పాఠశాల విద్యార్థులతో ముచ్చటిస్తున్న ప్రధాని మోదీ
సాహిబాబాద్: దేశంలో మొట్టమొదటి నమో భారత్ రైలు(ర్యాపిడ్ రైలు సర్వీసు)కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం పచ్చజెండా ఊపారు. ఢిల్లీ–ఘజియాబాద్–మీరట్ మార్గంలో నిర్మిస్తున్న రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(ఆర్‌ఆర్‌టీఎస్)లో 17 కిలోమీటర్ల మేర పూర్తయ్యింది. ఈ 17 కిలోమీటర్ల కారిడార్‌తోపాటు ఇదే మార్గంలో ‘నమో భారత్’ రైలును మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్ నుంచి దుహాయి డిపో వరకు ఆయన నమో భారత్ రైలులో ప్రయాణించారు.
రైలులో పాఠశాల విద్యార్థులు, రైల్వే సిబ్బందితో మాట్లాడారు. ఢిల్లీ–ఘజియాబాద్–మీరట్ ఆర్‌ఆర్‌టీఎస్ మొత్తం పొడవు 82.15 కిలోమీటర్లు. మిగిలిన మార్గం మరో ఏడాదిన్నరలో పూర్తవుతుందని, దాన్ని తానే ప్రారంభిస్తానని మోదీ ఈ సందర్భంగా వెల్లడించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌తోపాటు హరియాణా, రాజస్తాన్‌లో నగరాలు, పట్టణాలను అనుసంధానించేలా మరికొన్ని నమో భారత్ ప్రారంభించబోతున్నామని తెలిపారు. ఈస్ట్–వెస్ట్ కారిడార్, బెంగళూరు మెట్రో రైలును కూడా ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment