Defense acquisitions council
-
రూ.84,560 కోట్లతో సైనిక సామగ్రి
న్యూఢిల్లీ: దేశ సైనిక బలగాల యుద్ధ పటిమను గణనీయంగా పెంచే రూ.84,560 కోట్ల విలువైన పలు ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు రక్షణ శాఖ పచ్చజెండా ఊపింది. కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదనలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ)ఆమోదం తెలిపింది. కొత్త తరం యాంటీ ట్యాంక్ మందుపాతరలు, ఎయిర్ డిఫెన్స్ టాక్టికల్ కంట్రోల్ రాడార్లు, హెవీ వెయిట్ టోర్పెడోలు, మధ్యశ్రేణి, మల్టీ మిషన్ యుద్ధ విమానాలు, ఫ్లయిట్ రీఫ్యూయలర్ విమానాలు, అధునాతన రేడియో వ్యవస్థలు ఇందులో ఉన్నట్లు రక్షణ శాఖ తెలిపింది. వీటి చేరికతో నేవీ, కోస్ట్‌గార్డ్, ఎయిర్‌ఫోర్స్ పాటవం గణనీయంగా పెరుగుతాయని పేర్కొంది. -
రూ. 2.23 లక్షల కోట్లతో ‘రక్షణ’ కొనుగోలు ప్రాజెక్టులు
న్యూఢిల్లీ: రూ.2.23 లక్షల కోట్ల విలువైన రక్షణ సంబంధిత కొనుగోలు ప్రాజెక్టులకు భారత రక్షణ శాఖ రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ) గురువారం ప్రాథమికంగా ఆమోదం తెలియజేసింది. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా 97 తేజస్ తేలికపాటి యుద్ధ విమానాలు, 156 ప్రచండ్ హెలిక్టాపర్లను త్రివిధ దళాల కోసం రక్షణ శాఖ కొనుగోలు చేయనుంది. దీనివల్ల భారత సైనిక దళాలు మరింత శక్తివంతంగా మారుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. భారత్–పాకిస్తాన్, భారత్–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా పెద్ద సంఖ్యలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు సమకూర్చుకోవాలని రక్షణ శాఖ ఇప్పటికే నిర్ణయించింది. రూ.2.23 లక్షల కోట్లతో కొనుగోలు చేస్తే యుద్ధ విమానాలు, హెలికాప్టర్లలో 98 శాతం స్వదేశంలోనే తయారవుతాయని రక్షణ శాఖ పేర్కొంది. -
6 ‘హెర్క్యూలెస్’ విమానాలు కొననున్న భారత్
న్యూఢిల్లీ: అమెరికా నుంచి రూ. నాలుగు వేల కోట్ల వ్యయంతో మరో ఆరు సీ-130జే సూపర్ హెర్క్యూలెస్ రకం రవాణా విమానాల కొనుగోలుకు రక్షణశాఖ శుక్రవారం ఆమోదం తెలిపింది. రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర తెలిపింది. రూ.ఆరు వేల కోట్లతో 235 టీ-90 యుద్ధ ట్యాంకుల కొనుగోలు ప్రతిపాదనకూ డీఏసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.