Abdelhamid Abaaoud
-
ఆమె ఫోన్‌ను ట్యాప్ చేయడం వల్లనే..
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిపిన ఉగ్రవాద దాడులకు కీలక సూత్రదారిగా భావిస్తున్న అబ్దుల్ హమీద్ అబౌద్‌ను భద్రతా బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. పారిస్ దాడి అనంతరం హమీద్ కోసం భద్రతా బలగాలు దేశం మొత్తం జల్లెడ పట్టాయి కానీ అతని ఆచూకీని మాత్రం కనిపెట్టలేకపోయాయి. అయితే ఓ మహిళ ఫోన్ నెంబర్‌ను ట్యాప్ చేయడంతో హమీద్ ఆచూకీని కనిపెట్టగలిగామని ఫ్రెంచ్ పోలీసు అధికారులు శుక్రవారం వెల్లడించారు. హస్నా ఐత్బులసేన్ అనే మహిళ ఫోన్ నెంబర్‌ను పోలీసులు ఓ డ్రగ్స్ కేసులో విచారణ సందర్భంగా ట్యాప్ చేశారు. అయితే ఆవిడకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే అనుమానంతో పారిస్ దాడుల నేపథ్యంలో ఈమె సంభాషణలపై పోలీసులు నిఘా ఉంచారు. ఈ ట్యాపింగ్ మూలంగానే నిఘావర్గాలకు సెయింట్ డెనిస్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం తెలిసింది. భద్రతా దళాలు ఏడు గంటల పాటు ఆపరేషన్ నిర్వహించి ఉగ్రవాది అబ్దుల్ హమీద్‌ను హతమార్చారు. కాగా, మహిళా ఉగ్రవాది హస్నా ఐత్బులసేన్ ఆత్మాహుతికి పాల్పడింది. -
సూత్రధారి హతం
పారిస్ షూటౌట్లో చనిపోయిన ఉగ్రవాది అబౌదే: ఫ్రాన్స్ ఆత్మాహుతి చేసుకున్న మహిళా ఉగ్రవాది అతడి బంధువు ► ఉగ్రదాడుల వల్ల యూరప్ దేశాల్లో భద్రతా చర్యలు ముమ్మరం ► బెల్జియంలో పోలీసు దాడులు ► ఇటలీలో అనుమానితుల కోసం గాలింపు పారిస్: పారిస్‌లో గత శుక్రవారం నరమేధం సృష్టించిన ఉగ్రవాద దాడి సూత్రధారి అబ్దెల్హమీద్ అబౌద్ (27) బుధవారం పోలీసుల షూటౌట్లో చనిపోయాడని అధికారులు ప్రకటించారు. అబౌద్ పారిస్ నగర శివార్లలోని సెయింట్ డెనిస్‌లోని ఒక అపార్ట్మెంట్లో దాక్కున్నాడన్న సమాచారంతో పోలీసులు దాడి చేయటం.. ఉగ్రవాదులు ఎదురు కాల్పులు జరపటంతో ఏడు గంటల పాటు ఆపరేషన్ కొనసాగటం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో ఒక మహిళా ఉగ్రవాది బాంబులతో కూడిన జాకెట్‌తో తనను తాను పేల్చివేసుకోగా.. పోలీసు కాల్పుల్లో మరొక ఉగ్రవాది చనిపోయిన విషయమూ విదితమే. అతడు పారిస్ దాడుల సూత్రధారి, బెల్జియంకు చెందిన ఐసిస్ ఉగ్రవాది అబౌదేనని అతడి చర్మం నమూనాల పరీక్ష ద్వారా నిర్ధారించినట్లు పారిస్ ప్రాసిక్యూటర్ ఫ్రాంకోయ్ మొలిన్ గురువారం తెలిపారు. అతడితో పాటు చనిపోయిన మహిళా ఉగ్రవాది.. అతడి (కజిన్) బంధువేనని, ఆమె పేరు హస్నా ఐతబౌలాచ్న్ అని పోలీసు వర్గాలు తెలిపాయి. పోలీసులు అపార్ట్మెంటును చుట్టుముట్టగానే తొలుత కాల్పులు ప్రారంభించింది ఆమేనని.. ఆ వెంటనే తనను తాను పేల్చివేసుకునే ముందు ‘నాకు సాయం చేయండి’ అంటూ కేకలు వేయటం ద్వారా పోలీసులను తన దగ్గరకు రప్పించుకుని, తనతో పాటు పేల్చివేయాలనే ప్రయత్నం చేసిందని వివరించారు. అపార్ట్‌మెంట్‌పై పోలీస్ ఆపరేషన్‌లో భాగంగా మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. యూరప్ అంతటా భద్రతా చర్యలు... ఫ్రాన్స్‌తో పాటు యూరప్ దేశాల్లోనూ పొంచివున్న ఉగ్రప్రమాదంపై ఆందోళన తీవ్రమవుతోంది. పలు దేశాల్లో ఉగ్రవాద వ్యతిరేక చర్యలు ముమ్మరమవుతున్నాయి. యూరప్‌లో ఉగ్రవాద ముప్పు చాలా తీవ్రంగా పెరిగిపోయే అవకాశముందని యూరోపోల్ డెరైక్టర్ రాబ్ ఆందోళన వ్యక్తంచేశారు. పారిస్ దాడిలో పాల్గొన్న ముష్కరుల్లో చాలా మంది బెల్జియం వాసులే కావటంతో దేశంలో అదనపు ఉగ్రవాద వ్యతిరేక చర్యలు చేపడుతున్నట్లు బెల్జియం ప్రధాని మైఖేల్ ప్రకటించారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటం కోసం 40 కోట్ల యూరోలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. రోమ్‌లోని సెయింట్ పీటర్స్ బాసిలికా, మిలాన్ చర్చి, లా స్కాలా ఒపెరా హౌస్‌లతో పాటు, థియేటర్లు తదితరాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే ప్రమాదముందంటూ అమెరికా హెచ్చరికల నేపథ్యంలో ఎఫ్‌బీఐ గుర్తించిన ఐదుగురు అనుమానితుల కోసం దేశంలో గాలిస్తున్నట్లు ఇటలీ మంత్రి పౌలో తెలిపారు. న్యూయార్క్‌పై దాడి చేస్తాం: ఐసిస్ వీడియో ఈసారి న్యూయార్క్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుంటామంటూ ఐఎస్ వీడియోను విడుదల చేసింది. పారిస్ దాడుల భయానక దృశ్యాలతో పాటు.. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ను, బాంబు జాకెట్‌ను ధరిస్తున్న ఉగ్రవాదిని చూపుతూ అక్కడ దాడి చేస్తామన్న హెచ్చరిక జారీ చేసింది. హెరాల్డ్ స్క్వేర్, మన్హటన్ క్రాస్‌రోడ్స్ తదితర ప్రాంతాలనూ చూపింది. సిరియాలో వైమానిక దాడుల్లో తమ వారందరి మరణానికీ ప్రతీకారం తీర్చుకుంటామని.. తమ దాడులు కొనసాగిస్తామని ఐసిస్ తన మేగజీన్‌లో హెచ్చరించింది. రసాయన దాడులు చేసే ప్రమాదం... రాజధాని పారిస్‌లో 129 మందిని బలిగొన్న శుక్రవారం నాటి ఉగ్రదాడి మిగిల్చిన పెను విషాదం ఇంకా ఫ్రాన్స్‌ను వీడలేదు. ఐసిస్ ఉగ్రవాదులు రసాయన ఆయుధాలు లేదా జీవరసాయన ఆయుధాలతో దాడి చేసే ప్రమాదం పొంచివుందని దేశ ప్రధానమంత్రి మాన్యుయెల్ వాల్స్ హెచ్చరించారు. ఆయన గురువారం పార్లమెంటు దిగువసభలో మాట్లాడుతూ.. ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితిని మూడు నెలలు పొడిగించాలని పార్లమెంటు సభ్యులను కోరారు. మరోవైపు సిరియాలో ఐసిస్ స్థావరాలపై ఫ్రాన్స్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. పారిస్ దాడులు జరిగిన శుక్రవారం నుంచి ఇప్పటివరకూ 35 ఐసిస్ స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఫ్రాన్స్ సైన్యం గురువారం తెలిపింది. గురువారం ఆరు స్థావరాలపై 60 బాంబులు వేసినట్లు పేర్కొంది. మొత్తం 30 వేల మంది ఉన్న ఐసిస్‌ను అంతం చేయటానికి ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి లారెంట్ ఫాబియస్ కోరారు. -
పారిస్‌లో దాడికి కుట్రదారు అబిదెల్ హతం
-
అబిదెల్ హతమయ్యాడు
సెయింట్ డెనిస్: పారిస్ దాడుల ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న అబిదెల్ హమీద్ అబౌద్ హతమయ్యాడు. దాడులకు కీలక సూత్రదారి అయిన అతడిని పారిస్ బలగాలు గుర్తించాయని, అనంతరం జరిపిన దాడిలో అబ్దుల్ హమీద్ మృతిచెందాడని ఫ్రాన్స్ ప్రభుత్వానికి చెందిన ఓ ప్రభుత్వ లాయర్ తెలిపారు. అబ్దుల్ హమీద్ కోసం సెయింట్ డెనిస్‌లో పారిస్ బలగాలు భారీ ఆపరేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. అక్కడ ఉన్న ఓ అపార్ట్మెంట్లో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చి.. ఏడుగురిని అరెస్టు చేశారు. దీంతో ఏడుగంటల హోరాహోరీ కాల్పుల అనంతరం ఆపరేషన్ ముగిసినట్టు పోలీసుల ప్రకటించారు. అయితే తాము ప్రధానంగా గురిపెట్టిన కీలక ఉగ్రవాది అబ్దుల్ హమీద్ చనిపోయాడా? లేక బతికి ఉన్నాడా? అన్న విషయాన్ని వారు తొలుత ధ్రువీకరించడం లేదు. గురువారం ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వేలిముద్రల ఆధారంగా అబిదెల్ను గుర్తించినట్లు అధికారులు చెప్పారు. -
ఎట్టకేలకు సూత్రధారి ఖతం!
-
ఎట్టకేలకు సూత్రధారి ఖతం!
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో నరమేధానికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఉగ్రవాది అబ్దుల్ హమీద్ అబౌద్ (27) పోలీసుల ఆపరేషన్‌లో చనిపోయినట్టు మీడియా కథనాలు తెలిపాయి. అబ్దుల్ హమీద్‌ను పట్టుకునేందుకే సెయింట్ డెనిస్‌లో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. దాదాపు 7 గంటల షూటౌట్ అనంతరం అతడు చనిపోయాడా? లేదా? అన్నది పోలీసులు ధ్రువీకరించలేదు. తాను దాగున్న అపార్ట్మెంట్ చుట్టూ పోలీసులు మాటువేసి.. కాల్పులు ప్రారంభించిన నేపథ్యంలో అతడు తన ఫ్లాట్‌లోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని ప్రాథమికంగా కథనాలు వచ్చాయి. అతడు తనను తాను కాల్చుకొని చనిపోయినట్టు భారత్‌లోని ఫ్రాన్స్ రాయబారి ఫ్రాంకొయిస్ రీచీర్ అనధికారికంగా పేర్కొన్నారు. అయితే, పోలీసుల షూటౌట్లో అబ్దుల్ హమీద్ చనిపోయాడని, ఈ విషయాన్ని ధ్రువీకరించేందుకు పోలీసులు డీఎన్ఏ పరీక్షలు చేయనున్నారని అమెరికా మీడియా కథనాలు ప్రచురించింది. సెయింట్ డెనిస్‌లో బుధవారం భారీ ఎత్తున జరిగిన ఈ షూటౌట్లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోగా.. ఏడుగురిని అరెస్టు చేశారు. చనిపోయిన వారిలో ఓ మహిళ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకుంది. ఆత్మాహుతి బాంబర్ అయిన ఆమె అబ్దుల్ హమీద్ భార్య అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
పారిస్‌లో మళ్లీ దాడులకు ప్లాన్ వేశారు!
-
ఉన్నాడా? చచ్చాడా?
సెయింట్ డెనిస్: పారిస్ దాడుల ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న అబ్దుల్ హమీద్ అబౌద్ ఏమయ్యాడన్నది ఇప్పుడు సందిగ్ధంగా మారింది. అబ్దుల్ హమీద్‌ను హతమార్చేందుకే ఫ్రాన్స్ పోలీసులు సెయింట్ డెనిస్‌లో భారీ ఆపరేషన్ నిర్వహించారు. అక్కడ ఉన్న ఓ అపార్ట్మెంట్లో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చి.. ఏడుగురిని అరెస్టు చేశారు. దీంతో ఏడుగంటల హోరాహోరీ కాల్పుల అనంతరం ఆపరేషన్ ముగిసినట్టు పోలీసుల ప్రకటించారు. అయితే తాము ప్రధానంగా గురిపెట్టిన కీలక ఉగ్రవాది అబ్దుల్ హమీద్ చనిపోయాడా? లేక బతికి ఉన్నాడా? అన్న విషయాన్ని వారు ధ్రువీకరించడం లేదు. మరోవైపు ఎన్కౌంటర్లో అతడు చనిపోయినట్టు రెండు దఫాలుగా మీడియాలో కథనాలు వచ్చాయి. అయినప్పటికీ ఈ కథనాలపైనా స్పష్టత ఇవ్వడానికి పోలీసులు ముందుకురాకపోవడంతో అసలు దాడుల ప్రధాన సూత్రధారి అబ్దుల్ హమీద్ బతికి ఉన్నాడా? చనిపోయాడా? అన్నది సందిగ్ధంగా మారింది. ఈ నేపథ్యంలో షూటౌట్ జరిగిన అపార్ట్మెంట్లో ఇప్పటికీ ఓ వ్యక్తి నక్కి ఉన్నాడని, అయితే అతను ఉగ్రవాదో, కాదో తెలియడం లేదని వార్తలు వస్తున్నాయి. ఉగ్రవాదులపై యుద్ధం కొనసాగిస్తాం: హోలాండ్ పారిస్‌లో నరమేధం నేపథ్యంలో ఉగ్రవాదులపై తాము తలపెట్టిన యుద్ధాన్ని ఆపబోమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకొయిస్ హొలాండ్ స్పష్టం చేశారు. సెయింట్ డెనిస్‌లో బుధవారం జరిగిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయినట్టు ఆయన తెలిపారు. అమెరికా, రష్యాలతో కలిసి ఉగ్రవాదులపై పోరాడుతామని చెప్పారు. ఉగ్రవాదంపై పోరుకు ప్రపంచమంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. -
పారిస్‌లో మళ్లీ దాడులకు ప్లాన్ వేశారు!
ముగిసిన ఆపరేషన్! ఇద్దరు ఉగ్రవాదులు మృతి, ఏడుగురి అరెస్టు పారిస్: ఫ్రాన్ రాజధాని పారిస్‌లో నరమేధానికి కారణమైన ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఫ్రాన్స్ పోలీసులు చేపట్టిన భారీ ఆపరేషన్ ముగిసింది. ఉత్తర పారిస్ శివార్లలో సెయింట్ డెనిస్ పట్టణంలోని ఓ అపార్ట్మెంట్లో నక్కిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు పోలీసులు ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందగా.. భారీ ఎదురుకాల్పుల అనంతరం ఏడుగురు ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ ఆయుధాలతో పోలీసులు అపార్ట్‌మెంట్‌ను చుట్టుముట్టడంతో.. అందులో ఉగ్రవాదుల వెంట ఉన్న ఓ మహిళా సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకొని.. ఆత్మాహుతి చేసుకుంది. మరో ఉగ్రవాది పోలీసుల కాల్పుల్లో చనిపోయాడు. బుధవారం తెల్లవారుజాము నుంచి ఏడు గంటలపాటు కొనసాగిన ఈ భారీ ఆపరేషన్‌లో నలుగురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. సూత్రధారి హతం? పారిస్ దాడుల ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న అబ్దుల్ హమీద్ అబౌద్ ఈ ఎన్కౌంటర్లో హతమైనట్టు వార్తలు వస్తున్నాయి. సెయింట్ డెనిస్‌లోని ఓ అపార్ట్మెంట్లో దాక్కున్న అతన్ని మట్టుపెట్టేందుకే పోలీసులు ఈ భారీ ఆపరేషన్‌ను ప్రారంభించారు. అయితే, ఎన్కౌంటర్లో అతడు చనిపోయినట్టు కథనాలు వచ్చినా.. వాటిని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. దీంతో అతను ఇంకా బతికున్నాడా? లేక ఈ ఎన్కౌంటర్లో చనిపోయాడా? అన్నది అధికారికంగా నిర్ధారణ కాలేదు. మళ్లీ దాడులు! సెయింట్ డెనిస్‌లో తలదాచుకున్న ఉగ్రవాదులు పారిస్‌లో మరోసారి భారీ దాడులకు వ్యూహరచన చేశారని భద్రతా వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా పారిస్ వ్యాపార జిల్లా లక్ష్యంగా మరోసారి దాడులు చేయాలని వారు సిద్ధమయ్యారని, ఇంతలోనే పోలీసులు వారి అపార్ట్‌మెంట్‌ను చుట్టుముట్టి ఆపరేషన్ ప్రారంభించారని ఆ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులు-పోలీసులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో సెయింట్ డెనిస్‌లో పాఠశాలలు, మెట్రో రైళ్లతోపాటు ప్రజారవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేశారు. -
పారిస్ ఉగ్రదాడి సూత్రధారి హతం?
పారిస్: పారిస్ ఉగ్రదాడి సూత్రధారిగా భావిస్తున్న అబ్దెల్ హమీద్ అబోద్ను హతమార్చనిట్లు కథనాలు వస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున ఉత్తర పారిస్‌లో అబ్దెల్ హమీద్ అబోద్ లక్ష్యంగా ఆపరేషన్ చేపట్టిన పోలీసులు.. ఓ అపార్టుమెంటులో అతడితో పాటు మరికొందరు ఉగ్రవాదులు దాక్కున్నట్లు పక్కా సమాచారం అందడంతో అక్కడ మాటు వేశారు. పోలీసులు ముందుగా అపార్టుమెంటును చుట్టుముట్టి ముప్పేట దాడి చేశారు. ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. దాంతో తేరుకున్న ఉగ్రవాదులు లోపలి నుంచి ఎదురు కాల్పులు సాగించారు. ఈ కాల్పుల్లో పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. అయితే ఎట్టకేలకు శుక్రవారం నాటి పారిస్ ఉగ్రదాడి సూత్రధారి అబ్దెల్ హమీద్ అబోద్ సహా.. లోపలున్న ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు హతమార్చినట్లు సమాచారం. వీరిలో ఓ మహిళా ఉగ్రవాది కూడా ఉంది. పోలీసులు మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు.