'దేశంలో ఐఎస్ను అడ్డుకోవడంలో వారిదే కీలకపాత్ర'
న్యూఢిల్లీ: దేశంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రాబల్యాన్ని అడ్డుకోవడంలో ముస్లిం కుటుంబాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ముస్లిం కుటుంబాల విలువలకు తాను గర్విస్తున్నానని చెప్పారు. పిల్లలు ఐఎస్ ఉగ్రవాదభావజాలానికి ఆకర్షితులు కాకుండా చూస్తున్నారని రాజ్ నాథ్ పేర్కొన్నారు. దేశంలో ఎవరూ ఆకలితో బాధపడకుండా, అవిద్యావంతులుగా ఉండకుండా ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని చెప్పారు.
భారత్లో ఎప్పటికి ఐఎస్కు చోటుండదని, ఏమాత్రం బలపడదని ఇటీవల రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. భారతీయ సంస్కృతి, విలువలు ఇందుకు కారణమని రాజ్నాథ్ చెప్పారు.