అబిదెల్ హతమయ్యాడు | abdul hamid aboud killed by paris | Sakshi
Sakshi News home page

అబిదెల్ హతమయ్యాడు

Published Thu, Nov 19 2015 6:50 PM | Last Updated on Sun, Sep 3 2017 12:43 PM

అబిదెల్ హతమయ్యాడు

అబిదెల్ హతమయ్యాడు

సెయింట్ డెనిస్: పారిస్ దాడుల ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న అబిదెల్ హమీద్ అబౌద్ హతమయ్యాడు. దాడులకు కీలక సూత్రదారి అయిన అతడిని పారిస్ బలగాలు గుర్తించాయని, అనంతరం జరిపిన దాడిలో అబ్దుల్‌ హమీద్‌ మృతిచెందాడని ఫ్రాన్స్ ప్రభుత్వానికి చెందిన ఓ ప్రభుత్వ లాయర్ తెలిపారు. అబ్దుల్ హమీద్ కోసం సెయింట్ డెనిస్‌లో పారిస్ బలగాలు భారీ ఆపరేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే.

అక్కడ ఉన్న ఓ  అపార్ట్‌మెంట్‌లో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చి.. ఏడుగురిని అరెస్టు చేశారు. దీంతో ఏడుగంటల హోరాహోరీ కాల్పుల అనంతరం ఆపరేషన్ ముగిసినట్టు పోలీసుల ప్రకటించారు. అయితే తాము ప్రధానంగా గురిపెట్టిన కీలక ఉగ్రవాది అబ్దుల్ హమీద్ చనిపోయాడా? లేక బతికి ఉన్నాడా? అన్న విషయాన్ని వారు తొలుత ధ్రువీకరించడం లేదు. గురువారం ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వేలిముద్రల ఆధారంగా అబిదెల్ను గుర్తించినట్లు అధికారులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement