ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ నుంచి తమ దేశానికి మాత్రమే కాకుండా ప్రపంచానికంతటికీ ముప్పు పొంచివుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.
న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ నుంచి తమ దేశానికి మాత్రమే కాకుండా ప్రపంచానికంతటికీ ముప్పు పొంచివుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. పారిస్ లో దాడుల తర్వాత దేశంలో అప్రమత్తత ప్రకటించిచామని చెప్పారు.
ఐఎస్ఐఎస్ తో ప్రత్యేకంగా ఒక దేశానికే కాకుండా ప్రపంచ దేశాలన్నిటికీ ముప్పు ఉందని వెల్లడించారు. పారిస్ లో ఐఎస్ఐఎస్ సాగించిన మారణహోమంలో 129 మంది మృత్యువాత పడ్డారు. 300 మంది పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ లో ఎమర్జెన్సీ ప్రకటించారు. సరిహద్దులు మూసేయాలని అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండె ఆదేశించారు.