న్యూఢిల్లీ: రూ.2.23 లక్షల కోట్ల విలువైన రక్షణ సంబంధిత కొనుగోలు ప్రాజెక్టులకు భారత రక్షణ శాఖ రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ) గురువారం ప్రాథమికంగా ఆమోదం తెలియజేసింది. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా 97 తేజస్ తేలికపాటి యుద్ధ విమానాలు, 156 ప్రచండ్ హెలిక్టాపర్లను త్రివిధ దళాల కోసం రక్షణ శాఖ కొనుగోలు చేయనుంది.
దీనివల్ల భారత సైనిక దళాలు మరింత శక్తివంతంగా మారుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. భారత్–పాకిస్తాన్, భారత్–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా పెద్ద సంఖ్యలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు సమకూర్చుకోవాలని రక్షణ శాఖ ఇప్పటికే నిర్ణయించింది. రూ.2.23 లక్షల కోట్లతో కొనుగోలు చేస్తే యుద్ధ విమానాలు, హెలికాప్టర్లలో 98 శాతం స్వదేశంలోనే తయారవుతాయని రక్షణ శాఖ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment