drone delivery
-
రూ.55 కోట్లు సమీకరించిన హైదరాబాద్ కంపెనీ
హైదరాబాద్‌కు చెందిన డ్రోన్ టెక్నాలజీ కంపెనీ మారుత్ డ్రోన్‌టెక్ నిధులు సమీకరించేందుకు పూనుకుంది. అందులో భాగంగా తాజాగా 6.2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.55 కోట్లు) పెట్టుబడులు సమీకరించింది. లోక్ క్యాపిటల్ నుంచి ఈ నిధులు సమీకరించినట్లు సంస్థ తెలిపింది. వార్షికంగా 3,000 డ్రోన్ల స్థాయికి తయారీ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు, వచ్చే అయిదేళ్లలో రూ.1,000 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని సాధించే దిశగా కార్యకలాపాలు పటిష్టం చేస్తున్నట్లు మారుత్ డ్రోన్స్ సీఈవో ప్రేమ్ కుమార్ విశ్లావత్ పేర్కొన్నారు.అధునాతన వ్యవసాయ డ్రోన్లను అభివృద్ధి చేసేందుకు, ద్వితీయ–తృతీయ శ్రేణి పట్టణాల్లోకి చానల్ పార్ట్నర్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు, గ్రామీణ ప్రాంత వినియోగదార్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఈ నిధులను ఉపయోగించనున్నట్లు ప్రేమ్ వివరించారు. దేశీయంగా కేంద్రం నమోదీదీ పేరుతో స్వయం సహాయక సంఘాల మహిళలకు డ్రోన్ అందించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో దేశీయ కంపెనీల ఉత్పత్తులకు స్థానికంగా గిరాకీ ఏర్పడుతుందని సంస్థలు భావిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో మహిళలకు ఉపాధి చేకూరుతుందని అధికారులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: మార్కెట్.. ‘ట్రంపె’ట్!మారుత్ డ్రోన్‌టెక్ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో 9,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో కార్పొరేట్ కార్యాలయాన్ని ఇప్పటికే ప్రారంభించింది. తన డీలర్ల నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నట్టు, 2028 నాటికి డీలర్ల సంఖ్యను 500కు పెంచుకోనున్నట్టు గతంలోనే ప్రకటించింది. కస్టమర్లకు అత్యుత్తమ సేవలు, సహకారం అందించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో సర్వీస్ సెంటర్లను ఏర్పా టు చేస్తున్నట్టు తెలిపింది. ఐదేళ్లలో 30,000 డ్రోన్ల విక్రయాల లక్ష్యాన్ని చేరుకోనున్నట్టు ప్రకటించింది. -
డ్రోన్ కొనుగోలుకు రూ.8 లక్షలు సాయం
మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పించేలా కేంద్రం ప్రవేశపెట్టిన ‘నమో డ్రోన్ దీదీ’ పథకానికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకంలో నమోదు చేసుకున్న ఒక్కో సంఘానికి రూ.8 లక్షలు మేర సాయం చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2024-26 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకంలో భాగంగా సుమారు 14,500 మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.వ్యవసాయం ఎంతో శ్రమతో కూడుకున్నది. టెక్నాలజీ సహాయంతో వ్యవసాయాన్ని సులువుగా చేసేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో స్థానిక మహిళా స్వయం సహాయక సంఘాలను భాగం చేస్తోంది. వారికి డ్రోన్లు అందించి సరైన శిక్షణ ఇవ్వడంతో ఉపాధి కల్పిస్తోంది. అదే సమయంలో రైతులపై పనిభారం తగ్గినట్లవుతుందని కేంద్రం భావిస్తోంది. అందుకోసం ‘నమో డ్రోన్ దీదీ’ పథకాన్ని గతంలోనే ప్రారంభించింది.ఇదీ చదవండి: 171.6 టన్నుల బంగారు ఆభరణాలు!ఈ పథకానికి సంబంధించి కేంద్రం ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులోని అంశాలను అమలు చేసేందుకు రూ.1,261 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. డ్రోన్ కొనుగోలులో 80 శాతం వరకు కేంద్రమే భరించనున్నట్లు చెప్పింది. లేదంటే రూ.8 లక్షలు విడుదల చేస్తామని స్పష్టం చేసింది. అంతకంటే ఎక్కువ ధరతో డ్రోన్ కొనుగోలు చేయాలనుకునే స్వయం సహాయక సంఘాలకు అదనంగా అవసరమయ్యే డబ్బును నేషనల్ అగ్రికల్చర్ ఇన్ఫ్రా ఫైనాన్సింగ్ ఫెసిలిటీ కింద 3 శాతం వడ్డీరాయితీతో అందించనున్నట్లు పేర్కొంది. -
డ్రోన్లతో చొరబాట్లు!
న్యూఢిల్లీ: డ్రోన్లతో ఉగ్రవాదులు ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, డబ్బులు చేరవేయడం గురించి విన్నాం. చొరబాట్లకు కూడా డ్రోన్లను ఉపయోగించుకుంటున్నట్లు తేలడం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్తాన్ చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా కొన్ని నెలల క్రితం డ్రోన్‌తో పంజాబ్‌లో ఓ ఉగ్రవాదిని జార విడిచిందని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ డ్రోన్‌కు 70 కిలోల వరకు బరువును మోసుకెళ్లగల సామర్థ్యం ఉందని తెలియజేశాయి. పాకిస్తాన్ భూభాగంలోని షాకర్‌గఢ్‌లో లష్కతే తోయిబా శిక్షణా కేంద్రంలో ఇలాంటి డ్రోన్ల సామర్థ్యాన్ని పరీక్షిస్తున్న వీడియోను నిఘా వర్గాలు సేకరించాయి. డ్రోన్లు మనుషులను సునాయాసంగా మోసుకెళ్లి, నీటిలో భద్రంగా వదిలిపెడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. పంజాబ్‌లో డ్రోన్ సాయంతో అక్రమంగా చొరబడిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించామని అధికారులు చెప్పారు. లష్కరే తోయిబా నాయకులే డబ్బులు ఇచ్చి పంపించినట్లు అతడు అంగీకరించాడని తెలిపారు. డ్రోన్ సాయంతో పంజాబ్ వెళ్లి, అక్కడే స్థిరపడి, ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించాలంటూ లష్కరే తోయిబా నాయకత్వం నుంచి అతడికి ఆదేశాలు అందాయని వెల్లడించారు. పంజాబ్‌లో ఇప్పటికే మకాం వేసిన ముష్కరుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి తీసుకోవాలంటూ అతడికి సూచనలిచ్చారని పేర్కొన్నారు. లష్కరే తోయిబాపై భారత్ గతంలోనే నిషేధం విధించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి ఆయుధాలను, డ్రగ్స్‌ను పంపించడానికి పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు డ్రోన్లను వాడుకుంటున్నట్లు ఇప్పటికే నిర్ధారణ అయ్యింది. ప్రధానంగా జమ్మూకశీ్మర్, పంజాబ్‌కు ఈ డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్ వచ్చి పడుతున్నాయి. ఈ వ్యవహారం వెనుక పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతోపాటు ఖలిస్తాన్ అనుకూల శక్తుల హస్తం కూడా ఉండొచ్చని భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం శ్రీనగర్: వాస్తవా«దీన రేఖ(ఎల్ఏసీ) వద్ద చొరబాటు యత్నాన్ని భారత భద్రతా దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో చోటుచేసుకున్న ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లా జిల్లాలోని యూరీ సెక్టార్ హథ్లాంగ్ ఫార్వర్డ్ ఏరియాలో శనివారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. సైన్యం, కశ్మీర్ పోలీసులు, నిఘా ఏజెన్సీలు ఉమ్మడి ఆపరేషన్ చేపట్టాయని, చొరబాటు యత్నాన్ని భగ్నం చేశాయన్నారు. పొరుగు దేశం నుంచి మన భూభాగంలోకి ప్రవేశిస్తున్న ఉగ్రవాదులను అడ్డుకొనేందుకు ప్రయతి్నంచగా, కాల్పులు జరిపారని, దాంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయని తెలిపారు. కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు మరణించారని, ఇద్దరి మృతదేహాలను స్వా«దీనం చేసుకున్నామన్నారు. పాకిస్తాన్ వైపు నుంచి కాల్పులు కొనసాగుతున్నాయన్నారు. హతమైన ముగ్గురు ముష్కరుల వివరాలు తెలియాల్సి ఉందన్నారు. మరోవైపు, అనంత్‌నాగ్ జిల్లాలో ముగ్గురు భారత ఉన్నతాధికారులను బలి తీసుకున్న ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోందని వెల్లడించారు. ఈ ఆపరేషన్ శనివారం నాలుగో రోజుకు చేరింది. -
దివ్యాంగ వృద్ధుడికి డ్రోన్ ద్వారా పెన్షన్
నౌపడ: హితారామ్ సత్నామీ. వయోభారంతో ఆరోగ్యం క్షీణించిన వృద్ధుడు. పైగా దివ్యాంగుడు. ఒడిశా రాష్ట్రం నౌపడ జిల్లాలో మారుమూల గ్రామం భుత్కాపడని నివసిస్తున్నాడు. ఒడిశా ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మధుబాబు పెన్షన్ యోజన’ లబ్ధిదారుడు. స్వయంగా నడవలేడు. ప్రతినెలా దట్టమైన అడవిలో రెండు కిలోమీటర్లు ఇతరుల సాయంతో ప్రయాణించి, పంచాయతీ కార్యాలయానికి వెళ్లి పెన్షన్ తెచ్చుకొనేవాడు. ఫిబ్రవరిలో మాత్రం అతడికి ఈ ప్రయాణ బాధ తప్పింది. గ్రామ సర్పంచి డ్రోన్ ద్వారా పెన్షన్ అందజేసే ఏర్పాటు చేయడమే ఇందుకు కారణం. సర్పంచ్ సరోజ్ అగర్వాల్ డ్రోన్ ద్వారా పెన్షన్ డబ్బులను తన ఇంటి వద్దకే చేర్చారని హితారామ్ సత్నామీ ఆనందం వ్యక్తం చేశాడు. వృద్ధుడు హితారామ్ గురించి తెలిసిన తర్వాత సొంత డబ్బులతో ఆన్లైన్లో డ్రోన్ కొనుగోలు చేశామని, ప్రతినెలా డ్రోన్ సాయంతో అతడికి పెన్షన్ అందజేయాలని నిర్ణయించామని సర్పంచ్ సరోజ్ అగర్వాల్ చెప్పారు. -
భారీ ఉగ్రకుట్ర భగ్నం
చండీగఢ్: భారీ ఉగ్ర కుట్ర భగ్నమైంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్ అండతో ఖలిస్తాన్ వేర్పాటువాదులు వేసిన పథకాన్ని పోలీసు బలగాలు బట్టబయలు చేశాయి. హరియాణాలోని కర్నాల్ గురువారం వేకువజామున జరిపిన సోదాల్లో తెలంగాణలోని ఆదిలాబాద్‌కు పేలుడు పదార్థాలతో వెళుతున్న వాహనం పట్టుబడింది. అందులో ఉన్న మూడు ఐఈడీలతోపాటు, ఒక పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హరియాణా డీజీపీ పీకే అగర్వాల్ మీడియాకు వివరాలు వెల్లడించారు. కేంద్ర నిఘావర్గాల సమాచారం మేరకు పంజాబ్, హరియాణా పోలీసులు కలిసి ఈ ఆపరేషన్ చేపట్టారు. అనుమానిత ఇన్నోవా వాహనం వెనుకే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌తోపాటు నాలుగు వాహనాల్లో పోలీసులు అనుసరించారు. బస్తారా టోల్ ప్లాజా వద్ద ఇన్నోవాను అడ్డగించి అందులోని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని లూధియానాకు చెందిన భూపీందర్ సింగ్, ఫిరోజ్‌పూర్ జిల్లాకి చెందిన పర్మీందర్ సింగ్, గురుప్రీత్ సింగ్, అమన్‌దీప్ సింగ్‌లుగా గుర్తించారు. వాహనంలో ఉన్న 2.5 కిలోల చొప్పున బరువైన మూడు పాత్రల్లో ఉన్న ఆర్డీఎక్స్ను, పాక్ తయారీ పిస్టల్, రూ.1.3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ పేలుడు పదార్థాలను తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో అందజేయడానికి తీసుకెళ్తున్నట్లు విచారణలో వీరు వెల్లడించారు. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న హర్వీందర్ సింగ్ రిందా వీరికి ఆయుధాలు, పేలుడు పదార్థాలను సరఫరా చేశాడు. వీటిని ఎక్కడెక్కడికి తరలించాలో ప్రత్యేక యాప్ ద్వారా సూచనలు చేస్తున్నాడని డీజీపీ తెలిపారు. గతంలో కూడా వీరు పలు ప్రాంతాలకు పేలుడు పదార్థాలను తరలించినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఫిరోజ్‌పూర్ జిల్లాలో ముందుగానే గుర్తించిన కొన్ని ప్రాంతాల్లో డ్రోన్లతో ఇతడు ఆయుధాలను, డ్రగ్స్‌ను జార విడుస్తున్నాడని అన్నారు. పట్టుబడిన నలుగురికి కర్నాల్ న్యాయస్థానం 10 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఉగ్రవాదుల కుట్రను విజయవంతంగా అడ్డుకున్నట్లు పంజాబ్ డీజీపీ వీకే భావ్రా అన్నారు. అనుమానిత ఉగ్రవాదుల వాహనాన్ని దాదాపు 300 కిలోమీటర్ల దూరం వెంబడించామన్నారు. బుధవారం రాత్రి ఫిరోజ్‌పూర్ నుంచి మొదలై గురువారం ఉదయం కర్నాల్‌లో ఈ సుదీర్ఘ ఛేజింగ్ ముగిసిందని చెప్పారు. -
స్విగ్గీ మరో సంచలనం, ఒక్క ఫోన్ కొడితే చాలు!
డెలివరీ రంగంలో సరికొత్త విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీకి చెందిన ఇన్‌స్టామార్ట్ ఇకపై కస్టమర్లకు కావాల్సిన గ్రాసరీస్‌ను డ్రోన్ల ద్వారా డ్రోన్ పోర్ట్‌కు డెలివరీ చేయనుంది. బెంగళూరు కేంద్రంగా స్విగ్గీకి చెందిన గ్రాసరీ సర్వీస్ ఫ్లాట్ ఫామ్ 'ఇన్ స్టామర్ట్'లో ఇన్ని రోజులు కస్టమర్లకు వారికి కావాల్సిన నిత్యవసర వస్తువుల్ని డెలివరీ బాయ్స్‌తో అందిస్తుండేది. కానీ ఇకపై డెలివరీ బాయ్స్ బదులు..డ్రోన్లు డెలివరీ చేయనున్నాయి. ఇందులో భాగంగా స్విగ్గీ డ్రోన్ సర్వీస్‌లు అందించే నాలుగు సంస్థల భాగస్వామ్యంలో డ్రోన్ డెలివరీ సర్వీస్ ట్రయల్స్‌ను నిర్వహిస్తుంది. డ్రోన్‌తో సరుకుల రవాణా డిల్లీ -ఎన్సీఆర్, బెంగళూరులో పైలెట్ ప్రాజెక్ట్ కింద ఈ డ్రోన్ డెలివరీ ట్రయల్స్‌ను రెండు సార్లు నిర్వహించనున్నట్లు స్విగ్గీ తన బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. ముందస్తుగా గరుడా ఏరోస్పేస్ సంస్థ బెంగళూరులో, స్కైఎయిర్ మొబిలిటి సంస్థ ఢిల్లీ- ఎన్సీఆర్'లలో డ్రోన్స్ ద్వారా కస్టమర్లకు కావాల్సిన సరుకుల్ని డ్రోన్ పోర్ట్‌కు చేరవేయనుంది. తొలిఫేజ్ ట్రయల్స్‌ను పరిశీలించిన తర్వాత ఏఎన్ఆర్ఏ అండ్, టెక్ ఈగల్, మరుట్ డ్రోన్ టెక్ సంస్థలు సెకండ్ ఫేజ్‌లో ట్రయల్స్ జరపనున్నాయి. డ్రోన్లతో సరుకుల్ని కస్టమర్లకు డోర్ డెలివరీ చేస్తుందా? డార్క్ స్టోర్ అంటే రీటైల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లేదా అవుట్ లెట్లలో ఉన్న సరుకుల్ని డ్రోన్లే..డ్రోన్లు ఉండే ఏరియా(డ్రోన్ పోర్ట్) కు తీసుకొస్తాయి. డ్రోన్ పోర్ట్ నుంచి స్విగ్గీ డెలివరీ పర్సన్ ప్యాకేజీని పికప్ చేసుకొని కస్టమర్‌కు డెలివరీ చేస్తారు. కేంద్ర అనుమతుల్లేవు..కానీ ఈ డ్రోన్ డెలివరీకి కేంద్రం అనుమతులు ఇవ్వులేదు. డ్రోన్ డెలివరీ బి హైండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్స్ (బీవీఎల్ఓఎస్) మీద ఆదారపడి పనిచేస్తుంది. ఈ ఆపరేషన్స్ నిర్వహించేందుకు కేంద్రం ఇప్పటి వరకు అనుమతులు ఇవ్వలేదు. కానీ గతేడాది కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియన్స్ శాఖ కేవలం 20సంస్థలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో స్విగ్గీతో పాటు ఏఎన్ఆర్ఏ అండ్, టెక్ ఈగల్, మరుట్ డ్రోన్ టెక్ సంస్థలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటున్నాయ్! మనదేశంలో డ్రోన్ కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేశాయి. ముఖ్యంగా కరోనా కారణంగా హెల్త్ కేర్ రంగంలో డ్రోన్ టెక్నాలజీ అవసరం ఏర్పడించింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ సమయంలో వ్యాక్సిన్లు, కరోనా బాధితులకు కావాల్సిన మెడిసిన్లు డ్రోన్ల సాయంతో డెలివరీ చేసేందుకు ట్రయల్స్ నిర్వహించాయి. ఇప్పటికే మన దేశానికి గుర్గావ్ కేంద్రంగా లాజిస్టిక్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఢిల్లీ వేరి సంస్థ డ్రోన్ డెలివరీ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా డ్రోన్లను తయారు చేసే అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ట్రాన్సిషన్ రోబోటిక్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంటర్నెట్ దిగ్గజం ఆల్ఫాబెట్ డ్రోన్ డెలివరీ యూనిట్ వింగ్ టెక్సాస్, డల్లాస్ వాల్‌గ్రీన్స్ నుండి మెడిసిన్లను డ్రోన్ డెలివరీ చేసింది. చదవండి👉స్విగ్గీ బంపరాఫర్: డెలివరీ బాయ్స్ కష్టాలకు చెక్..కళ్లు చెదిరేలా జీతాలు! -
TS: 41 కిలోమీటర్లు.. డ్రోన్ల ద్వారా టీకాలు..
సాక్షి, హైదరాబాద్: డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లను సరఫరా చేసేందుకు ఉద్దేశించిన ‘మెడిసిన్స్ ఫ్రం స్కై’ప్రాజెక్టును వికారాబాద్ జిల్లాలో విజయవంతంగా పరీక్షించారు. దేశంలోనే తొలిసారిగా ఏకంగా 41 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి కోవిడ్ టీకాలు, మందులను రవాణా చేశారు. వికారాబాద్‌లోని న్యూ ఏరియా ఆస్పత్రి నుంచి బొంరాస్‌పేట ప్రాథమిక వైద్య కేంద్రానికి (పీహెచ్సీ) డ్రోన్ ద్వారా పది సార్లు మందులను రవాణా చేశారు. ఈ రెండు ప్రాంతాల మధ్య 41 కిలోమీటర్లు ఉంటుంది. రోడ్డు మార్గాన వెళ్తే దాదాపు గంటా 25 నిమిషాల సమయం పడుతుంది. కానీ డ్రోన్ ద్వారా కేవలం 32 నిమిషాల్లోనే చేరుకుంది. 30 కిలోల బరువున్న ఈ డ్రోన్ 16 కిలోల బరువున్న మందులను మోసుకుంటూ వెళ్లింది. ‘మెడిసిన్స్ ఫ్రం స్కై’ప్రాజెక్ట్‌లో భాగంగా శుక్రవారం మారుత్ డ్రోన్స్ టెక్ పైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ ప్రయోగం జరిగింది. ఒక్కో డ్రోన్ ద్వారా నాలుగు బాక్స్‌లను (ఒక్కో బాక్స్‌లో 10 యూనిట్ల రక్తం, 500 టీకా డోసులు) పంపించొచ్చు. అంటే ఒక్కో డ్రోన్ ఫ్లయిట్ ద్వారా రెండు నుంచి 3 వేల వ్యాక్సిన్ డోసులను పంపించవచ్చు. గతంలో 3 నుంచి 6 కి.మీ. దూరం లోపు మందులు, టీకాలు పంపే ప్రయోగాలు జరిపారు. తొలిసారి డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ గత సెప్టెంబర్‌లో అడవుల పునరుద్ధరణలో భాగంగా దేశంలోనే తొలిసారిగా కామారెడ్డి జిల్లాలోని అటవీ ప్రాంతంలో సీడ్ కాప్టర్ డ్రోన్ల సాయంతో విత్తనబంతులను వెదజల్లారు. ఆ తర్వాత 3 నుంచి 6 కి.మీ దూరానికి డ్రోన్ల ద్వారా టీకాలు, అత్యవసర ఔషధాలు, ఇంజెక్షన్లను విజయవంతంగా రవాణా చేశారు. తాజాగా డ్రోన్ల ద్వారా పంపిన మందుల వివరాలను అపోలో ఆస్పత్రి ఆధ్వర్యంలో రికార్డు చేశారు. డ్రోన్ల ద్వారా మందులను చేరవేసే సందర్భంలో టీకాలు ఉంచిన కంటైనర్ల ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయా? ఔషధాలపై ప్రభా వం పడుతోందా అన్న అంశాలను పరిశీలించారు. నవంబర్ 8న గువాహటిలో.. నవంబర్ 8న అస్సాం రాజధాని గువా హటిలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సమక్షంలో గువాహటి నుంచి రోడ్డు మార్గం సరిగా లేని 40 కి.మీ దూరంలో ఉన్న ప్రాంతాలకు కరోనా టీకాలు రవాణా చేస్తాం. పర్వతాలు, లోయలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలపై అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ తదితర ఈశాన్య రాష్ట్రాలతో మారుత్ డ్రోన్స్, పబ్లిక్‌హెల్త్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రతినిధి బృందాలు చర్చలు జరిపాయి. గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, మిజోరం రాష్ట్రాలతోనూ వర్చువల్ సమావేశం నిర్వహించాం. – ప్రేమ్‌కుమార్ విస్లావత్, మారుత్‌డ్రోన్స్ ఫౌండర్ -
‘డ్రోన్ డెలివరీ’ అద్భుతం: వరద ప్రాంతాలకు మందులు
సాక్షి, కామారెడ్డి: దేశంలోనే ప్రప్రథమంగా తెలంగాణలో మందులు (మెడిసిన్స్) ఆకాశమార్గాన తరలిస్తూ మారుమూల ప్రాంతాలకు చేరువ చేసేలా ‘డ్రోన్ డెలివరీ’ విధానం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారీ వర్షాల నేపథ్యంలో ఆ డ్రోన్ విధానం ఎంతో ఉపయోగపడుతోంది. వరద ప్రభావిత ప్రాంతాలు, మారుమూల గ్రామాలకు మందుల సరఫరా సులువుగా మారింది. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ప్రారంభమైన మందుల డ్రోన్ డెలివరీ కామారెడ్డి జిల్లాలో కూడా మొదలైంది. తాజాగా సోమవారం ఓ గ్రామానికి డ్రోన్ డెలివరీ విధానంలో మందులు అందించారు. చదవండి: హెచ్‌సీఏ వివాదం.. హైకోర్టులో అజారుద్దీన్‌కు ఊరట జిల్లాలో విస్తారంగా వానలు పడుతుండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. దీంతో పిట్లం మండలంలోని కుర్తి గ్రామానికి వెళ్లే రహదారి నీట మునిగి రాకపోకలు స్తంభించాయి. అయితే గ్రామంలో ఒకరికి అత్యవసరంగా మందులు అవసరం ఉండడంతో అధికారులు డ్రోన్ ద్వారా పంపించారు. డ్రోన్ ద్వారా మందుల రాకను గ్రామస్తులు ఆసక్తిగా గమనించారు. ఈ విధానంపై ప్రశంసలు కురిపించారు. చదవండి: దొంగ తెలివి... చాక్లెట్లు కూడా బంగారమే! -
ఇది మా గగన విహారం మీరు ఎగరడానికి వీల్లేదు!
