'భారత్లో ఎప్పటికీ ఐఎస్ ఏమాత్రం బలపడదు'
న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులకు భారత్లో ఎప్పటికీ చోటుండదని, ఐఎస్ ఏమాత్రం బలపడలేదని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. మన సంస్కృతి, సంప్రదాయ విలువలు ఇందుకు కారణమని రాజ్నాథ్ అన్నారు.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రపంచ దేశాలకు సవాల్గా మారిన సంగతి తెలిసిందే. ఇరాన్, సిరియాల్లో మారణకాండ సృష్టిస్తున్న ఐఎస్ ఉగ్రవాదులు ఇతర దేశాలకు విస్తరించేందుకు యవతను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మన దేశం నుంచి చాలా కొద్దిమంది మాత్రమే ఐఎస్లో చేరినట్టు సమాచారం. ఐఎస్ ఉగ్రవాదులుగా అనుమానితులుగా భావిస్తున్న కొందరిని, ఐఎస్లో చేరేందుకు వెళ్తున్నవారిని ఇటీవల భద్రత బలగాలు అరెస్ట్ చేశాయి.