![Defence Acquisition Council approves projects worth Rs 84,560 cr - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/17/RAJNAD.jpg.webp?itok=EXiL7aJ4)
న్యూఢిల్లీ: దేశ సైనిక బలగాల యుద్ధ పటిమను గణనీయంగా పెంచే రూ.84,560 కోట్ల విలువైన పలు ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు రక్షణ శాఖ పచ్చజెండా ఊపింది. కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదనలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ)ఆమోదం తెలిపింది.
కొత్త తరం యాంటీ ట్యాంక్ మందుపాతరలు, ఎయిర్ డిఫెన్స్ టాక్టికల్ కంట్రోల్ రాడార్లు, హెవీ వెయిట్ టోర్పెడోలు, మధ్యశ్రేణి, మల్టీ మిషన్ యుద్ధ విమానాలు, ఫ్లయిట్ రీఫ్యూయలర్ విమానాలు, అధునాతన రేడియో వ్యవస్థలు ఇందులో ఉన్నట్లు రక్షణ శాఖ తెలిపింది. వీటి చేరికతో నేవీ, కోస్ట్‌గార్డ్, ఎయిర్‌ఫోర్స్ పాటవం గణనీయంగా పెరుగుతాయని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment