NaMo
-
డ్రోన్ కొనుగోలుకు రూ.8 లక్షలు సాయం
మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పించేలా కేంద్రం ప్రవేశపెట్టిన ‘నమో డ్రోన్ దీదీ’ పథకానికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకంలో నమోదు చేసుకున్న ఒక్కో సంఘానికి రూ.8 లక్షలు మేర సాయం చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2024-26 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకంలో భాగంగా సుమారు 14,500 మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.వ్యవసాయం ఎంతో శ్రమతో కూడుకున్నది. టెక్నాలజీ సహాయంతో వ్యవసాయాన్ని సులువుగా చేసేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో స్థానిక మహిళా స్వయం సహాయక సంఘాలను భాగం చేస్తోంది. వారికి డ్రోన్లు అందించి సరైన శిక్షణ ఇవ్వడంతో ఉపాధి కల్పిస్తోంది. అదే సమయంలో రైతులపై పనిభారం తగ్గినట్లవుతుందని కేంద్రం భావిస్తోంది. అందుకోసం ‘నమో డ్రోన్ దీదీ’ పథకాన్ని గతంలోనే ప్రారంభించింది.ఇదీ చదవండి: 171.6 టన్నుల బంగారు ఆభరణాలు!ఈ పథకానికి సంబంధించి కేంద్రం ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులోని అంశాలను అమలు చేసేందుకు రూ.1,261 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. డ్రోన్ కొనుగోలులో 80 శాతం వరకు కేంద్రమే భరించనున్నట్లు చెప్పింది. లేదంటే రూ.8 లక్షలు విడుదల చేస్తామని స్పష్టం చేసింది. అంతకంటే ఎక్కువ ధరతో డ్రోన్ కొనుగోలు చేయాలనుకునే స్వయం సహాయక సంఘాలకు అదనంగా అవసరమయ్యే డబ్బును నేషనల్ అగ్రికల్చర్ ఇన్ఫ్రా ఫైనాన్సింగ్ ఫెసిలిటీ కింద 3 శాతం వడ్డీరాయితీతో అందించనున్నట్లు పేర్కొంది. -
'నమో' కోసం యంగ్ టీమ్ చేసిన ప్రయత్నం సక్సెస్ అవ్వాలి: భీమనేని శ్రీనివాసరావు
సర్వైవల్ జోనర్లో టాలీవుడ్లో రాబోతున్న సినిమా 'నమో'. విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి ఇందులో హీరోలు. విస్మయ హీరోయిన్గా నటిస్తుంది. శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఏ.ప్రశాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే, తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు భీమనేని శ్రీనివాసరావు, బెక్కం వేణుగోపాల్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ మూవీ జూన్ 7న విడుదలకు సిద్దంగా ఉంది.భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘ఆదిత్య నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఈ చిత్రంతో ఆదిత్య దర్శకుడిగా పరిచయం అవుతుండటం ఆనందంగా ఉంది. అతను ఎంతో కష్టపడతాడు. మంచి టాలెంట్ ఉంది. ఆదిత్య ఈ సినిమాతో తనని తాను నిరూపించుకుంటాడనిపిస్తోంది. సినిమాలోని పాత్రలు కష్టాలు పడుతుంటే.. చూసే ప్రేక్షకులకు ఫన్ వస్తుంటుంది. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ సినిమాలను థియేటర్ వరకు తీసుకు రావడమే గొప్ప విషయం. యంగ్ టీం కలిసి చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలి’ అని అన్నారు.బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘నన్ను పెద్ద సినిమా ఫంక్షన్లకు పిలిచినా వెళ్తాను. చిన్న సినిమా ఈవెంట్లకు ఆహ్వానించినా వస్తాను. కానీ చిన్న చిత్రాల ప్రమోషన్స్‌కి వస్తే.. వారికి ఎంతో సాయం చేసినట్టుగా అవుతుంది. హీరోయిన్ విస్మయ తెలుగమ్మాయి. ఇప్పటికే నాలుగు సినిమాలు చేసింది. మంచి స్టార్ హీరోయిన్ అయ్యే సత్తా ఉన్న నటి. కొత్త దర్శక, నిర్మాతలు ఇప్పుడు ఎక్కువగా ఇండస్ట్రీలో సినిమాలు తీస్తున్నారు. కథను నమ్మి సినిమాలు తీసే దర్శక నిర్మాతలకు ఎప్పుడూ విజయం చేకూరాలి. ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్న ఆదిత్యకు ఆల్ ది బెస్ట్. విశ్వంత్ మంచి నటుడు. మంచి టాలెంట్ ఉన్న నటుడు. ఆయనకు ఇంకా సరైన బ్రేక్ రాలేదు. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు. -
‘నమో డ్రోన్ దీదీ’ అంటే ఏమిటి? ఎవరికి ప్రయోజనం?
వ్యవసాయం ఎంతో శ్రమతో కూడుకున్నది. అయితే ఇప్పుడు టెక్నాలజీ సహాయంతో ఇది సులభతరంగా మారుతోంది. మరోవైపు వ్యవసాయరంగంలో మహిళల ప్రాధాన్యత పెంచేందుకు ప్రభుత్వం నూతన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపధ్యంలో రూపొందినదే ‘నమో డ్రోన్ దీదీ’ పథకం. వ్యవసాయ పనులకు ‘నమో డ్రోన్ దీదీ’ పథకం మరింత సహయకారిగా మారింది. ఈ పథకాన్ని దేశంలో తొలుత పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. ఫలితాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం దీనిని విస్తరించబోతోంది. ఈ నేపధ్యంలోనే ఈ పథకంలో భాగస్వాములైన 300 మంది మహిళలు మార్చి 11న ప్రధాని నరేంద్ర మోదీ ఎదుట తమ అనుభవాలను పంచుకోనున్నారు. అలాగే వారు డ్రోన్‌ను ఎగురవేసే విధానాన్ని కూడా నాటి కార్యక్రమంలో ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం న్యూఢిల్లీలోని పూసా సెంటర్లో నిర్వహించనున్నారు. ఆరోజు ప్రధాని మోదీ వెయ్యమంది మహిళలకు డ్రోన్లను అందజేయనున్నారు. డ్రోన్‌తో పాటు బ్యాటరీతో పనిచేసే వాహనాన్ని కూడా మహిళలకు ఇవ్వనున్నారు. గుజరాత్‌లోని భరూచ్ జిల్లాకు చెందిన కృష్ణ హరికృష్ణ పటేల్ డ్రోన్ దీదీగా పనిచేస్తున్నారు. డ్రోన్ల సాయంతో 45 నిమిషాల్లో వ్యవసాయ పనులు పూర్తి చేయవచ్చని తెలిపారు. డ్రోన్ ఆపరేట్ చేస్తూ పంటలను పర్యవేక్షించడం, పురుగుమందులు, ఎరువులు పిచికారీ చేయడం, విత్తనాలు వెదజల్లడం లాంటి పనులు సులభంగా చేయవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం 450 మంది డ్రోన్ దీదీలు 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని వ్యవసాయ కార్యకలాపాలలో తమ సేవలను అందిస్తున్నారు. ఈ ఏడాది వెయ్యి మంది మహిళలను డ్రోన్ దీదీలుగా తయారు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డ్రోన్ పైలట్లుగా మారాలనుకుంటున్న గ్రామీణ ప్రాంత మహిళలకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. లైసెన్స్ పొందిన డ్రోన్ దీదీ ఒక సీజన్లో రూ. 2.5 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. -
నవ్వుల నమో
విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి హీరోలుగా, విస్మయ శ్రీ హీరోయిన్గా నటించిన చిత్రం ‘నమో’. ఈ చిత్రం ద్వారా ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఎ. ప్రశాంత్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఆదిత్య నా దగ్గర అసిస్టెంట్‌గా చేశాడు. ఏదో చేయాలనే, నేర్చుకోవాలనే తపన తనలో ఉంది. ‘నమో’ పేరు వినగానే ప్రధాని నరేంద్ర మోదీగారి మీద కథ అనుకున్నాను. హీరోల పాత్రల పేర్లలోని (నగేశ్, మోహన్) తొలి అక్షరాలతో టైటిల్ పెట్టినట్లు చెప్పాడు. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘నమో’ ప్రేక్షకులు హాయిగా నవ్వుకునేలా ఉంటుంది’’ అన్నారు ఆదిత్య రెడ్డి కుందూరు. ‘‘ఇదొక వైవిధ్యమైన చిత్రం’’ అన్నారు విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి, విస్మయ. -
‘నమో భారత్’కు ప్రధాని మోదీ పచ్చజెండా
సాహిబాబాద్: దేశంలో మొట్టమొదటి నమో భారత్ రైలు(ర్యాపిడ్ రైలు సర్వీసు)కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం పచ్చజెండా ఊపారు. ఢిల్లీ–ఘజియాబాద్–మీరట్ మార్గంలో నిర్మిస్తున్న రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(ఆర్ఆర్టీఎస్)లో 17 కిలోమీటర్ల మేర పూర్తయ్యింది. ఈ 17 కిలోమీటర్ల కారిడార్‌తోపాటు ఇదే మార్గంలో ‘నమో భారత్’ రైలును మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్ నుంచి దుహాయి డిపో వరకు ఆయన నమో భారత్ రైలులో ప్రయాణించారు. రైలులో పాఠశాల విద్యార్థులు, రైల్వే సిబ్బందితో మాట్లాడారు. ఢిల్లీ–ఘజియాబాద్–మీరట్ ఆర్ఆర్టీఎస్ మొత్తం పొడవు 82.15 కిలోమీటర్లు. మిగిలిన మార్గం మరో ఏడాదిన్నరలో పూర్తవుతుందని, దాన్ని తానే ప్రారంభిస్తానని మోదీ ఈ సందర్భంగా వెల్లడించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌తోపాటు హరియాణా, రాజస్తాన్‌లో నగరాలు, పట్టణాలను అనుసంధానించేలా మరికొన్ని నమో భారత్ ప్రారంభించబోతున్నామని తెలిపారు. ఈస్ట్–వెస్ట్ కారిడార్, బెంగళూరు మెట్రో రైలును కూడా ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. -
నిలిచిన నమో టీవీ ప్రసారాలు
న్యూఢిల్లీ: నమో టీవీ ప్రసారాలు ఈ నెల 17 నుంచి ఆగిపోయినట్లు బీజేపీ వర్గాలు చెప్పా యి. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీ లు, సందేశాలను ఈ చానల్లో బీజేపీ ప్రసా రం చేసింది. ఈ చానల్‌ను కేవలం ఎన్నికల ప్రచారం కోసమే ప్రారంభించారనీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారం 17న ముగిసిన వెంటనే దీని ప్రసారాలు కూడా ఆగిపోయాయని బీజేపీ నేత ఒకరు చెప్పారు. చానల్ మొదలైన ప్పటి నుంచి ఏదో ఒక వివాదంలో మునుగు తూనే ఉంది. నిశ్శబ్ద సమయం ప్రారంభమైన తర్వాత కూడా ఎన్నికల కార్యక్రమాలను ప్రసారం చేసినందుకు ఢిల్లీ ఎన్నికల ప్రధా నాధికారి ఈ చానల్‌కు నోటీసులు పంపారు. అయితే ఎన్నికల నిబంధనవాళిని ఉల్లంఘిం చలేదని చానల్ తెలిపింది. రికార్డ్ చేసిన అన్ని కార్య క్రమాలను ధ్రువీకరించిన తర్వాతనే టీవీలో ప్రసారం చేయాలని కోరగా, ఢిల్లీ ఎన్నికల కమిషన్ కూడా అదే విషయం స్పష్టం చేసింది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు, ఎన్నికల నిబంధనావళిని ఉల్లం ఘించి చానల్‌ను బీజేపీ ప్రారంభించినందు న దాని కార్య క్రమాలను నిలిపి వేయాలని విపక్షాలు కోరడంతో దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖను ఈసీ కోరింది. -
‘నమో’ జపానికి ఈ ఎన్నికలే ఆఖరు
కన్నౌజ్: ‘నమో నమో’అని జపించే వారికి ఇవే ఆఖరి ఎన్నికలని, ఈ లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలో మోదీ పేరు వినపడదని బహుజన సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి అన్నారు. ఈ ఎన్నికల్లో తమ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్ఎల్డీ అధ్యక్షుడు అజిత్ సింగ్‌తో కలిసి కన్నౌజ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ నియోజకవర్గం నుంచి అఖిలేష్ సతీమణి డింపుల్ ఎస్పీ–బీఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. డింపుల్‌ను తన కోడలిగా సంబోధించిన మాయావతి.. ఆమెను మరోసారి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఉత్తరప్రదేశ్‌లో తమ కూటమి దేశానికి కొత్త ప్రధానిని అందిస్తుందని అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశాలు అంటే బీజేపీకి భయమని.. అందుకే మోదీసహా ఆ పార్టీ నేతలు ప్రెస్ కాన్ఫరెన్స్‌లకు హాజరుకాకుండా పారిపోతున్నారన్నారు. జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే వారు ఇలా తప్పించుకు తిరుగుతారని ఎద్దేవా చేశారు. అందుకే బీజేపీ పేరును ‘భాగ్తీ జనతా పార్టీ’గా మార్చాలని తెలుపుతూ ట్వీట్ చేశారు. మాయావతి సభ ముందు ఎద్దు వెంటపడటంతో తప్పించుకోబోయి పడిపోయిన పోలీస్ -
‘నమో’ ప్రసారాలపై ఈసీ కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ : బీజేపీ ఇటీవల ప్రారంభించిన ‘నమో టీవీ’పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీచేసింది. పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచి ఎన్నికలకు సంబంధించిన ప్రసారాలను నిలిపివేయాలని ఆదేశించింది. ప్రచారాలకు సంబంధించిన వార్తలు ప్రసారం చేయడం ద్వారా ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నందున వాటిని నిషేధించాలని పేర్కొంది. ఈ మేరకు పోలింగ్ ప్రతీ దశలో రెండు రోజుల ముందు నుంచి నమో టీవీ ప్రసారాల తీరును గమనించాల్సిందిగా ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌ను ఆదేశించింది. అదే విధంగా నమోటీవీలో ప్రసారమవుతున్న కార్యక్రమాలు, వాటికి వస్తున్న అడ్వర్టైజ్మెంట్ల వివరాలు, వివిధ కార్యక్రమాలకు అవుతున్న ఖర్చు వివరాలను పరిశీలించాల్సిందిగా పేర్కొంది. ప్రజాప్రాతినిథ్య చట్టంలోని 126 సెక్షన్ కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. కాగా రాజకీయ ప్రచారానికి సంబంధించిన సమాచారాన్ని తొలుత సర్టిఫికేషన్ చేయకుండా నమో చానల్లో ప్రసారం చేయరాదని ఈసీ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏవైనా వీడియోలు ప్రసారమైతే వాటిని వెంటనే తొలగించాలని ఢిల్లీ ఎన్నికల ప్రధానాధికారికి సూచించింది. తాము నియమించిన మీడియా సర్టిఫికేషన్ కమిటీ ఆమోదం పొందినవాటినే ప్రసారం చేసుకోవాలని స్పష్టం చేసింది. ‘నమో టీవీ’ ప్రసారాలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశముందని కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని ఢిల్లీ సీఈవోను ఈసీ ఆదేశించింది. నమో టీవీ సర్టిఫికేషన్ లేకుండానే పలు వీడియోను ప్రసారం చేసినట్లు సీఈవో గుర్తించారు. -
సర్టిఫికేషన్ ఉంటేనే ‘నమో’ ప్రసారాలు
న్యూఢిల్లీ: బీజేపీ ఇటీవల ప్రారంభించిన ‘నమో టీవీ’పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీచేసింది. రాజకీయ ప్రచారానికి సంబంధించిన సమాచారాన్ని తొలుత సర్టిఫికేషన్ చేయకుండా ఈ చానల్లో ప్రసారం చేయరాదని ఈసీ ఆదేశించింది. ఇప్పటికే ఏవైనా వీడియోలు ప్రసారమైతే వాటిని వెంటనే తొలగించాలని ఢిల్లీ ఎన్నికల ప్రధానాధికారికి సూచించింది. తాము నియమించిన మీడియా సర్టిఫికేషన్ కమిటీ ఆమోదం పొందినవాటినే ప్రసారం చేసుకోవాలని స్పష్టం చేసింది. ‘నమో టీవీ’ ప్రసారాలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశముందని కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని ఢిల్లీ సీఈవోను ఈసీ ఆదేశించింది. నమో టీవీ సర్టిఫికేషన్ లేకుండానే పలు వీడియోను ప్రసారం చేసినట్లు సీఈవో గుర్తించారు. -
‘నమో’ యాంటీ వైరస్ సాఫ్ట్వేర్
న్యూఢిల్లీ: దేశీయ ఐటీ కంపెనీ ఇన్నోవేజన్ తన నూతన యాంటీవైరస్ (వైరస్ల నుంచి కంప్యూటర్లకు రక్షణ) కు ‘నమో’గా నామకరణం చేసింది. ఎన్నికల ముందు నమో (నరేంద్రమోడీ) వైరస్ దేశవ్యాప్తంగా సోకి బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇన్నోవేజన్ తన నూతన శ్రేణి యాంటీ సాఫ్ట్‌వేర్‌కు నరేంద్రమోడీ సంక్షిప్త నామాన్ని ఎంచుకోవడం విశేషం. మాల్వేర్, వైరస్ దాడుల నుంచి రక్షణ కల్పించేలా అడ్వాన్స్డ్ సాఫ్ట్‌వేర్‌ను నమో పేరుతో విడుదల చేయనున్నట్లు ఇన్నోవేజన్ వెల్లడించింది. దేశంలో యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించని 57 శాతం మంది నెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని దీనిని తెస్తున్నట్లు కంపెనీ సీఈవో అభిషేక్ గగ్నేజా తెలిపారు. తమ కంపెనీకి ఏ రాజకీయ పార్టీతో అనుబంధం లేదని స్పష్టం చేశారు. -
మోడీ కేబినెట్లో ఎనిమిది మందికే అవకాశం
సాక్షి, ముంబై: దేశానికి కాబోయే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ టీమ్‌లో ఎంత మందికి స్థానం దక్కుతుందన్న అంకెలపై ఇంకా స్పష్టత రాలేదు. తాజాగా రాష్ట్రానికి చెందిన ఎనిమిది మందికి మోడీ మంత్రి మండలిలో అవకాశం దక్కుతుందని తెలిసింది. బీజేపీకి ఐదు, శివసేనకు మూడు మంత్రి పదవులు కేటాయిస్తారని సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 23, శివసేనకు 18 , స్వాభిమాని షేత్కారీ సంఘటన పార్టీకి ఒకటి ఇలా మొత్తం 42 స్థానాలను మహాకూటమి కైవసం చేసుకుంది. దీంతో కేంద్రంలో కీలక పదవులతోపాటు పదికిపైగా మంత్రి పదవులు రాష్ట్రానికి దక్కే అవకాశాలున్నాయని భావించారు. అయితే కేవలం ఎనిమిది మాత్రమే ఇచ్చే అవకాశముందని తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. బీజేపీలో... లోక్‌సభ ఎన్నికల్లో లభించిన విజయంతో బీజేపీలోని అనేక మంది మంత్రి పదవులపై ఆసక్తి కనబరుస్తున్నారు. గడ్కారీ, గోపీనాథ్ ముండే, హంసారజ్ అహిర్, రావ్‌సాహెబ్ దానవే, కిరీట్ సోమయ్య పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఎవరికి దక్కనుందనే విషయమై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. శివసేనలో... శివసేనలో కూడా మంత్రి పదవులపై అనేక మంది ఆశలు పెట్టుకున్నారు. అయితే శివసేనకు కేవలం మూడు మంత్రి పదవులు లభిస్తాయని తెలుస్తోంది, వీటిలో ఒకటి కేబినేట్ మంత్రి పదవి ఉండవచ్చని వినబడుతోంది. అయితే శివసేన మరో మంత్రి పదవిని ఇవ్వాలని డిమాండ్ చేసే అవకాశముందంటున్నారు. అనంత్ గీతేకు కేంద్ర కేబినేట్ పదవి లభించే అవకాశముంది. చంద్రకాంత్ ఖైరే, ఆనందరావ్ అడసూల్, అనీల్ దేశాయి, శివాజీరావ్ ఆడల్‌రావ్ పాటిల్‌లు కూడా మంత్రి పదవులపై ఆసక్తిని కనబరుస్తున్నారు. -
దేశమంతా... నమో నమ: