మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పించేలా కేంద్రం ప్రవేశపెట్టిన ‘నమో డ్రోన్ దీదీ’ పథకానికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకంలో నమోదు చేసుకున్న ఒక్కో సంఘానికి రూ.8 లక్షలు మేర సాయం చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2024-26 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకంలో భాగంగా సుమారు 14,500 మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.
వ్యవసాయం ఎంతో శ్రమతో కూడుకున్నది. టెక్నాలజీ సహాయంతో వ్యవసాయాన్ని సులువుగా చేసేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో స్థానిక మహిళా స్వయం సహాయక సంఘాలను భాగం చేస్తోంది. వారికి డ్రోన్లు అందించి సరైన శిక్షణ ఇవ్వడంతో ఉపాధి కల్పిస్తోంది. అదే సమయంలో రైతులపై పనిభారం తగ్గినట్లవుతుందని కేంద్రం భావిస్తోంది. అందుకోసం ‘నమో డ్రోన్ దీదీ’ పథకాన్ని గతంలోనే ప్రారంభించింది.
ఇదీ చదవండి: 171.6 టన్నుల బంగారు ఆభరణాలు!
ఈ పథకానికి సంబంధించి కేంద్రం ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులోని అంశాలను అమలు చేసేందుకు రూ.1,261 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. డ్రోన్ కొనుగోలులో 80 శాతం వరకు కేంద్రమే భరించనున్నట్లు చెప్పింది. లేదంటే రూ.8 లక్షలు విడుదల చేస్తామని స్పష్టం చేసింది. అంతకంటే ఎక్కువ ధరతో డ్రోన్ కొనుగోలు చేయాలనుకునే స్వయం సహాయక సంఘాలకు అదనంగా అవసరమయ్యే డబ్బును నేషనల్ అగ్రికల్చర్ ఇన్‌ఫ్రా ఫైనాన్సింగ్ ఫెసిలిటీ కింద 3 శాతం వడ్డీరాయితీతో అందించనున్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment