green flag
-
రూ.84,560 కోట్లతో సైనిక సామగ్రి
న్యూఢిల్లీ: దేశ సైనిక బలగాల యుద్ధ పటిమను గణనీయంగా పెంచే రూ.84,560 కోట్ల విలువైన పలు ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు రక్షణ శాఖ పచ్చజెండా ఊపింది. కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదనలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ)ఆమోదం తెలిపింది. కొత్త తరం యాంటీ ట్యాంక్ మందుపాతరలు, ఎయిర్ డిఫెన్స్ టాక్టికల్ కంట్రోల్ రాడార్లు, హెవీ వెయిట్ టోర్పెడోలు, మధ్యశ్రేణి, మల్టీ మిషన్ యుద్ధ విమానాలు, ఫ్లయిట్ రీఫ్యూయలర్ విమానాలు, అధునాతన రేడియో వ్యవస్థలు ఇందులో ఉన్నట్లు రక్షణ శాఖ తెలిపింది. వీటి చేరికతో నేవీ, కోస్ట్‌గార్డ్, ఎయిర్‌ఫోర్స్ పాటవం గణనీయంగా పెరుగుతాయని పేర్కొంది. -
‘నమో భారత్’కు ప్రధాని మోదీ పచ్చజెండా
సాహిబాబాద్: దేశంలో మొట్టమొదటి నమో భారత్ రైలు(ర్యాపిడ్ రైలు సర్వీసు)కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం పచ్చజెండా ఊపారు. ఢిల్లీ–ఘజియాబాద్–మీరట్ మార్గంలో నిర్మిస్తున్న రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(ఆర్ఆర్టీఎస్)లో 17 కిలోమీటర్ల మేర పూర్తయ్యింది. ఈ 17 కిలోమీటర్ల కారిడార్‌తోపాటు ఇదే మార్గంలో ‘నమో భారత్’ రైలును మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్ నుంచి దుహాయి డిపో వరకు ఆయన నమో భారత్ రైలులో ప్రయాణించారు. రైలులో పాఠశాల విద్యార్థులు, రైల్వే సిబ్బందితో మాట్లాడారు. ఢిల్లీ–ఘజియాబాద్–మీరట్ ఆర్ఆర్టీఎస్ మొత్తం పొడవు 82.15 కిలోమీటర్లు. మిగిలిన మార్గం మరో ఏడాదిన్నరలో పూర్తవుతుందని, దాన్ని తానే ప్రారంభిస్తానని మోదీ ఈ సందర్భంగా వెల్లడించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌తోపాటు హరియాణా, రాజస్తాన్‌లో నగరాలు, పట్టణాలను అనుసంధానించేలా మరికొన్ని నమో భారత్ ప్రారంభించబోతున్నామని తెలిపారు. ఈస్ట్–వెస్ట్ కారిడార్, బెంగళూరు మెట్రో రైలును కూడా ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. -
ఆ ఆకుపచ్చ జెండాలపై బదులివ్వండి
న్యూఢిల్లీ: నెలవంక, నక్షత్రంతో కూడిన ఆకుపచ్చ రంగు జెండాలను దేశంలో ఎగరేయరాదంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. దేశవ్యాప్తంగా భవనాలు, మతపరమైన ప్రాంతాల్లో ఈ జెండాలను నిషేధించడంపై అభిప్రాయం చెప్పాలం టూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఆకుపచ్చ రంగు జెండాలపై షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ వసీమ్ రిజ్వీ వేసిన పిటిషన్‌పై జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్రం తరఫున సమాధానం చెప్పేందుకు వీలుగా అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు ఈ పిటిషన్ కాపీని అందించాలని రిజ్వీకి ధర్మాసనం సూచించింది. నెలవంక, నక్షత్రంతో కూడిన ఆకుపచ్చ జెండాలు ‘‘ఇస్లాం విరుద్ధం’’ అని, అవి పాకిస్తాన్‌లోని ఓ రాజకీయ పార్టీ జెండాను తలపించేలా ఉన్నాయని రిజ్వీ తన పిటిషన్లో పేర్కొన్నారు. -
ఆ ఆకుపచ్చ జెండాలను నిషేధించాలి
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్ జెండాలను పోలిన ఆకుపచ్చ జెండాలను భారతదేశంలో నిషేధించాలని షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ వసీం రజ్వీ సుప్రీంకోర్టు పిల్ దాఖలు చేశారు. దేశంలో చాలా చోట్ల నెలవంక, నక్షత్రంతో కూడిన ఆకుపచ్చ రంగ జెండాలను ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో ఎగరవేస్తున్నారని, వాటిని నిషేధించాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం తెలుసుకున్న తరువాత తుది నిర్ణయం ప్రకటిస్తామని సోమవారం పేర్కొంది. ఈ మేరకు కేంద్రం అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సిందిగా అదనపు సోలిటరీ జనరల్ తుషార్ మెహతాను జస్టిస్ ఎకే సిక్రి, అశోక్ భూషన్‌లతో కూడిన ధర్మాసనం కోరింది. ముస్లింలు అధికంగా ఉండే ముంబై లాంటి ప్రాంతాల్లో భవనాలపైన, మత స్మారక చిహ్నాలపైన పాకిస్తాన్‌కు చెందిన ముస్లిం లీగ్ పార్టీ జెండాను పొలిన జెండాలను ఎగరవేస్తున్నారని వసీం రజ్వీ తన పిటిషన్లో తెలిపారు. పాకిస్తాన్ భారత్‌కు శత్రు దేశమని, అలాంటి జెండాలు దేశంలో ఉండటానికి వీల్లేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఆ జెండాలు హిందూ-ముస్లింల మధ్య విభేదాలు సృష్టించే అవకాశం ఉందన్నారు. నెలవంక, నక్షత్రంతో కూడిన ఆకుపచ్చ జెండా 1906లో మహ్మద్ అలీ జిన్నా స్థాపించిన ముస్లిం లీగ్ పార్టీకి చెందినది. మన దేశంలో దాన్ని ఇస్లామిక్ జెండాగా భావిస్తారు. -
ఉద్యోగుల బదిలీలపై ‘పచ్చ’జెండా రెపరెపలు
ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఈ మధ్యకాలంలో వచ్చిన అత్యంత వివాదాస్పద మైన జీవో.. జీవో నంబర్ 57. ఈ ఏడాది మే 18న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవో 57 కోర్టువరకు వెళ్లి ఆగస్టు 8న జీవో 98గా పునరుత్థానం చెందిన వరకూ ఎన్నో మజిలీలూ, ప్రస్థానాలూ! వీటి గమనాన్ని పరిశీలిస్తే ముఖ్యమంత్రి ఊగిసలాటలు, ఆలో చనల్లోని అస్థిరతా ప్రస్ఫుటంగా కనిపించా యి! కేవలం రెండున్నర నెలల కాలంలో విడుదలైన 7 జీవోలు 57, 58, 59, 61, 63, 75ల అనంతరం ఈ 8వ తాజా జీవో 98నీ గమనిస్తే బదిలీలపై ప్రభుత్వం ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెన క్కులా డోలాయమాన స్థితిలోకి వెళ్లి ఊగిసలాడినట్టు స్పష్టమవుతోంది. ఉద్యోగులు తాము చెప్పిన మాట వినడంలేదనీ, అధికారంలోకి తెచ్చి నోళ్లకే మంచి పోస్టింగులనీ, కార్యకర్తలు చెప్పిందే ఉద్యోగులు చేయాల నీ, కార్యకర్తల కోసం పని చేసేవారిని ఏరికోరి తెచ్చుకుంటామని, చెప్పింది చేయకపోతే చర్యలు తప్పవనీ మినీమహానాడు సందర్భా లుగా గ్రామగ్రామాన సాక్షాత్తూ అమాత్యవర్యులే బహిరంగ ప్రకటనలు గుప్పించిన నేపథ్యంలో వచ్చిన ఈ బదిలీలకు ఉద్యోగులు భయబ్రాంతులయ్యారు! జీవో 57పై ఉద్యోగ వర్గాల ప్రధాన ప్రతిఘటనల్లా బదిలీలపై జిల్లా ఇన్చార్జి మంత్రికి అధికారాన్ని కట్టబెట్టడంపైనే! ఈ మధ్య గుంటూరులో జరిగిన ఓ సభలో సీఎం మాట్లాడుతూ మరో మూడు నెలల్లో పాత చంద్రబాబును చూస్తారని హెచ్చరించిన నేపథ్యంలో టీచర్ల బదిలీ ప్రక్రియ మొదలైంది. ఏ పార్టీకి చెందిన ప్రభుత్వమైనా సరే.. ఉద్యోగుల బదిలీలనగానే రాజకీయ ఒత్తిళ్లూ, పైరవీలు, డబ్బు సంచుల కదలికల్లో డిపార్ట్మెంట్లోని అదనపు సంపాదనలోని హెచ్చు తగ్గుల తేడాయే తప్ప -ఇటు ట్రాన్స్ఫర్ ఆర్డర్ జారీ చేసే ఉన్నతాధికా రుల నుండి అటు అధికార అనధికార రాజకీయ నేతల వరకూ ఇదో సంరంభం! చంద్రబాబు ప్రభుత్వం ఒక ముందడుగు వేసి, ఈ రహస్య ప్రక్రియకు జీవో 57తో చట్టబద్ధతను కల్పించింది. ప్రభుత్వం సూత్రీకరించిన పరిధిలోనే తన విధులను నిర్వర్తించా లని ఏ ఉద్యోగి అయినా భావిస్తాడు. కానీ మధ్యలో ఈ ‘పార్టీ కార్య కర్తలు చెప్పినట్లు చేయడమే’మిటో అర్థం కాదు. ప్రభుత్వం నిర్దేశించిన నియమాలకు భిన్నంగా వీళ్ల కోరికలు, ఆశలు గనుక ఉంటే ఆయా పనులకు సంబంధించిన సూత్రీకరణలను ప్రభుత్వ మార్గదర్శకాల లోనే చేర్పిస్తే అటు ప్రభుత్వాన్ని నడిపే కార్యకర్తలకూ, ఇటు ప్రభుత్వ ఉత్తర్వులు పాటించాల్సిన ఉద్యోగులకు ఉభయతారకంగా ఉంటుంది కదా! పార్టీ చెప్పినట్లే పని చేయడానికీ చేయించుకోవడానికీ ఇరుపక్షా లకు మధ్య ఎటువంటి ఘర్షణలకు తావుండదు కదా! సహజంగా సంవత్సరంలో ఒక్కసారే అంటే మే, జూన్ నెలల మధ్య కాలంలో బదిలీల ప్రక్రియను ముగించుకోవడం ప్రభుత్వానికి పరిపాటి. కానీ ఆర్నెల్లలోనే మళ్లీ బదిలీలకు తెరలేపడం బహుశా రాష్ట్ర చరిత్రలోనే ఇది మొదటిసారౌతుందేమో. నవంబర్ 2014లో జీవో 211 ద్వారా జరిగిన బదిలీలకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలూ, మం త్రుల సిఫారసుల లేఖలను శాఖాధికారులు తయారు చేసుకున్న ఫైళ్లకు అధికారికంగానే గుదిగుచ్చారు. ఏ ఉద్యోగి ఎంత మంది ఎమ్మెల్యేలు/ మంత్రుల నుండి ఎన్ని సిఫారసు లేఖల్ని తీసుకొస్తే ఆ బదిలీకి అంత వెయిటేజీగా పరిగణించడం జరిగింది. రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసి పదవినలంకరించిన పాలకు లు దమననీతితో ఏకపక్షంగా వ్యవహరించకూడదు. పరిధుల్ని దాటిన ఉద్యోగికి వెనువెంటనే ప్రమాదం పొంచి ఉంటే, పాలకులకు ఆ ప్రమా దం ఐదేళ్లకు ఉండితీరుతుంది, ఊడితీరుతుంది కూడా. ఈ బదిలీల జడికి హడలిపోయిన సగటు ఉద్యోగి తమ ఓట్లే కాకుండా తమ కుటుంబాల ఓట్లూ వేయకపోతే తె.దే.పా అసలు రాష్ట్రంలో గవర్నమెంట్‌ని ఫార్మ్ చేయగలిగుండేదా అని ప్రశ్నించుకుం టున్నాడు, పునరాలోచించుకుంటున్నాడు. ఉద్యోగికిప్పుడు స్థిరచిత్త తనూ, అవ్యాకులంగా పనిచేసే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించ డమూ, భవిష్యత్తులో జరగబోయే బదిలీల్లో అయినా పారదర్శకతను మిస్సవకుండా చూడ్డమూ ప్రభుత్వం ముందున్న కర్తవ్యం. - వ్యాసకర్త మాజీ సర్పంచ్, బెంకిలి, శ్రీకాకుళం మొబైల్ : 9000646780 - బి.మోహనరావు