోక్యానికి ప్రతీకారంగా తామే ఈ దాడులు చేశామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. -
'నన్ను త్వరగా పారిస్ పంపించండి'
బ్రస్సెల్స్: తనను త్వరగా పారిస్‌కు పంపించాలని ఆ నగరంపై దాడికి పాల్పడి ఇటీవల బ్రస్సెల్స్ పోలీసులకు పట్టుబడిన సలాహ్ అబ్దెస్లామ్ కోరాడు. ఈ విషయాన్ని అతడి తరుపు న్యాయవాది తెలిపాడు. 'వీలయినంత తొందరగా పారిస్ పోయేలా చూడాలని అబ్దెస్లామ్ నన్ను కోరాడు. స్వయంగా తనంతట తానే వివరణ ఇచ్చుకోవాలని అనుకుంటున్నాడు. ఇది మంచి పరిణామం' అని ఆ న్యాయవాది చెప్పాడు. కాగా, ఫ్రాన్స్‌పై దాడికి సంబంధించి మరింతమంది ఉగ్రవాదుల గురించిన సమాచారం తెలుసుకునేందుకు అతడిని తమ నిర్భందంలోనే ఉంచుకోవాలా లేక పారిస్‌కు బదిలీ చేయాలా అనే విషయంపై బ్రస్సెల్స్ కోర్టు ఈ రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. -
'చివరి క్షణాల్లో పేల్చేసు కోలేకపోయాను'
బ్రస్సెల్స్: పారిస్ దాడుల సమయంలో చివరి క్షణాలలో తాను పేల్చేసుకోలేక పోయానని ఉగ్రవాది సలాహ్ అబ్దెస్లామ్ తెలిపాడు. గత నవంబర్ లో ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో జరిగిన ఉగ్రదాడుల సూత్రధారి సలాహ్ అబ్దెస్లామ్ని బెల్జియంలో శనివారం అరెస్ట్ అరెస్ట్ చేశారు. తాను సూసైడ్ బాంబర్ ను అని పోలీసుల విచారణలో చెప్పాడు. 4 నెలల నుంచి అతనికోసం వేట ప్రారంభించినట్లు అధికారులు చెబుతున్నారు. ఎట్టకేలకు గత నవంబర్ 13న మారణహోమం సృష్టించి దాదాపు 130 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదిని పట్టుకున్నందుకు ప్రపంచదేశాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. దాడులు చేసినరోజు తనను తాను పేల్చివేసుకోవాలనే అక్కడికి వచ్చినట్లు వెల్లడించాడు. తన అన్న బ్రహీంను కూడా సూసైడ్ బాంబర్ గా ఉపమోగించుకున్నట్లు పారిస్ దాడుల మాస్టర్ మైండ్ వివరించాడు. బ్రూగ్స్ జైలుకు తరలించేందుకు ముందు బ్రస్సెల్స్ అధికారులు చేపట్టిన విచారణలో నిందితుడు అబ్దెస్లామ్ పారిస్ దాడి ఘటనతో పాటు ఆ రోజు తమ ప్లాన్ ఏంటన్నది చెప్పాడని తెలుస్తోంది. ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతున్న పారిస్ అంతర్జాతీయ స్టేడియం, రాక్ బ్యాండ్ ప్రదర్శన వద్ద, బాతాక్లాన్ థియేటర్లతో పాటు.. పలు కెఫేలపై విచక్షణారహితంగా తూటాలు, బాంబులతో బీభత్సం సృష్టించినట్లు ఒప్పుకున్నాడు. -
ఫ్రాన్స్, బెల్జియంపై ఒబామా ప్రశంసలు
వాషింగ్టన్: ఫ్రాన్స్, బెల్జియం దేశాలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అభినందనలు తెలిపారు. ఫ్రాన్స్‌లో ఈ మధ్య కాలంలో చోటుచేసుకున్న దాడికి సంబంధించి కీలక అనుమానితుడు సలాహ్ అబ్దెస్లామ్ను అరెస్టు చేయడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. ఒబామా స్వయంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్, బెల్జియ ప్రధాని చార్లెస్ మైఖెల్ కు ఫోన్ చేసి మరి అభినందనలు తెలిపినట్లు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ తెలిపింది. కఠోర శ్రమ, చక్కటి సహకారం, ఫ్రాన్స్ న్యాయ వర్గాల వల్లే నేడు ఈ కీలకమైన అరెస్టు జరిగిందని ఒబామా చెప్పినట్లు తెలిపారు. తమ మద్దతు ఎప్పటికీ ఆ రెండు దేశాలకు ఉంటుందని అన్నారు. ప్యారిస్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ పలుచోట్ల దాడులకు పాల్పడటంతో దాదాపు 130మంది అమాయకులు బలయ్యారు. ఈ దాడిని చాలా సీరియస్ గా తీసుకున్న ఫ్రాన్స్ ఎట్టకేలకు ఓ కీలక అనుమానితుడిని అరెస్టు చేసింది. -
ఆ మెసేజ్.. ఉగ్రవాది ఐడెంటీని తెలిపింది!
పారిస్: 'నవంబర్ 13న మీ కొడుకు చనిపోయి అమరుడయ్యాడు'.. ఇది పారిస్ నరమేధం అనంతరం దాదాపు పదిరోజులకు ఫౌయెద్ మహమ్మద్ అగ్గద్ తల్లికి వచ్చిన సందేశమిది. సిరియా నుంచి వచ్చిన ఈ టెక్స్ట్ మెసేజ్ బాటక్లాన్ థియేటర్లో దాడులకు పాల్పడిన మూడో ఉగ్రవాది వివరాలను వెల్లడి చేసింది. గత నెల 13న ఉగ్రవాదులు పారిస్ నగరం మీద విరుచుకుపడి 130మందిని హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో భాగంగా బాటక్లాన్ థియేటర్ వద్ద జరిగిన నరమేధంలో 80మందికిపైగా చనిపోయారు. ఇక్కడ మొత్తం ముగ్గరు ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఇందులో ఇద్దరిని ఫ్రాన్స్ కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాదులుగా గుర్తించిన పోలీసులు మూడో వాడి ఆచూకీని మాత్రం కనుక్కొనలేకపోయారు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ లోని స్ట్రాస్‌బర్గ్‌లో ఉంటున్న ఫౌయెద్ మహమ్మద్ అగ్గద్ తల్లికి ఐఎస్ఐఎస్ ఈ సందేశాన్ని పంపింది. ఉగ్రవాద దాడులకు పాల్పడి చనిపోయిన వారిని 'అమరవీరులు'గా పేర్కొంటూ వారి కుటుంబసభ్యులకు ఇస్లామిక్ స్టేట్ గ్రూపు ఈ విధంగా సందేశాలు పంపుతుంది. ఈ నేపథ్యంలో ఆమె ఫ్రాన్స్ పోలీసులకు డీఎన్ఏ శాంపిల్స్ ఇచ్చింది. దీంతో బాటక్లాన్ థియేటర్ వద్ద చనిపోయిన మూడో ఉగ్రవాది అగ్గద్ ఆమె కొడుకేనని పోలీసులు ధ్రువీకరించారు. తన వచ్చిన మెసెజ్‌తో ఆమె ముందుకురాకపోయివుంటే అతను ఎవరో తెలిసేది కాదని అగ్గద్ సోదరుడి తరఫు లాయర్ తెలిపారు. మొత్తానికి పారిస్ నరమేధానికి పాల్పడిన వారిలో చాలామంది యూరిపియన్ పౌరులేనని తెలుస్తున్నది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపు నుంచి శిక్షణ తీసుకొని ఈ వీరు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఇప్పటివరకు వెల్లడైన ఉగ్రవాదుల వివరాలను బట్టి వీరంతా ఫ్రాన్స్, బెల్జియం చెందినవారని, వీరికి స్థానికంగా ఫ్రెంచ్ భాష మాట్లాడటం వచ్చునని దర్యాప్తులో తేలింది. -
ఉగ్ర భూతానికి నిధులిలా..
ప్రపంచవ్యాప్తంగా ఉగ్రకోరలు చాస్తోన్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) పారిస్ దాడి ద్వారా పాశ్చాత్యదేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. యూరప్ దేశాలన్నీ కనివినీ ఎరుగని రీతిలో తమ దేశాల్లోని పట్టణాల్లో భద్రతాబలగాలను మోహరించాయి. భారత్‌లో కూడా ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీఅయ్యాయి. ఇటీవల టర్కీలో సమావేశమైన జీ-20 దేశాలు ఈ ఉగ్రభూతానికి నిధులు అందకుండా కట్టడి చేయాలని పిలుపునిచ్చాయి. ఆర్థికమూలాలపై దెబ్బకొడితే... ఐఎస్ఐఎస్ను కట్టడి చేయవచ్చని భావిస్తున్నాయి. కానీ బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా కాకుండా... ఇతరత్రా మార్గాల్లోనే ఎక్కువగా నిధులను తరలిస్తున్న ఐఎస్ఎస్ను ఆర్థికంగా దెబ్బతీయడం అంత తేలికేమీ కాదు. ఈ ఉగ్రసంస్థ వనరుల సమీకరణ కూడా చాలా భిన్నంగా ఉంది. సిరియా, ఇరాక్లలో దీని అధీనంలో ఉన్న భూభాగంలో 80 లక్షల నుంచి కోటి మంది దాకా నివసిస్తున్నట్లు అంచనా. ఈ జనాభాకు అవసరమైన మౌలిక సదుపాయాలు చూడటం, పాఠశాలలు, ఇస్లామిక్ కోర్టులు నడపటం, ఉద్యోగులు, ఐఎస్ఐఎస్ తరఫున పోరాడే వారికి జీతాలు... చాలా ఖర్చు ఉంటుంది. అలాగే ఆయుధాలు, వాహనాలు సమకూర్చుకోవడం, అంతర్జాతీయ దాడులు, ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని సంస్థకు ప్రచారం చేసుకోవడం, రిక్రూట్మెంట్లు... ఇలా చాలా వాటిపై ఐఎస్ఐఎస్ భారీగానే ఖర్చుపెడుతోంది. దాదాపు 40,000 మంది సాయుధ సిబ్బంది ఉన్నట్లు అంచనా. భారీగా ఆర్థిక అవసరాలున్న ఐఎస్ఐఎస్కు నిధులు ఎలా అందుతున్నాయో చూద్దాం... ఇం‘ధనం’- రూ. 3,650 కోట్లు ఇరాక్‌లో ఐఎస్ఐఎస్ అధీనంలో ఉన్న ప్రాంతంలోని చమురు బావుల్లో మంచి ఉత్పత్తి జరుగుతోంది. ముడిచమురును చిన్నచిన్న రిఫైనరీల్లో, మొబైల్ రిఫైనరీల్లో శుద్ధిచేసి... టర్కీ సరిహద్దుకు తరలిస్తోంది. ఈ ఉగ్రసంస్థ చమురు అంతా బ్లాక్మార్కెట్కే తరలుతోంది. అధికారికంగా ఏ దేశమూ వీరి చమురును కొనదు కాబట్టి బ్లాక్మార్కెట్లో సగం ధరకే ఐఎస్ఐఎస్ చమురును అమ్ముతోంది. టర్కీలోని బ్రోకర్లు ట్యాంకర్లలో వచ్చే చమురును అమ్మిపెడతారు. కువైట్ దినార్లు, సౌదీ అరేబియా రియాళ్లు, స్థానిక కరెన్సీలోనే నగదు చెల్లింపులు జరుగుతాయి. బ్యాంకుల ప్రమేయం ఉండదు. నగదు తరలింపునకు కూడా నెట్వర్క్ ఉంటుంది. అవసరమైతే నగదుకు బదులు ఆయుధాలు, వాహనాల్లాంటివి కూడా స్మగ్లర్లు సమకూర్చుతారు. రోజుకు పది కోట్ల చొప్పున ఏడాదికి 3,650 కోట్ల రూపాయలను చమురు అమ్మకాల ద్వారా ఆర్జిస్తోంది. * ఈ ఏడాది ఆరంభం వరకు చమురు అమ్మకాల ద్వారా ఐఎస్ఐఎస్ ప్రతిరోజు మూడు మిలియన్ డాలర్లు (దాదాపు 20 కోట్ల రూపాయలు)ఆర్జించేది. * అమెరికా ఆధ్వర్యంలోని సంకీర్ణ సేనలు ఇరాక్‌లోని చమురు బావులే లక్ష్యంగా వైమానిక దాడులు జరుపుతున్నాయి. ఈ దాడుల్లో సగం చమురు ఉత్పత్తి సామర్థ్యాన్ని ఐఎస్ఐఎస్ కోల్పోయిందని అంచనా. * మరోవైపు అంతర్జాతీయంగా చమురు ధరల పతనం కూడా వీరి ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇరాకీ బ్యాంకుల లూటీ 3,300 కోట్లు మోసుల్, తిక్రిత్ పట్టణాలను స్వాధీనం చేసుకున్నపుడు ఐఎస్ఐఎస్ అక్కడి ఇరాకీ బ్యాంకులను లూటీ చేసింది. దాదాపు 50 కోట్ల డాలర్ల (3,300 కోట్ల రూపాయల) విలువైన స్థానిక కరెన్సీని ఈ ఉగ్రసంస్థ బ్యాంకుల నుంచి దోచుకుందని అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థల అంచనా. ఆస్తుల అమ్మకం... అంతర్యుద్ధంలో చనిపోయిన, పారిపోయిన వారి ఆస్తులను ఐఎస్ఐఎస్ స్వాధీనం చేసుకుంటోంది. అలాగే ఇరాకీ ప్రభుత్వ యంత్రాగానికి చెందిన అధికారుల ఆస్తులనూ స్వాధీనం చేసుకుంది. వీటిని అమ్మివేస్తోంది. కొన్నిచోట్ల అద్దెకు ఇస్తోంది. ఇరాక్లోనైతే తాము స్వాధీనం చేసుకున్న అమెరికా వాహనాలు, నిర్మాణసామగ్రి, ఫర్నిచర్‌ను అమ్మేసింది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సురక్షిత ప్రదేశాలకు తరలిపోయిన వారి ఆస్తులనూ తమ అధీనంలోకి తీసుకొంటోంది. ఆస్తుల అమ్మకాల ద్వారా కూడా ఆదాయాన్ని గడిస్తోంది. విరాళాలు... 264 కోట్లు * సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, యూఏఈలలోని బడా వ్యాపారులు, ధనవంతులు ధార్మిక కార్యక్రమాలకు విరివిగా విరాళాలు ఇస్తుంటారు. * సిరియా అధ్యక్షుడు అసద్‌ను గద్దె దింపాలనే లక్ష్యంతో ఆయన వ్యతిరేకులకు ఆర్థికసాయం చేస్తున్న వారూ ఉన్నారు. * తీవ్రవాదులకు ఆర్థికసాయంపై అంతర్జాతీయంగా ఒత్తిడి రావడంతో సౌదీ అరేబియా 2013లో ఐఎస్ఐఎస్కు సాయమందించడం నేరంగా పరిగణించే చట్టాన్ని తెచ్చింది. అయితే కువైట్, ఖతార్ బ్యాంకుల నుంచి మాత్రం సిరియాకు నిధుల ప్రవాహం స్వేచ్ఛగా సాగుతోంది. * ఇస్లామిక్ రాజ్యస్థాపనను కాంక్షిస్తూ దాతలు సాయపడుతున్నారు. * కనీసం రిజిస్టర్ కూడా చేసుకోని పలు స్వచ్ఛంద సంస్థలకు ఈ విరాళాలు వెళతాయి. తర్వాత ఇవి వాటి ఖాతాల్లోంచి ఐఎస్ఐఎస్కు చేరతాయి. * 2013-14లో ఈ సంస్థకు 40 మిలియన్ల డాలర్లు (దాదాపు 264 కోట్ల రూపాయలు) విరాళాల రూపంలో అందినట్లు ఒక అంచనా. * 2011లో సిరియాలో అంతర్యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా 1,320 కోట్లు ఇలా లెక్కాపత్రం లేకుండా అనామక సంస్థలకు విరాళాల రూపంలో అందినట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన ‘ఫైనాన్షియల్ ట్రాకింగ్ సర్వీసు’ తేల్చింది. పురాతన వస్తువుల అమ్మకం... రూ.660 కోట్లు * ఇరాక్, సిరియాల్లో తమ అధీనంలోని మ్యూజియాల ను ఐఎస్ఐఎస్ లూటీ చేసింది. ఎన్నో చారిత్రక ప్రదేశాలను ధ్వంసం చేసి అక్కడి వస్తు వులను కొల్లగొట్టింది. పురాతన వస్తువులను తవ్వి వెలికితీసే పని కూడా చేస్తోంది. * వందలు, వేల ఏళ్ల కిందటి అమూల్యమైన ఈ సంపద... టర్కీ, జోర్డాన్ మీదుగా బ్రోకర్ల చేతులు మారి యూరప్‌కు తరలివెళుతున్నాయి. * వేలం సంస్థలు వీటిని అమ్మిపెడుతున్నాయి. * పురాతన వస్తువుల విక్రయం ద్వారా ప్రతియేటా ఐఎస్ఐఎస్ 100 మిలియన్ డాలర్లు (దాదాపు 660 కోట్ల రూపాయలు) ఆర్జిస్తున్నట్లు అమెరికా అంచనా. పంట శిస్తు... రూ.1,300 కోట్లు సిరియా, ఇరాక్లలో అత్యంత సారవంతమైన భూమి ఐఎస్ఐఎస్ ఆధీనంలో ఉంది. గోధు మలు, బార్లీ పండుతాయి. రైతులు తమ మొత్తం దిగుబడిలో పదిశాతం శిస్తుగా చెల్లించాలి. ఈ వ్యవసాయ ఉత్పత్తులను బ్లాక్మార్కెట్లో సగం ధరకు అమ్ముకున్నా 1,300 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం ఐఎస్ఐఎస్కు వస్తుందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ఫాస్పేట్, సల్ఫర్ అమ్మకం... 2,330 కోట్లు ఐఎస్ఐఎస్ అధీనంలో ఉన్న ప్రాంతంలో సహజ వనరులు నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయి. * ఫాస్పేట్ అమ్మకం ద్వారా 330 కోట్లు, సల్ఫరిక్ యాసిడ్ అమ్మకం ద్వారా దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఈ ఉగ్రసంస్థ ఏటా సంపాదిస్తోందని రాయిటర్స్ అంచనా. ఇవి కాకుండా స్థానిక ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు ఎలాగూ ఉంటుంది. కిడ్నాప్‌లు బడా వ్యాపార కుటుంబాలను టార్గెట్ చేస్తూ ఐఎస్ఐఎస్ కిడ్నాప్‌లకు పాల్పడుతోంది. భారీ మొత్తాల్లో వసూలు చేసి విడిచిపెడుతోంది. వీరి ఆదాయవనరుల్లో కిడ్నాప్‌లు కూడా ప్రధానమైనవే. ఈ ఏడాది ఇప్పటిదాకా కిడ్నాప్‌ల ద్వారా 130 కోట్లు ఐఎస్ఐఎస్ ఆర్జించిందని అమెరికా ఆర్థిక నిఘా విభాగాల అంచనా. ఆపడం ఎందుకు కష్టమంటే... టర్కీ సరిహద్దు పట్టణాల్లోని బ్రోకర్లపై తాజాగా అమెరికా నిఘా పెట్టింది. వీరి సమాచారాన్ని టర్కీకి అందజేస్తోంది. ఇరాక్ కూడా ఐఎస్ఐఎస్తో అక్రమ లావాదేవీలు జరుపుతున్న తమ పౌరులను పలువురిని నిర్భందించింది. ఐఎస్ఐఎస్ ఏది అమ్మినా... బ్లాక్మార్కెట్లోనే, అదీ దాదాపు సగం ధరకే. కొనుగోళ్లు, చెల్లింపులు అన్నీ గుట్టుగా జరిగిపోతుంటాయి. సగం ధరకే ఐఎస్ఐఎస్ దగ్గర కొన్న బ్రోకర్లు వీటిని మార్కెట్ ధరకు అమ్ముకొని భారీగా లాభపడుతున్నారు. కాబట్టే పాశ్చాత్యదేశాలు ఎంతగా ఆర్థికవనరులను కట్టడి చేయడానికి ప్రయత్నించినా ఐఎస్ఐఎస్కు నిరంతరా యంగా డబ్బు అందుతూనే ఉంది. - సాక్షి స్పెషల్ డెస్క్ -
మాలి దాడుల వెనక....
బమాకా: ఆఫ్రికా దేశమైన మాలి గత మూడేళ్లుగా టెర్రరిజంతో అల్లాడిపోతోంది. 2012లో అప్పటి మాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలెత్తిన తిరుగుబాటు టెర్రరిజానికి దారి తీసింది. నేడు ఇప్పుడది దేశవ్యాప్తంగా విస్తరించి ప్రజలను భయకంపితులను చేస్తోంది. త్వారెగ్ సంచార తెగకు చెందిన తిరుగుబాటుదారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదట తిరుగుబాటు చేశారు. మాజీ లిబియన్ సైనికులతో ఏర్పడిన 'నేషనల్ మూవ్మెంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ అజావద్ (ఎంఎన్ఎల్ఏ)' ఆ తిరుగుబాటుకు మద్దతిచ్చింది. మాలి ఉత్తర భాగంలోని అజావద్ ప్రాంతాన్ని ఎంఎన్ఎల్ఏ తిరుగుబాటుదారులు ఆక్రమించుకొని స్వతంత్ర ప్రాంతంగా ప్రకటించారు. మాలిలో షరియా చట్టాన్ని అమలు చేయడం కోసం మాలి ప్రభుత్వాన్ని పడగొట్టడంలో తిరుగుబాటుదారులకు ముస్లిం తీవ్రవాదులైన అన్సర్ థైస్, అల్ కాయిదా గ్రూపులు కూడా మద్దతిచ్చాయి. ముస్లిం తీవ్రవాదులను అణచివేతకు 2013, జనవరి నెలలో ఫ్రెంచ్ సైన్యం 'సర్వల్' పేరిట ఓ ఆపరేషన్ నిర్వహించింది. అప్పటికే మాలి ఉత్తరాది ప్రాంతాలను ఆక్రమించుకున్న ఇస్లాం తీవ్రవాదులు దక్షిణ ప్రాంతాలను కూడా ఆక్రమించుకునే ఉద్దేశంతో టెర్రరిస్టు దాడులకు పాల్పడుతూ వస్తున్నారు. గత మార్చి 6వ తేదీన ఇస్లామిక్ తీవ్రవాదులు దేశ రాజధాని బమాకాలోని ఓ రెస్టారెంట్‌పై దాడి చేసి ఐదుగురిని కాల్చి చంపారు. మృతుల్లో ఇద్దరు యూరోపియన్లు కూడా ఉన్నారు. ఇస్లామిక్ తీవ్రవాదులు దేశంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ముఖ్యమంగా ఉత్తరాదిలో దాడులకు పాల్పడవచ్చంటూ మాలి విదేశాంగ కార్యాలయం దేశ ప్రజలను, ముఖ్యంగా విదేశీ పర్యాటకులను హెచ్చరిస్తూ వస్తోంది. శుక్రవారంనాడు రాడిసన్ బ్లూ హోటల్లోకి ముస్లిం మిలిటెంట్లు జొరబడి ప్రజలపై కాల్పులు జరపడం ఆ తరహా దాడిగానే కనిపిస్తోంది. మాలి ప్రజలకు రక్షణ కల్పించడం కోసం ఐక్యరాజ్య సమితి తరఫున 12వేల మంది సైనికులు మాలికి రక్షణ కల్పిస్తున్నారు. -
9మందిని హతమార్చిన ఉగ్రవాదులు?
-
9మందిని హతమార్చిన ఉగ్రవాదులు?
మాలి: మాలి రాజధాని బమాకోలోని రాడిసన్ బ్లూ హోటల్లో 170మందిని బందీలుగా చేసుకున్న ఉగ్రవాదులు... వారిలో 9మందిని హతమార్చినట్లు సమాచారం. మృతుల్లో ఐక్యరాజ్యసమితి సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఫ్రెంచ్, బెల్జియం దేశస్తులు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా ఓ ఫ్రెంచ్ దేశస్తుడు సహా ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. సుమారు 10మంది ఉగ్రవాదులు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలతో హోటల్ లోకి చొరబడినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల చెర నుంచి బందీలను విడిపించేందుకు భద్రతా దళాలు యత్నిస్తున్నాయి. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా హోటల్ సమీపంలో పేలుడు వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు స్థానిక మీడియాకు తెలిపారు. మరోవైపు మాలి ప్రధాని అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే ఈ దాడులకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మాలిలో పారిస్ తరహా దాడి!
-
మాలిలో పారిస్ తరహా దాడి!
మాలి : ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పారిస్‌పై నరమేథాన్ని మరువకముందే పశ్చిమ ఆఫ్రికా దేశం మాలీలోనూ బరితెగించారు. మాలి రాజధాని బమాకోలో పారిస్ తరహా దాడులకు పాల్పడ్డారు. బమాకోలోని రాడిసన్ బ్లూ హోటల్‌పై 10మంది ఆగంతకులు విరుచుకుపడ్డారు. హోటల్లో ఉన్న170మందిని బందీలుగా చేసుకున్నారు. బందీల్లో ఎక్కువమంది అమెరికా, బ్రిటిష్ టూరిస్టులున్నారు. ఉగ్రవాదుల చెరలో 170మంది ఉండగా, వారిలో 140మంది అతిథులు కాగా, 30 మంది హోటల్ సిబ్బంది ఉన్నారు. మరోవైపు భద్రతాదళాలు హోటలును చుట్టుముట్టాయి. ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా ఉగ్రవాదుల వద్ద భారీగా పేలుడు పదార్థులు ఉన్నట్లు సమాచారం. కాగా గత ఆగస్టులోనూ మాలిలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో మొత్తం తొమ్మిదిమంది మరణించారు. -
పారిస్‌లో దాడికి కుట్రదారు అబిదెల్ హతం
-
అబిదెల్ హతమయ్యాడు
సెయింట్ డెనిస్: పారిస్ దాడుల ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న అబిదెల్ హమీద్ అబౌద్ హతమయ్యాడు. దాడులకు కీలక సూత్రదారి అయిన అతడిని పారిస్ బలగాలు గుర్తించాయని, అనంతరం జరిపిన దాడిలో అబ్దుల్ హమీద్ మృతిచెందాడని ఫ్రాన్స్ ప్రభుత్వానికి చెందిన ఓ ప్రభుత్వ లాయర్ తెలిపారు. అబ్దుల్ హమీద్ కోసం సెయింట్ డెనిస్‌లో పారిస్ బలగాలు భారీ ఆపరేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. అక్కడ ఉన్న ఓ అపార్ట్మెంట్లో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చి.. ఏడుగురిని అరెస్టు చేశారు. దీంతో ఏడుగంటల హోరాహోరీ కాల్పుల అనంతరం ఆపరేషన్ ముగిసినట్టు పోలీసుల ప్రకటించారు. అయితే తాము ప్రధానంగా గురిపెట్టిన కీలక ఉగ్రవాది అబ్దుల్ హమీద్ చనిపోయాడా? లేక బతికి ఉన్నాడా? అన్న విషయాన్ని వారు తొలుత ధ్రువీకరించడం లేదు. గురువారం ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వేలిముద్రల ఆధారంగా అబిదెల్ను గుర్తించినట్లు అధికారులు చెప్పారు. -
‘నన్ను నమ్మితే కౌగిలివ్వండీ!’
పారిస్: నగరమంతా విషాధం అలుముకున్న సమయం అది. ఇటీవల టెర్రరిస్టుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన 129 మంది అమాయక ప్రజలకు నివాళి అర్పించేందుకు కూడలి వద్దకు వచ్చిన ప్రజలంతా కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. ఇంతలో అక్కడికి కళ్లకు గంతలు కట్టుకున్న ఓ ముస్లిం యువకుడు వచ్చి నిలబడ్డాడు. అతని చేతిలో ఓ ప్లే కార్డ్ ఉంది. దానిపై ‘నేను ఒక ముస్లింను. నన్నంతా టెర్రరిస్టు అని అంటున్నారు. మిమ్మల్ని నేను నమ్ముతున్నాను. మీరు నన్ను నమ్మితే నా వద్దకు వచ్చి నన్ను ఆలింగనం చేసుకోండి’ అని రాసింది. నివాళి అర్పిస్తున్న పిన్నలు, పెద్దలంతా ఆ యువకుడి వద్దకు వెళ్లి, వరుసగా ఒకరి తర్వాత ఒకరు ఆ యువకుడిని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఆ యువకుడు కళ్లకు కట్టుకున్న గంతలు విప్పేసి, తనను నమ్మి ఆలింగనం చేసుకున్న వారందరికి ధన్యవాదాలు తెలిపాడు. ‘ఇలా అడిగినందుకు నన్ను క్షమించండి. ఓ సందేశం ఇవ్వడం కోసమే నేను ఇలా చేయాల్సి వచ్చింది. నేను ముస్లింను. అయినంతమాత్రాన నేను టెర్రరిస్టును కాను. నేనెప్పుడూ ఎవరినీ చంపలేదు. మారణహోమం జరిగిన గత శుక్రవారం నాడు నా పుట్టిన రోజు. కానీ జరుపుకోలేదు. కనీసం బయటకు కూడా రాలేదు. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. టెర్రరిస్టు అంటే టెర్రరిస్టే. ఏ కారణం లేకుండా అమాయకులను చంపేవాడు. ముస్లిం అయినంత మాత్రాన టెర్రరిస్టు కాడు. ముస్లిం అనేవారు ఎవరినీ చంపరు. చంపడాన్ని ముస్లిం మతం నిషేధిస్తోంది’ అని యువకుడు వ్యాఖ్యానించాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనను వీడియో తీసి ఆన్లైన్లో పోస్ట్ చేయగా, ఒక్క ఫేస్‌బుక్‌లోనే ఇప్పటి వరకు కోటి మంది యూజర్లు వీక్షించారు. లక్షా యాభై వేల మంది లైక్స్ కొట్టారు. -
ఐసిస్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన మైనార్టీలు
-
పువ్వులు, క్యాండిల్స్ కాపాడతాయట!
-
పువ్వులు, క్యాండిల్స్ కాపాడతాయట!
పారిస్ : ఫ్రాన్స్ రాజధాని నగరం పారిస్ లో ఐఎస్ ఎస్ సృష్టించిన దారుణ మారణహోమానికి ప్రపంచదేశాలు సైతం వణికిపోతున్న సంగతి తెలిసిందే. వాళ్లు ఎందుకు అంతమందిని చంపేశారంటూ పారిస్‌లో ఓ బాలుడు అమాయకంగా అడగడం, వాళ్ల నాన్న ఆ పిల్లవాడిని సముదాయించిన వైనం అందరినీ ఆకర్షిస్తోంది. ఈ తండ్రీ కొడుకుల సంభాషణకు సంబంధించిన వీడియోను జెరెం ఇసాక్ రూసో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఫ్రెంచ్ టీవీలో ప్రసారమైన ఈ వీడియోను ఇంగ్లీష్ టైటిల్స్ చేర్చి చాలా అద్భుతమైన, విలువైన సంభాషణ అంటూ ఫేస్ బుక్ లో షేర్ చేశాడు. పువ్వులు, కాండిల్స్ మనల్ని రక్షిస్తాయా అంటూ.. బెదురు కళ్లతో అడుగుతూ చివరికి కన్విన్స్ అయ్యి చిరునవ్వులు చిందిస్తున్న ఈవీడియో నెట్లో హల్ చల్ చేస్తోంది. బటాక్లాన్ థియేటర్ కాల్పుల సంఘటనలో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులర్పిస్తున్న సందర్భంగా స్థానిక టీవీ చానల్ ప్రతినిధి ఇంటర్వ్యూలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వారి సంభాషణ క్లుప్తంగా ఇలా సాగుతుంది... 'వాళ్లు చాలా చెడ్డవాళ్లు. వాళ్ల దగ్గర తుపాకులు ఉన్నాయి.. మన్నల్ని చంపేస్తారు. 'లేదు ..పారిస్ మనది.. మనం ఎక్కడికీ పారిపోవాల్సి అవసరం లేదు.. వాళ్ల దగ్గర తుపాకులుంటే, మన దగ్గర పువ్వులు, క్యాండిల్స్ ఉన్నాయి.. క్యాండిల్స్, పువ్వులు, మనల్ని కాపాడతాయా.. ఇలా సాగుతుంది ఆ సంభాషణ. చివరికి పువ్వులతో ఆ బ్యాడ్ పీపుల్ని మనం ఎదుర్కోవచ్చని తండ్రి అనునయంగా చెప్పిన మాటలకు ఏంతో రిలాక్స్డ్ గా బాలుడు నవ్వులు చిందించడం నెటిజనులను ఆకర్షిస్తోంది. దీంతో లైక్ లు, షేర్ల వెల్లువ పొంగుతోంది. -
'ఐఎస్ఐఎస్ తో ప్రపంచానికే ముప్పు'
న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ నుంచి తమ దేశానికి మాత్రమే కాకుండా ప్రపంచానికంతటికీ ముప్పు పొంచివుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. పారిస్ లో దాడుల తర్వాత దేశంలో అప్రమత్తత ప్రకటించిచామని చెప్పారు. ఐఎస్ఐఎస్ తో ప్రత్యేకంగా ఒక దేశానికే కాకుండా ప్రపంచ దేశాలన్నిటికీ ముప్పు ఉందని వెల్లడించారు. పారిస్ లో ఐఎస్ఐఎస్ సాగించిన మారణహోమంలో 129 మంది మృత్యువాత పడ్డారు. 300 మంది పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ లో ఎమర్జెన్సీ ప్రకటించారు. సరిహద్దులు మూసేయాలని అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండె ఆదేశించారు. -
ఉగ్ర మూక
-
ప్యారిస్‌లో ప్రతీకార జ్వాల
-
ఆ కారులో ఏకే-47 తుపాకులు!
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉగ్రవాదులు తలపెట్టిన నరమేధంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. టర్కీలో జరుగనున్న జీ20 సదస్సులో ఆర్థిక అజెండా కంటే ఉగ్రవాదంపై పోరుకే పెద్దపీట వేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ నరమేధానికి కారకులైనవారి పూర్తి వివరాలు శరవేగంగా వెలుగులోకి తెచ్చేందుకు ఫ్రాన్స్ పోలీసు, దర్యాప్తు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌లోని తూర్పు మాంట్రియల్ పట్టణంలోని ఉగ్రవాదులు ఉపయోగించిన నల్లరంగు కారును పోలీసులు కనుగొన్నారు. ఈ వాహనంలో ప్రయాణించిన ఉగ్రవాదులు పారిస్‌లోని ఓ రెస్టారెంట్ వద్ద కాల్పులు జరిపి.. పలువురి ప్రాణాలు పొట్టనబెట్టుకున్నారు. ఈ కారులో కొన్ని ఏకే-47 తుపాకులు లభించాయి. దీనినిబట్టి నరమేధంలో పాల్గొన్న కొందరు ఉగ్రవాదులు తప్పించుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బాటాక్లాన్ కాన్సర్ట్ హాల్ వద్ద దాడులు జరిపిన ఉగ్రవాదులు ప్రయాణించిన మరో కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కారును బెల్జియంలో అద్దెకు తీసుకున్నట్టు గుర్తించారు. ఈ వివరాల ఆధారంగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్టుగా భావిస్తున్న ఐదుగురు వ్యక్తులను బెల్జియంలో అరెస్టు చేశారు. మరోవైపు ఫ్రాన్స్ పోలీసులు ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. -
కిల్లర్లకు మాజీ ఎమ్మెల్యే రూ. 51 కోట్ల నజరానా
లక్నో: పారిస్‌లోని ఒక వ్యంగ్య వారపత్రిక చార్లీ హెబ్డో కార్యాలయంపై దాడి చేసిన వారికి బీఎస్పీ నేత, మాజీ ఎమ్మెల్యే యాకూబ్ ఖురేషి నజరానా ప్రకటించారు. దాడి చేసిన దుండగులకు ఆయన వత్తాసు పలికారు. ఈ దాడి చేసినందుకు దుండగులకు ఆయన రూ. 51 కోట్ల నగదు కానుకగా ఇస్తానని యాకూబ్ ఖురేషి గురువారం ప్రకటించారు. ముస్లింలు పరమ పవిత్రంగా ఆరాధించే మహ్మద్ ప్రవక్తను ఎవరైనా అగౌరవపరచాలని చూసే వారికి ఇదే తరహా ఘటనలే ఎదురవుతాయని ఆయన హెచ్చరించారు. మహ్మద్ ప్రవక్తపై వ్యంగ్య చిత్రాలు వేసిన వ్యక్తిని హతమారిస్తే రూ. 51 కోట్ల నజరానా ఇస్తానని 2006లో ఆయన ప్రకటించి... పెద్ద వివాదానికి తెరలేపారు. యాకూబ్ ఖురేషి వ్యాఖ్యలను బీఎస్పీ ఖండించింది. ఖురేషి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని పేర్కొంది. పారిస్‌లోని ఒక వ్యంగ్య వారపత్రిక చార్లీ హెబ్డో కార్యాలయంపై బుధవారం ముగ్గురు ఉగ్రవాదులు దాడులకు తెగబడి పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్, ముగ్గురు సుప్రసిద్ధ కార్టూనిస్టులుసహా 10మంది జర్నలిస్టులను, ఇద్దరు కానిస్టేబుళ్లనూ కాల్చిచంపిన సంగతి తెలిసిందే. -
ఉన్మాద చర్య
సంపాదకీయం సామాన్యుడు అసామాన్యుడై, శిరమెత్తి కళ్లెర్రజేసి రాజరికాన్ని తుత్తినియలు చేసిన గడ్డ అది. ఈ ప్రపంచంలో తొలిసారి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను మాటలుగా కాదు...ఆచరణలో ‘పారిస్ కమ్యూన్’గా ఆవిష్కరించి చూపిన ప్రాంతమది. మళ్లీ నియంత పోకడలను ప్రదర్శించబోయిన వ్యవస్థపై 1968లో అదే స్ఫూర్తితో తిరగబడి అధికార పీఠాన్ని వణికించిన చరిత్ర దాని సొంతం. ఈమధ్య ఫ్రాన్స్ ప్రభుత్వం ఇవ్వజూపిన దేశ అత్యున్నత పురస్కారాన్ని తిరస్కరిస్తూ ‘పౌరుల్లో ఎవరు గౌరవనీయులో నిర్ణయించే అధికారం మీకెక్కడిద’ని తిరగ్గొట్టిన ప్రముఖ ఆర్థికవేత్త థామస్ పికెటీ కొనసాగించింది ఆ సంప్రదాయాన్నే. స్వేచ్ఛను ప్రబోధించి, ఆచరించి...తిరుగుబాటును ఆశ్వాసించిన అలాంటి నేలపై నెత్తురొలికింది. పారిస్‌లోని ఒక వ్యంగ్య వారపత్రిక ‘చార్లీ హెబ్డో’ కార్యాలయంపై బుధవారం ముగ్గురు ఉగ్రవాదులు దాడులకు తెగబడి పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్, ముగ్గురు సుప్రసిద్ధ కార్టూనిస్టులుసహా 10మంది జర్నలిస్టులను, ఇద్దరు కానిస్టేబుళ్లనూ కాల్చిచంపారు. ఉన్మాదుల్లో ఒకడు తనంత తానే లొంగిపోయాడని వార్తలు వస్తుండగానే మరో ఇద్దరు ఉగ్రవాదులు రెండోరోజు కూడా పారిస్ రోడ్డుపై ఒక మహిళా కానిస్టేబుల్‌పై గుండ్ల వర్షం కురిపించి ప్రాణాలు తీశారు. ఒకటి రెండుచోట్ల పేలుళ్లు కూడా సంభవించాయి. అల్ కాయిదా ఉగ్రవాద సంస్థకు చెందినవారుగా చెప్పుకున్న ఈ ఉన్మాదుల్లో ఒకరికి గతంలో జైలు శిక్ష కూడా పడిందంటున్నారు. ఉగ్రవాదుల దుశ్చర్యను ఫ్రాన్స్ సరిగానే అర్ధంచేసుకుంది. ‘ఇది భావప్రకటనా స్వేచ్ఛపైనా, రిపబ్లిక్ స్ఫూర్తిపైనా జరిగిన దాడి’ అని అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండ్ ప్రకటించారు. ఉదారవాద భావాలను సహించలేని వాతావరణం ప్రపంచవ్యాప్తంగా పెచ్చుమీరుతున్నవేళ ఒక మతాన్ని అనుసరించేవారి మనోభావాలను దెబ్బతీసేలా, వారి విశ్వాసాలను అవహేళన చేసేలా...ఒక్కసారి కాదు, పదే పదే కార్టూన్లు ప్రచురించి ‘చార్లీ హెబ్డో’ తప్పే చేసి ఉండొచ్చు. అలాగని ‘చార్లీ హెబ్డో’ అనుసరించే మతమేమీ లేదు. దానికి క్రైస్తవమైనా, ఇస్లామైనా, జుడాయిజమైనా, మరొకటైనా ఒక్కటే. చెప్పాలంటే అన్ని మతాలనూ, ఆ మతాలు ప్రబోధించే విశ్వాసాలనూ అది వెటకారం చేసింది. ‘అధికార రోగపూరిత బదిరాంధకుల’ను అసలే వదల్లేదు. అత్యున్నతస్థాయి నేతలైనా, అధికారులైనా, సెలబ్రిటీలైనా ఆ పత్రిక కార్టూనిస్టులకు లెక్కలేదు. అలాంటివారందరినీ తమ కుంచెలతో గిచ్చారు...ఎత్తిపొడిచారు...తలెత్తుకు తిరగలేనివిధంగా వ్యంగ్య ధోరణిలో ఎండగట్టారు. వీటన్నిటి వెనకా అపరిమితమైన స్వేచ్ఛ, అన్నిటినీ ఎదిరించే తిరుగుబాటు మనస్తత్వం, దేన్నీ లెక్కచేయనితనం వంటి భావనలే ఉన్నాయి. అయితే, పాశ్చాత్య సమాజం మునుపటిలా లేదు. 2001లో అమెరికాలోని ట్విన్ టవర్స్‌పై జరిగిన దాడి తర్వాత అమెరికా, దాని మిత్రదేశాలూ వ్యవహరించిన తీరువల్ల ఉగ్రవాదం అదుపులోనికి రాలేదు సరిగదా...మరింతగా విస్తరించింది. ఉగ్రవాదంపై యుద్ధం పేరిట అమెరికా చేసిందంతా దానికి బలం చేకూర్చడమే. ఇందుకు యూరప్ దేశాలన్నీ సహకరించాయి. ట్విన్ టవర్స్‌పై దాడికి బాధ్యులైనవారిని వెంటాడి పట్టుకోవడానికి బదులు ఆ వంకన ఇరాక్‌పై దండయాత్ర జరిపి, అటు తర్వాత మరిన్ని దేశాల్లో జోక్యం చేసుకుని వాటన్నిటినీ వల్లకాటి సీమలుగా మార్చాయి. ఉగ్రవాదాన్ని ఒంటరి చేసి, దాన్ని తుదముట్టించడానికి బదులు ఒక మతంపై దాడి చేస్తున్నారన్న అభిప్రాయాన్ని కలగజేశాయి. గత పాతికేళ్లలో పాశ్చాత్య ప్రపంచం పోతున్న ఈ పోకడలపై ఉదారవాద మేథావులెందరో హెచ్చరించారు. దీనివల్ల ఉగ్రవాదానికి మరింత ఊపిరిపోసినట్టవుతుందని చెప్పారు. ఇలాంటి వాతావరణం ఉండటం కొందరు ఉన్మాదులకు అందివచ్చింది. తమను తాము మత రక్షకులుగా చెప్పుకుని తమతో ఏకీభవించనివారిని హతమార్చే పనికి పూనుకుంటున్నారు. వీరికి మతం ఒక సాకు తప్ప అది బోధించే ఉన్నతమైన విలువలతో, సంస్కృతితో సంబంధం లేదు. తోటి మనుషులపై కనీసమైన గౌరవం లేదు. ఇరాక్, యెమెన్, అఫ్ఘానిస్థాన్, నైజీరియా వంటి దేశాల్లో తుపాకులతో, కారు బాంబులతో, గ్రెనేడ్లతో, ఆత్మాహుతి దాడులతో నిత్యమూ వందలమందిని హతమారుస్తున్నవారు ఏ మతం పేరు చెప్పుకున్నా అది నిజం కాదు. మతాన్ని కాపాడుకోవడానికే తుపాకులను ఎక్కుపెట్టామని, హింసకు పాల్పడుతున్నామని అంటున్నవారు తామే ఆ మతానికి మొదటి శత్రువులమన్న సంగతిని మరుస్తున్నారు. అలాంటివారు మొత్తంగా మానవత్వానికీ, ఉదారవాద భావాలకూ, స్వేచ్ఛాసమానత్వాలకూ వ్యతిరేకులు. ప్రపంచవ్యాప్తంగా మీడియా ప్రతినిధులపై దాడులు ఇటీవలికాలంలో పెరిగాయి. నిరుడు వివిధ దేశాల్లో 66మంది పాత్రికేయులు ప్రాణాలు కోల్పోతే, 119మంది కిడ్నాపయ్యారు. మరో 178మంది నిర్బంధంలో మగ్గుతున్నారు. సిరియా, పాలస్థీనా, ఉక్రెయిన్, ఈజిప్టు, మెక్సికోవంటి ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతాల్లో ఏం జరుగుతున్నదో ప్రపంచానికి తెలియజెప్పాలన్న సంకల్పంతో పనిచేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులు ఇలా హింసకూ, దౌర్జన్యానికీ, వేధింపులకూ లోనవుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. మన దేశంతోసహా చాలా దేశాల్లో మతం పేరుచెప్పి ఉన్మాదాన్ని పెంచిపోషిస్తున్న శక్తులు తయారవుతున్నాయి. విద్వేషాన్ని, అసహనాన్ని ప్రబోధిస్తున్నాయి. ఇప్పుడు ఫ్రాన్స్‌లో జరిగిన ఉదంతం వీటన్నిటికీ పరాకాష్ట. ఇలాంటి శక్తులపట్ల అప్రమత్తంగా లేకపోతే పారిస్‌లో జరిగిందే రేపన్నరోజు అన్నిచోట్లా పునరావృతమవుతుంది. ఒక వ్యంగ్య రేఖాచిత్రమో, మనసును సూటిగా తాకేలా చెప్పిన ఒక మాటో ప్రాణాలు తీసేంతటి కారణాలుగా కొందరికి కనబడటమంటే మళ్లీ మనం మధ్యయుగాలనాటి పరిస్థితుల్లోకి జారుకుంటున్నట్టే లెక్క. ఎన్నో పోరాటాలతో, త్యాగాలతో సాధించుకున్న ఉదారవాద భావాలనూ, ప్రజాస్వామిక విలువలనూ ధ్వంసంచేయడానికి పూనుకుంటున్న ఇలాంటి శక్తులపై అప్రమత్తంగా ఉండటం...వారిని ఏకాకులను చేయటం ఈనాటి తక్షణావసరం. తమ చర్యలతో ఆ తరహా పోకడలకు పరోక్షంగా నారూ నీరూ పోస్తున్నవారిని సైతం నిలదీయగలగాలి. అప్పుడు మాత్రమే ఉగ్రవాదం నామరూపాల్లేకుండా కొట్టుకుపోతుంది. -
పారిస్ దాడి ఘటనలో అనుమానితుల ఫొటోలు విడుదల
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని 'చార్లీ హెబ్డో' అనే వ్యంగ్య పత్రికా కార్యాలయంపై బుధవారం ముష్కరులు జరిపిన దాడికి సంబంధించి ఫ్రాన్స్ పోలీసులు ఇద్దరు అనుమానితుల ఫొటోలను విడుదల చేశారు. ఉగ్రవాదుల దాడిలో పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్, ముగ్గురు కార్టూనిస్టులు సహా మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. నిందితుల కోసం ఫ్రాన్స్ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అనుమానిస్తున్నారు. ఫ్రాన్స్ దేశస్తులైన సోదరులు చెరిఫ్ కౌచీ, సైద్ కౌచీలతోపాటు హమీద్ అనే 18 ఏళ్ల విద్యార్థిని అనుమానిస్తున్నారు. వారిలో చెరిఫ్ కౌచీ, సైద్ కౌచీ ఫొటోలను విడుదల చేశారు. పెట్రోల్ బంకు మేనేజర్ వారిని గుర్తించినట్లు తెలుస్తోంది. 2008లో ఉగ్రవాదులకు సహకరించిన కేసులో చెరిఫ్ కౌచీ 18 నెలల జైలు శిక్ష అనుభవించాడు.