మన పెద్దవాళ్లు ధాన్యం, ఎండు మిరపకాయలు, వడియాలు, పిండి వంటి ఆహార పదార్థాలను ఆరు బయట ఎండ పెట్టేవారు. పైగా పక్షులు, కోతులు వచ్చి పాడుచేయకుండా ఉండటానికి వల లేక దాన్ని భయపెట్టించేలా శబ్దాలు చేయడం లేదా చనిపోయిన పక్షి బొమ్మలు పెట్టడం వంటివి చేసేవారు. అప్పుడు మనం ఇళ్లలోకి రానివ్వక పోవడం వల్లనో మరీ ఏమో గానీ ఇక్కడోక కాకి ఫుడ్ డెలివరీ చేసే ఒక డ్రోన్‌ని ఇది మా గగన విహారం నువ్వు ఎగరడానికి వీల్లేదూ....అన్నట్లుగా దాన్ని తరిమికొట్టేదాక వదల్లేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటో ఆ విషయం అని ఆశ్చర్యంగా ఉంది కదూ! కాన్బెర్రా: ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రా గూగుల్ భాగస్వామ్యంతో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన డ్రోన్ వింగ్‌ని ప్రజా సేవల వినియోగ నిమిత్తం 2019 నుంచి ప్రారంభించింది. ఈ డ్రోన్ ఆహారం, మెడిసిన్, కాఫీ తదితర వాటిని ప్రజలకు సరఫరా చేయడానికి వినియోగిస్తోంది. ఇటీవల కోవిడ్ సమయంలో ప్రజలకు కావల్సిన ఆహారం, నిత్యావసరాలకు సంబంధించిన పదివేల ఆర్డర్లను డెలవరీ చేసి ఎంతో విశేష ప్రజాదరణ పొందింది. (చదవండి: వెరైటీ థెరపీలు... విలువైన ప్రయోజనాలు!) ఈ క్రమంలో ఆస్ట్రేలియాలోని ఒక కస్టమర్ తాను ఆర్డర్ చేసిన డెలివరీ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో ఒక కాకి ఆకాశంలో ఫుడ్ డెలివరీ చేసే డ్రోన్ పై ఆకస్మాత్తుగా దాడికి పాల్పడింది. దానిని గట్టిగా నోటితో పట్టుకుని ఆపే ప్రయత్నం చేస్తోంది. పైగా ఆ కాకి చూడటానికి ఆకారంలో చాలా పెద్దగా ఉంది. వెంటనే సదరు కస్టమర్ ఆశ్చర్యానికి గురై దాన్ని వీడియో తీశాడు. ఆ డ్రోన్ పై కాకి చాలా భయంకరంగా దాడి చేసింది. దీంతో ఆ డ్రోన్ ఆ డెలివరీని కింద పడేసింది. ఆ తర్వాత ఆ కాకి ఒక్కసారిగా అక్కడ నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం కొన్ని ప్రదేశాలలో ఆ వింగ్ డ్రోన్‌ని తాత్కాలికంగా నిషేధించారు. ఈ దాడిలో పక్షికి ఏమి కాలేదని, ప్రస్తుతం ఆ ప్రాంతంలో డ్రోన్లు తిరగపోవడం వల్ల దాన్ని తరిమి కొట్టడంలో పక్షి విజయవంతమైందని పక్షుల సంరక్షణ నిపుణుడు ఒకరు చెప్పారు. (చదవండి: అపహరణకు గురైన ఇరాక్ పురాతన శాసనాన్ని తిరిగి ఇచ్చేశాం!) -
‘డ్రోన్’ స్టార్టప్స్‌లో పెట్టుబడులు రయ్
డ్రోన్ల వినియోగానికి సంబంధించి కేంద్ర సర్కారు ఇటీవలే నిబంధనలను సరళతరం చేసింది. దేశంలో తయారీ రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వేగవంతమైన డెలివరీకి డ్రోన్లు వీలు కల్పిస్తాయని తెలిసిందే. వివిధ రంగాల్లో డ్రోన్ల వినియోగాన్ని పెంచడం వల్ల తగిన ఫలితాలు ఉంటాయన్న అంచనాలతో కేంద్ర ప్రభుత్వం నియంత్రణలను సడలిస్తూ, పెట్టుబడులను ఆకర్షించే విధానాలను ప్రకటించింది. దీంతో డ్రోన్లను తయారు చేసే స్టార్టప్‌లలో పెట్టుబడులకు వెంచర్ క్యాపిటల్ కంపెనీల్లో ఆసక్తి ఏర్పడింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద (పీఎల్ఐ) డ్రోన్ల తయారీ కంపెనీలకు రూ.120 కోట్ల ప్రోత్సాహకాలను సైతం కేంద్రం ప్రకటించడం పెట్టుబడిదారుల్లో ఆసక్తిని పెంచినట్టు చెప్పుకోవాలి. డ్రోన్ల తయారీలో వచ్చే మూడేళ్ల కాలంలో రూ.5,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఒక సీనియర్ అధికారి తెలిపారు. పీఎల్ఐ పథకం డ్రోన్ల తయారీకి ఊతమిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంచి స్పందన వస్తోంది.. డ్రోన్ స్టార్టప్‌లకు మద్దతుగా ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన వస్తున్నట్టు పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి అంబర్‌దూబే మీడియాకు తెలిపారు. ‘‘వెంచర్ క్యాపిటలిస్ట్‌ల నుంచి వివరాలు కోరుతూ విచారణలు కూడా వస్తున్నాయి. పెట్టుబడుల సలహాల విషయంలో ప్రభుత్వ జోక్యం చేసుకోదు. కానీ, మా విధానపరమైన మార్గదర్శకాలు తెలియజేయడం వల్ల వారిలో ఎంతో విశ్వాసం ఏర్పడుతుంది’’అని దూబే వివరించారు. 2023–24 ఆర్థిక సంవత్సరం నాటికి డ్రోన్ తయారీ రంగం రూ.900 కోట్లను చేరుకుంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. తద్వారా 10,000 ప్రత్యక్ష ఉద్యోగాలు రావచ్చని భావిస్తోంది. 2021 మార్చి నాటికి ఈ రంగంలో రూ.60 కోట్ల మేర వ్యాపారం నమోదు కావడం గమనార్హం. డ్రోన్ల వల్ల విస్తరించే సేవల విలువ రూ.30,000 కోట్లకు చేరుకుంటుందని.. డ్రోన్ల నిర్వహణ, డ్రోన్ లాజిస్టిక్స్, డేటా ప్రాసెసింగ్, ట్రాఫిక్ నిర్వహణ తదితర విభాగాల్లో వచ్చే మూడేళ్ల కాలంలో 5 లక్షల ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తోంది. ఇన్వెస్టర్లలో మార్పు.. ఇప్పటివరకు వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్లు డ్రోన్ స్టార్టప్‌ల పట్ల పెద్దగా ఆసక్తి చూపించలేదు. పౌర అవసరాలకు సంబంధించి డ్రోన్ల వినియోగాన్ని చట్టవిరుద్ధంగా 2018లో ప్రభుత్వం ప్రకటించడం, నియంత్రణల పరంగా స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణంగా ఉంది. 2011–2021 మధ్య డ్రోన్ స్టార్టప్‌లలో వచ్చిన పెట్టుబడులు రూ.310 కోట్లకు మించలేదని ట్రాక్సెన్ అనే ఇంటెలిజెన్స్ సంస్థ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే కాలంలో అమెరికాలో 4 బిలియన్ డాలర్లు (రూ.29,600 కోట్లు), అంతర్జాతీయంగా 6.2 బిలియన్ డాలర్లు (రూ.46,000 కోట్లు) డ్రోన్ కంపెనీల్లోకి రావడం గమనార్హం. భారత్‌లో డ్రోన్ల స్టార్టప్‌లు 158 ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా 2,772 సంస్థలు ఈ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ‘‘ప్రస్తుతం పలు ఇండియన్ డ్రోన్ స్టార్టప్‌లు సిరీస్ ఏ నిధుల సమీకరణకు చర్చలు నిర్వహిస్తున్నాయి’’ అని డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ఇండియా డైరెక్టర్ (పార్టనర్షిప్స్) అమిత్‌షా తెలిపారు. ఈ అసోసియేషన్‌లో 200 డ్రోన్ల కంపెనీలు, వాటికి సంబంధించి సేవల కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి. ►158. 2021 మార్చినాటికి దేశీ డ్రోన్ల తయారీ పరిశ్రమలో పనిచేస్తున్న మొత్తం కంపెనీల సంఖ్య. ►30,000 డ్రోన్ల వినియోగానికి సంబంధించి విస్తరించనున్న సేవల విలువ. తద్వారా ఈ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా ►310. 2011–2021 మధ్య దేశీ డ్రోన్ల స్టార్టప్‌లలోకి వచ్చిన పెట్టుబడులు ►10,000 ప్రత్యక్షంగా రానున్న ఉపాధి అవకాశాలు ►900. 2024 మార్చి నాటికి ఈ పరిశ్రమ విస్తరిస్తుందని అంచనా వేస్తున్న విలువ -
TS: డ్రోన్లతో నవశకం
వికారాబాద్: ‘రెండు, మూడు వందల ఏళ్ల క్రితం ప్రపంచంలో ఫాలోవర్‌గా ఉన్న భారతదేశం ఇప్పుడు ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించేస్థాయికి ఎదిగింది. ఇది ప్రధాని మోదీ కలలు గన్న భారత్’అని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. శనివారం వికారాబాద్ ఎస్పీ కార్యాలయం పరెడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డిలతో కలసి ‘మెడిసిన్ ఫ్రం ది స్కై’కార్యక్రమాన్ని ప్రారంభించారు. మారుత్, టెక్ ఈగల్, స్కై ఎయిర్ కంపెనీలకు చెందిన మూడు డ్రోన్ల ద్వారా ఆకాశమార్గాన వ్యాక్సిన్ సరఫరా కార్యక్రమాన్ని దేశంలోనే మొదటిసారి వికారాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించారు. మొదటి, రెండో, మూడో డ్రోన్లను సింధియా, కేటీఆర్, సబితారెడ్డిలు అనౌన్స్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్రమంత్రి సిం«ధియా మాట్లాడుతూ ఆకాశయానంలో డ్రోన్ వ్యవస్థ ఓ కొత్త శకానికి నాంది పలకనుందని, ఇది ఎన్నో నూతన సవాళ్లకు పరిష్కారం చూపనుందని అభిప్రాయపడ్డారు. వైద్యులకు సహకారం అందించటంలో భవిష్యత్తులో డ్రోన్ల వ్యవస్థ ఎంతో ఉపయుక్తం కానుందని, వైద్యరంగంలో ‘మెడిసిన్ ఫ్రమ్ ది స్కై’కార్యక్రమం విప్లవాత్మక మార్పులు తేనుందన్నారు. దేశంలో డ్రోన్లు ఎగిరేందుకు ఉన్న ఆంక్షలు సడలిస్తామని, ఇందుకోసం మూడు రకాల జోన్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. డ్రోన్లు ఎగిరేందుకు అనుమతులు అవసరంలేని గ్రీన్ జోన్లు ఏర్పాటు చేస్తామన్నారు. డ్రోన్లు ఎగిరేందుకు వీలులేని ప్రదేశాలు, ప్రాంతాలను రెడ్‌జోన్‌గా విభజిస్తామని తెలిపారు. ‘మెడిసిన్ ఫ్రం ది స్కై కార్యక్రమం ప్రధాని మోదీ కల అని తెలిపారు. ఒక్కోసారి మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రులకు సకాలంలో మందులు చేరవేయలేక రోగుల ప్రాణాలు పోతుంటాయని, దానికి ‘మెడిసిన్ ఫ్రం ది స్కై’కార్యక్రమం ప్రత్యామ్నాయం కాగలదని పేర్కొన్నారు. దేశానికి తెలంగాణ ఆదర్శం: కేటీఆర్ ‘దేశంలోనే తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రం. నేడు అనేక రంగాల్లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్రమంత్రి కేటీఆర్ అన్నారు. రెండేళ్ల క్రితమే సాంకేతికతపై దావోస్‌లో జరిగిన సమావేశంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో డ్రోన్ల వినియోగం గురించి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సాంకేతికతలో తెలంగాణ ముందుందనటానికి ఇదే నిదర్శనమన్నారు. హెల్త్ కేర్‌కు సాంకేతికతను జోడించటం ఎంతో అవసరమని కేటీఆర్ అన్నారు. గతంలో గుండెమార్పిడి లాంటివి జరిగితే పోలీసుల సాయంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించి అంబులెన్స్‌లలో గుండెను, ఇతర శరీర అవయవాలను నిర్దేశిత ప్రాంతాలకు చేరవేయటం మనం చూశామని, ఇప్పుడు ఆ ఇబ్బందులేవీ లేకుండానే డ్రోన్ల సాయంతో తక్కువ సమయంలో గుండె లాంటి అవయవాలను చేరవేయవచ్చని తెలిపారు. వ్యవసాయ పొలాల్లో పురుగుల మందులు చల్లటం, శాటిలైట్ మ్యాపింగ్ చేయటం, దిశ లాంటి సంఘటనలు జరిగితే క్షణాల్లో అక్కడికి డ్రోన్లను పంపి అప్రమత్తం చేయటం, అడవుల్లో మొక్కలు పెంచేందుకు సీడ్‌బాల్స్ చల్లటం లాంటి ఎన్నో రకాల పనులకు భవిష్యత్తులో ఈ డ్రోన్లను వాడవచ్చని తెలిపారు. పోలీసు వ్యవస్థలో సంఘ విద్రోహశక్తుల ఆట కట్టించటానికి కూడా ఈ వ్యవస్థను వినియోగించే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. బేగంపేటలోని పాత విమానాశ్రయంలో ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఆయన కేంద్రమంత్రిని కోరారు. రాష్ట్రంలో ఏరో స్పేస్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, దీనికి కేంద్రం సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, కలెక్టర్ నిఖిల, ఎస్పీ నారాయణ, స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, జెడ్పీ చైర్పర్సన్లు సునితారెడ్డి, అనితారెడ్డి, ఎమ్మెల్సీలు సురబి వాణిదేవి, మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, కాలె యాదయ్య, మూడు డ్రోన్ల తయారీ కంపెనీల ప్రతినిధులు విక్రం, ప్రేమ్, స్వప్నిక్ తదితరులు పాల్గొన్నారు. ► మారుత్ కంపెనీ రూపొందిం చిన హెపీ కోప్టర్ ఇది. దీని దూర సామర్థ్యం 40 కిలోమీటర్లు కాగా ఇది అత్యధికంగా 16 కిలోల వరకు బరువును మోసుకెళ్లగలదు. ఈ డ్రోన్‌ను మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రారంభించారు. దీంట్లో ఒక్కోటి మూడు కిలోల బరువుతో ఉన్న నాలుగు బాక్సుల్లో మొత్తం 12 కిలోలు ఉంచారు. ఏ గమ్యస్థానానికి పంపకుండా ఆకాశంలో ఆ బరువుతో ఎగిరేలా చేసి దాని సామర్థ్యాన్ని పరీక్షించారు. డ్రోన్లు ఎలా ఎగిరాయంటే.... 1. మొదటి డ్రోన్: బ్లూ డార్ట్ కంపెనీ వారు రూపొందించిన స్కై ఎయిర్ డ్రోన్. ఇది కిలో బరువును మాత్రమే మోసుకెళ్లగలదు. ఈ డ్రోన్‌ను కేంద్రమంత్రి జ్యోతిరాదిత్యసింధియా ప్రారంభించారు. ఇందులో ఒక వ్యాక్సిన్ బాక్సు మాత్రమే ఉంచారు. ఇది 40 కిలో మీటర్ల దూరం వరకు ఆకాశమార్గాన ప్రయాణించగలదు. ఇది వికారాబాద్ పట్టణంలోని సీహెచ్‌సీ ఆస్పత్రికి చేరుకోగా, ఇందులో ఉన్న వ్యాక్సిన్‌ను సిబ్బంది రిసీవ్ చేసుకున్నారు. ఈ డ్రోన్‌లో సరఫరా చేసిన వ్యాక్సిన్ ఉష్టోగ్రతలో ఎలాంటి మార్పులు జరగలేదని వారు నిర్ధారించారు. ఇది ఐదు నిమిషాల్లో అక్కడికి చేరుకుంది. 2. రెండో డ్రోన్: టెక్ ఈగల్స్ కంపెనీ వారు రూపొందించిన క్యూరీస్ ఫ్లై. దీని సామర్థ్యం కూడా ఒక కిలో కాగా ఇది కూడా 40 కిలో మీటర్ల దూరం వరకు ఎగరగలదు. ఈ డ్రోన్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించగా, ఇది ఆరు నిమిషాల వ్యవధిలో మున్సిపల్ పరిధిలోని రామయ్యగూడ పీహెచ్‌సీకి చేరుకుంది. దీన్ని కేవలం ట్రయల్ చేసి చూశారు. విమానాల తయారీకి అనువుగా హైదరాబాద్ ప్రాంతం ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల టాటా ఏరోస్పెస్ సెజ్‌లో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా శనివారం పర్యటించారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరి«ధిలో గల టాటా ఏరోస్పెస్, బోయింగ్ విమానాల తయారీ కేంద్రాన్ని సాయంత్రం 6:10 గంటలకు సందర్శించారు. రక్షణరంగ సంస్థల కోసం తయారు చేస్తున్న విమానాల విడి భాగాలను మంత్రి పరిశీలించారు. వాటి పనీతీరుపై టాటా సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పక్కనే ఉన్న టాటా లాకిడ్ మార్టిన్‌లో విమాన విడిభాగాలను తయారీ సంస్థను పరిశీలించారు. హైదరాబాద్ ప్రాంతం విమానాల తయారీకి అనువుగా ఉందని సింధియా పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని సంస్థలు నెలకొల్పడానికి కృషి చేస్తానని చెప్పారు. అనంతరం 6:40 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. మంత్రి రాకతో ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి టాటా ఏరోస్పెస్ వరకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జ్యోతిరాధిత్య సిందియా వెంట దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ విమానం ఎక్కడమే ప్రధాని కల శంషాబాద్: దేశంలో ప్రతి ఒక్కరు విమానయానం చేయాలన్నదే భారత ప్రధాని నరేంద్రమోదీ కల అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా అన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలోని ప్రత్యేక ఆర్థిక జో¯న్లో జీఎంఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏవియేషన్ స్కూల్ నూతన భవనానికి శనివారంరాత్రి ఆయన శంకుస్థాపన చేశారు. విమానయాన రంగంలో అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. -
రేపు ‘మెడిసిన్ ఫ్రమ్ ద స్కై’ ప్రారంభం
వికారాబాద్: దేశంలోనే తొలిసారి డ్రోన్ల ద్వారా మందులు, టీకాలు సరఫరా చేసే కార్యక్రమానికి వికారాబాద్ వేదిక కానుంది. దేశంలోనే తొలిసారి చేపడుతున్న ‘మెడిసిన్ ఫ్రమ్ ద స్కై’కార్యక్రమాన్ని శనివారం కేంద్ర మంత్రి జోతిరాదిత్య, రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు ప్రారంభించనున్నారు. గురువారం ఎస్పీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ట్రయల్ రన్‌ను డ్రోన్ల తయారీ కంపెనీ ప్రతినిధులతో కలసి కలెక్టర్ నిఖిల పరిశీలించారు. నూతన కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన హెలీపాడ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రవాణా వ్యవస్థ సరిగ్గాలేని ప్రాంతాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుందన్నారు. భవిష్యత్తులో టీకాలు, యాంటీవీనమ్ వంటి మందులు సకాలంలో ఆస్పత్రులకు చేరవేసేలా డ్రోన్లు ఎంతగానో సహాయపడతాయని స్పష్టం చేశారు. డ్రోన్ల ద్వారా అవయవాలను కూడా చేరవేసే అవకాశం ఉందని తెలిపారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతులు తదితర విషయాలు పర్యవేక్షిస్తున్నామన్నారు. ట్రయల్ రన్లో టీకాలు ఆకాశ మార్గాన వెళ్లే సమయంలో ఉష్ణోగ్రత ఎంత ఉండాలో అంతే ఉంటుందా? ఏమైనా మార్పులు జరుగుతున్నాయా? అనే విషయాలను గమనిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రయ్య, మోతీలాల్, అదనపు ఎస్పీ రషీద్, ఆర్డీఓ వెంకట ఉపేందర్‌రెడ్డి, డీఎంహెచ్ఓ తుకారామ్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యాక్సిన్ డెలివరీలో సంచలనం! దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో..
Medicine From The Sky Project: కరోనా వ్యాక్సిన్ డెలివరీలో తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించేందుకు రెడీ అయ్యింది. మారుమూల ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ వేగంగా చేసేందుకు వీలుగా ఆధునిక టెక్నాలజీ ఉపయోగించనుంది. ఈ ప్రయోగం తెలంగాణలో సఫలమైతే దేశమంతటా అమలు చేయాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాలే లక్ష్యంగా రోజుల లక్షల సంఖ్యలో వ్యాక్సినేషన్ జరుగుతున్నా అందులో సగానికి పైగా నగర, పట్టణ ప్రాంతాల్లోనే చోటు చేసుకుంటున్నాయి. గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు, అటవీ గ్రామాల ప్రజలకు ఇప్పటికీ వ్యాక్సినేషన్ అందని ద్రాక్షగానే మిగిలింది. కేవలం వ్యాక్సిన్లను అత్యంత చల్లని ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేసే అవకాశం గ్రామీణ ప్రాంతాల్లో లేదు. దీంతో పట్టణ, నగర ప్రాంతాల్లోనే వ్యాక్సినేషన్ జరుగుతోంది. దీంతో ఈ సమస్యను అధిగమించేందుకు మెడిసిన్ ఫ్రం ది స్కై ప్రాజెక్టును తెలంగాణలో చేపట్టనున్నారు. గంట వ్యవధిలో జిల్లా కేంద్రాల్లో ఉండే ఔషధ నిల్వల కేంద్రం నుంచి మారుమాల ప్రాంతంలో ఉండే గ్రామాలకు గంటల వ్యవధిలోనే వ్యాక్సిన్లను తరలించేలా మెడిసిన్ ఫ్రం ది స్కై ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. భూమి నుంచి 500ల నుంచి 700 మీటర్ల ఎత్తులో ప్రయాణించే డ్రోన్ల ద్వారా మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్లను చేరవేయనున్నారు. స్టాక్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్‌కి కేవలం గంట వ్యవధిలో చేరాలా చూస్తారు. దీని వల్ల తక్కువ సమయంలోనే డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లు గమ్య స్థానాలకు చేరుకుంటాయి. ఉష్ణోగ్రత సంబంధిత కారణాల వల్ల వ్యాక్సిన్లు పాడవకుండా ఉంటాయి. సెప్టెంబరు 9 నుంచి మెడిసిన్స్ ఫ్రం ది స్కై ప్రాజెక్టు ట్రయల్స్ రన్ని 2021 సెప్టెంబరు 9 నుంచి ప్రారంభించనున్నారు. తక్కువ ఎత్తులో కంటికి కనిపించేలా డ్రోన్ల సాయంతో వ్యాక్సిన్లను ఎంపిక చేసిన గమ్యస్థానానికి నిర్దేశిత సమయంలోగా చేరేలా చూస్తారు. ఆ తర్వాత మూడు సార్లు కంటికి కనిపించనంత ఎత్తులో అత్యంత వేగంగా వ్యాక్సిన్లను గమ్య స్థానాలకు చేరుస్తారు. సెప్టెంబరు నుంచి అక్టోబరు మూడో వారం వరకు ఈ ట్రయల్ రన్ కొనసాగనుంది. ఈ ట్రయల్ రన్ సక్సెస్ అయితే మెడిసన్ ఫ్రం ది స్కై ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా చేపట్టే అవకాశం ఉంది. తొలుత వికారాబాద్ మెడిసిన్స్ ఫ్రం ది స్కై ప్రాజెక్టు చేపట్టేందుకు హైదారాబాద్‌కి సమీపంలో ఉన్న వికారాబాద్ జిల్లాను ఎంచుకున్నారు. ఈ జిల్లాలో ఉన్న 16 పీహెచ్‌సీలకు తొలిసారిగా డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లు సరఫరా చేయనున్నారు. మూడు దశల్లో జరిగే ట్రయల్ రన్లో లోటు పాట్లు గుర్తించి వాటిని సవరించుకుంటారు. కేంద్రం అనుమతి డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించుకుని అత్యవసర సమయాల్లో మెడిసన్లు, వ్యాక్సిన్లు, రక్తం తదితర అత్యవసర వైద్య సేవలు అందివ్వాలని తెలంగాణ ప్రభుత్వం 2019లో నిర్ణయించింది. ఈ మేరకు గతేడాది కేంద్ర ఏవియేషన్ నుంచి అనుమతులు వచ్చాయి. ప్రస్తుతం మెడిసిన్ ఫ్రం ది స్కై ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వంతో ఎనిమిది సంస్థలు సంయుక్తంగా కలిసి పని చేస్తున్నాయి. -
Drone Delivery: డ్రోన్లతో లాజిస్టిక్స్ డెలివరీకి రెడీ
న్యూఢిల్లీ: డ్రోన్ల ద్వారా వాణిజ్య సరుకు రవాణా సర్వీసులను ప్రారంభించేందుకు ప్రయోగాత్మక ప్రాజెక్టు సిద్ధమైంది. ఇందుకు వైమానిక సరుకు రవాణా(కార్లో) సంస్థ స్పైస్ ఎక్స్‌ప్రెస్ ఈ కామర్స్ లాజిస్టిక్స్ కంపెనీ 'డెలివరి' చేతులు కలీపాయి. మూడు నాలుగు నెలల్లో డ్రోన్ల డెలివరీ పైలట్ ప్రాజెక్టును సంయుక్తంగా చేపట్టనున్నాయి. ఇందుకు వీలుగా రెండు సంస్థలూ అవగాహనా ఒప్పందం(ఎంవోయూ)పై సంతకాలు చేశాయి. ఈ ప్రాజెక్టు కోసం దేశీ ఎయిర్‌లైన్స్ కంపెనీ స్పైస్ జెట్‌కు చెందిన స్పైస్ ఎక్స్ఫ్రైస్ కన్ఫార్షియంను పౌర విమానయాన అధీకృత సంస్థ (డీజీసీఏ) ఎంపిక చేసింది. బీవీఎల్వోఎస్ పరిధిలో డ్రోన్ల వినియోగానికి ప్రయోగాత్మక ప్రాజెక్టుకు గ్రీన్ సీగ్నల్ ఇచ్చింది. దీంతో ఎమర్జెన్సీ సర్వీసులు, సరుకు రవాణా, క్రిటికల్ మెడికల్ సర్వీసుల, పర్యావరణ పహారా తదితర కీలక వాణీజ్య సర్వీసులకు డ్రోన్ల టెక్నాలజీని వినియోగించేందుకు వీలుంటుందని నిపుణులు తెలియజేశారు. డెలివరీతో కుదిరిన ఎంవోయూ ద్వారా రెండు సంస్థలూ లబ్లి పొందనున్నట్లు స్పైస్ ఎక్స్‌ప్రెస్ సీఈవో సంజీవ్ గుప్తా పేర్కొన్నారు. తమకున్న సామర్జ్యాలతో ఈ ప్రాజెక్టును విజయవంతంగా చేపట్టనున్నట్లు చెప్పారు. ఇది సరుకు రవాణాలో కొత్త మార్పులకు శ్రీకారం చుడుతుందని 3-4 నెలల్లో ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. స్పైస్‌జెట్‌తో తమకున్న దీర్షకాల సాహచర్యానికి ఈ ఒప్పందం మరింత బలాన్నివ్వనున్నట్లు డెలివరీ సీఈవో అజిత్ పాయ్ పేర్కొన్నారు ఈ ప్రాజెక్టు ద్వారా లాజిస్టిక్స్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చే వీలున్నదని తెలియజేశారు. ఎంవోయూలో భాగంగా భూమిపై లాజిస్టిక్స్ సేవలకు డెలివరీ పూర్తస్తాయిలో మద్దతివ్వనుంది. కాగా.. ఈ మే నెలలో డ్రోన్ల ద్వారా ప్రయోగాత్మకంగా వ్యాక్సిన్ల డెలివరీని చేపట్టేందుకు పార విమానయాన శాఖ తెలంగాణ ప్రభుత్వానికి షరతులతో అనుమతించిన విషయం విదితమే. కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనే బాటలో వ్యాక్సిన్ల సరఫరాకు యూఏఎస్ నిబంధనల నుంచి మినహాయింపునిచ్చింది. చదవండి: సరికొత్త టెక్నాలజీ.. సౌండ్ ద్వారానే ఫోన్లు ఛార్జింగ్ -
Vaccine: బంపర్ ఆఫర్.. ఆకాశ మార్గాన వస్తాయట
న్యూఢిల్లీ : దేశం నలుమూలల వ్యాక్సిన్లు రవాణా చేసేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. మారుమూల ప్రాంతాలకు సైతం సకాలంలో టీకాలు చేరేలా కొత్త ప్రణాళిక రూపొందించింది. ఎత్తైన కొండ ప్రాంతాలు, దట్టమైన అడవుల్లో ఉన్న జనావాసాల దగ్గరకు వ్యాక్సిన్లు రవాణా చేసేందుకు డ్రోన్లు ఉపయోగించాలని నిర్ణయించింది. ఆసక్తి వ్యక్తీకరణ వ్యాక్సిన్ల డెలివరీకి ఆసక్తి ఉన్న కంపెనీల నుంచి కేంద్రం ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించింది. ఇందులో రూపొందించిన నిబంధనల ప్రకారం... ఎంపిక చేసిన కమాండ్ స్టేషన్ నుంచి 35 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలకు వ్యాక్సిన్లను డ్రోన్ల ద్వారా డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఒక్కో డ్రోన్ల ద్వారా గరిష్టంగా నాలుగు కేజీల బరువు వరకు వ్యాక్సిన్లు ఇతర సామగ్రిని తరలించాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొంది. వ్యాక్సిన్లు డెలివరీ చేసిన తర్వాత తిరిగి కమాండ్ స్టేషన్లో డ్రోన్లు రిపోర్టు చేయాలని కేంద్రం సూచించింది. ఐఐటీ కాన్పూరు, ఐసీఎంఆర్ సంయుక్తంగా ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( ఐఐటీ, కాన్పూరు) , ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సంయుక్తంగా డ్రోన్ల సాయంతో అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ (UAV) ప్రోటోకాల్‌ని సిద్ధం చేసింది. దాని ప్రకారమే వ్యాక్సిన్ డ్రోన్ డెలివరీ ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను కేంద్రం ఆహ్వానించింది. అన్ని ప్రాంతాలకు వాహనాల ద్వారా చేరుకోవడానికి కష్టంగా ఉండే ప్రాంతాలకు వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు డ్రోన్లను ఉపయోగించాలని కేంద్రం నిర్ణయించింది. వ్యాక్సిన్ల డెలివరీ ద్వారా భవిష్యత్తులో డ్రోన్ల ద్వారా ఔషధాల సరఫరాకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు. తెలంగాణలో డ్రోన్ డెలివరీకి సంబంధించిన విధానాన్ని బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ (BVLOS)గా పేర్కొంటూ ఇటీవల కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఈ విధానంలో వ్యాక్సిన్లు, ఇతర అత్యవసర ఔషధాలు డెలివరీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫ్లిప్‌కార్ట్, డూన్జోలతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. -
కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి డ్రోన్లు
న్యూఢిల్లీ: దట్టమైన అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో నివసించే వారికి కోవిడ్–19 వ్యాక్సినేషన్ కోసం కేంద్రం సరికొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. డ్రోన్ల సాయంతో టీకా డోసుల్ని పంపించాలని నిర్ణయించిన కేంద్రం దీనికి సంబంధించి బిడ్లను కూడా ఆహ్వానించింది. డ్రోన్ల సాయంతో మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్‌ను పంపించడానికి గల సాధ్యాసాధ్యాలపై ఐఐటీ కాన్పూర్ సహకారంతో కేంద్రం ఇప్పటికే అధ్యయనం నిర్వహించింది. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ (యూఏవీ.. డ్రోన్లు)తో టీకా డోసులు పంపించడానికి వీలవుతుందని ఆ అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలోనే ఇండియన్ రీసెర్చ్ మెడికల్ ఆర్గనైజేషన్ (ఐసీఎంఆర్) తరఫున హెచ్ఎల్ఎల్ ఇన్ఫ్రా టెక్ సర్వీస్ లిమిటెడ్ డ్రోన్ల సాయంతో టీకా డోసుల్ని పంపించడానికి ఆసక్తి కలిగిన కంపెనీలు జూన్ 22లోగా తమ బిడ్లను దాఖలు చేయాలని ఒక ప్రకటన విడుదల చేసింది. డ్రోన్లకు నాలుగు కేజీల బరువుని మోసే సామర్థ్యం ఉండాలని, 100 మీటర్ల ఎత్తులో 35 కి.మీ. వరకు ప్రయాణించి, తిరిగి వెనక్కి రాగలిగేలా ఉండాలని హెచ్ఎల్ఎల్ స్పష్టం చేసింది. మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి వ్యాక్సిన్ ఇవ్వడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సవాల్‌గా మారింది. ఇప్పటివరకు దేశంలో తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఈ తరహా ఆలోచన చేసింది. ఫ్లిప్‌కార్ట్ సంస్థ సహకారంతో డ్రోన్ల ద్వారా మారుమూల ప్రాంతాల ప్రజలకు టీకా డోసుల్ని పంపించేలా ఆరు రోజుల పైలెట్ ప్రాజెక్టుని కూడా నిర్వహించినట్టు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఇప్పుడే కేంద్రమే ముందుకు రావడంతో త్వరలోనే గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా వ్యాక్సిన్ అందనుంది. -
డ్రోన్లతో వ్యాక్సిన్ల రవాణా: 100 కి.మీ వేగం.. 70 కి.మీ దూరం..
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వ్యాక్సిన్లను డ్రోన్ల ద్వారా రవాణా చేయనున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించనుంది. అవసరమైన ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లు చేరవేయడానికి సంబంధించి ప్రముఖ డ్రోన్ డెలివరీ స్టార్టప్ సంస్థ ‘టెక్ ఈగిల్’కు తాజాగా అనుమతులు లభించాయి. ‘మెడిసిన్ ఫ్రం ది స్కై’ ప్రాజెక్టులో భాగంగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం, నీతి ఆయోగ్–అపోలో ఆస్పత్రులు, తెలంగాణ ప్రభుత్వాల సంయుక్త సహకారం, కృషితో ఇది వాస్తవ రూపం దాల్చుతోంది. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో.. సుమారు 70 కిలోమీటర్ల దూరం వరకు వ్యాక్సిన్లు, మందులను డ్రోన్లతో సరఫరా చేయడానికి వీలు కలుగనుంది. వికారాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా.. డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ల డెలివరీకి సంబంధించి.. రాష్ట్రంలో తొలుత వికారాబాద్ జిల్లాలో ప్రయోగాత్మక పరిశీలన చేపట్టనున్నారు. తర్వాత ఇతర జిల్లాలకు విస్తరించాలని భావిస్తున్నట్టు తెలిసింది. దీనితో కోవిడ్ వ్యాక్సిన్లు మాత్రమేకాకుండా.. అత్యవసరమైన ఇతర మందుల సరఫరాకు కూడా వీలవుతుందని అధికారులు చెప్తున్నారు. రోడ్డు కనెక్టివిటీ సరిగా లేని ›ప్రాంతాలకు, నిర్ణీత ఉష్ణోగ్రతల్లో వ్యాక్సిన్లను స్టోర్ చేసే ఏర్పాట్లు లేని చోట్లకు టీకాల రవాణా సవాళ్లతో కూడుకున్నదని.. ఇలాంటి పరిస్థితుల్లో డ్రోన్ల ద్వారా రవాణా ఎంతో ప్రయోజనకరమని అంటున్నారు. కాగా.. గతేడాది డిసెంబర్లో ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ నుంచి ముస్సోరికి ఐస్‌బాక్స్‌తో కూడిన నాన్–కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్రయోగాత్మకంగా పంపారు. తెలంగాణలో మాత్రం నేరుగా కోవిడ్ వ్యాక్సిన్ల చేరవేతకు వినియోగించనున్నారు. వేలాది జీవితాలు కాపాడొచ్చు అత్యవసర మందులను డ్రోన్ల ద్వారా సకాలంలో చేరవేయడం ద్వారా వేలమంది జీవితాలను కాపాడవచ్చునని ‘టెక్ ఈగిల్’ వ్యవస్థాపకులు, సీఈవో విక్రమ్ సింగ్ మీనా పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయన్నారు. కాగా.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మారుత్ డ్రోన్‌టెక్ సంస్థను కూడా వ్యాక్సిన్లు, మందుల సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్టు సమాచారం. మొబైల్ యాప్ సాయంతో మారుమూల, సరైన రోడ్డులేని ప్రాంతాలకు మందులను డ్రోన్లతో సరఫరా చేయొచ్చని మారుత్ డ్రోన్‌టెక్ మెడికల్ డెలివరీ యూనిట్ హెపికాప్టర్ వ్యవస్థాపకులు ప్రేమ్‌కుమార్ విశ్వనాథ్ చెప్తున్నారు. చదవండి: గంటల వ్యవధిలో ముగ్గురు.. తల్లి.. కొడుకు.. తండ్రి! -
డ్రోన్ల ద్వారా కొవిడ్ వ్యాక్సిన్ల డెలివరీ !
హైదరాబాద్: కొవిడ్ కల్లోల సమయంలో ఆక్సిజన్ ట్యాంకర్లకు ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. అంతకు రెండు నెలల ముందు అవయవమార్పిడి సందర్భంగా స్పీడ్ డెలివరీ కోసం హైదరాబాద్ మెట్రోలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాటిని మించిన వేగంతో అత్యవసర ఔషధాలు అందించే సేవలు భాగ్యనగర వాసులకు అందుబాటులోకి రాబోతున్నాయి. మెడిసిన్స్ ఫ్రం స్కై పేరుతో డ్రోన్ల ద్వారా మెడిసిన్స్ డెలివరీ చేసేందుకు డూన్జో సంస్థ అనుమతులు సాధించింది. అతి త్వరలోనే ఈ సేవలు హైదరాబాద్‌లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ సేవలు అందుబాటులోకి వస్తే కొవిడ్ ఔషధాలు, వ్యాక్సిన్లు, ఇతర అత్యవసర మందులు డ్రోన్ల ద్వారా ఇంటికే తెప్పించుకోవచ్చు. డ్రోన్ డెలివరీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సహకారంతో తెలంగాణ ప్రభుత్వం మెడిసిన్ ఫ్రం స్కై పేరుతో పైలట్ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన మౌలిక వసతులను డూన్జో సంస్థ అందివ్వనుంది. మెడిసిన్స్ ఫ్రం స్కైలో భాగంగా అత్యవసర ఔషధాలతో పాటు కొవిడ్ మెడిసన్లు, వ్యాక్సిన్లను సైతం డ్రోన్ల ద్వారా ఎంపిక చేసిన చిరునామాకు డెలివరీ చేసే వీలుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని డూన్జో తెలిపింది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక సమాచారం రాలేదు. మెడ్- ఎయిర్ కన్సార్టియం గూగూల్‌తో పాటు వైద్యరంగానికి సంబంధించిన నిపుణులతో ఏర్పాటైన మెడ్-ఎయిర్ కన్సార్టియం మెడిసిన్ డ్రోన్ డెలివరీ సిస్టమ్‌పై కొన్నేళ్లుగా ప్రయోగాలు చేస్తోంది. మెడిసిన్ డ్రోన్ డెలివరీని బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ (BVLOS)గా ప్రస్తుతం పేర్కొంటున్నారు. ఇటీవల బీవీఎల్ఓఎస్ పద్దతిలో అత్యవసర ఔషధాల డెలివరీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. 8 నగరాల్లో కేంద్రం నుంచి అనుమతి రావడంతో మెడ్-ఎయిర్‌కన్సార్టియం , డూన్జోతో కలిసి దేశ వ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూనే, గురుగ్రాం, జైపూర్ మొత్తం 8 నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా మెడిసిన్స్ ఫ్రం స్కై చేపట్టాలని నిర్ణయించాయి. మలిదశలో దేశంలోని 22 నగరాలకు ఈ సేవలు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మెడిసిన్స్ ఆన్లైన్ డెలివరీకి డిమాండ్ పెరగిందని డూన్జో అంటోంది. జనవరి నుంచి మే వరకు ఔషధాలకు సంబంధించి ఆన్లైన్లో ఇరవై రెండు వేల ఆర్డర్లు వచ్చినట్టు ఆ సంస్థ ప్రకటించింది. మెడిసిన్స్ డెలివరీలో 350 శాతం వృద్ధిరేటు నమోదు అయ్యిందని తెలిపింది. రాబోయే రోజుల్లో ఇది మరింతగా పెరగనుందని ఆశాభావం వ్యక్తం చేసింది. .. -
కంటి చూపు పరిధి దాటి ఎగరనున్న డ్రోన్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయోగాత్మకంగా ఆకాశ మార్గంలో డ్రోన్ల ద్వారా కరోనా వ్యాక్సిన్లను రాష్ట్రంలోని మారుమూల గ్రామాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)కు తరలించేందుకు కేంద్రం నుంచి రాష్ట్రం మరో కీలక సడలింపు పొందింది. కంటి చూపు పరిధి రేఖను దాటి (బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్).. ఆకాశంలో అత్యంత ఎత్తులో డ్రోన్లను ఎగురవేయడానికి వీలుగా.. ‘మానవ రహిత విమాన వ్యవస్థ (యూఏఎస్) నిబంధనలు–2021లను సడలిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. డ్రోన్ల వ్యాక్సిన్ల పంపిణీ కోసం అత్యంత ఎత్తులో వాటిని ఎగురవేయడానికి సడలింపులు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గత మార్చి 9న కేంద్ర పౌర విమానయాన శాఖకు లేఖ రాసింది. అయితే, కంటి చూపు మేర(విజువల్ లైన్ ఆఫ్ సైట్)లో మాత్రమే డ్రోన్లను ఎగరవేయడానికి సడలింపులు ఇస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ ఏప్రిల్ 29న ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో కంటి చూపు పరిధి రేఖ దాటి డ్రోన్లను ఎగురవేయడానికి ఎట్టకేలకు షరతులతో కూడిన అనుమతి లభించింది. వ్యాక్సిన్ల పంపిణీ అవసరాల కోసం డ్రోన్లను ఎగురవేయడానికి అనుసరించాల్సిన ప్రామాణిక పద్ధతుల(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్/ఎస్ఓపీ)కు సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) నుంచి ఆమోదం పొందాలని పౌర విమానయాన శాఖ సూచిం చింది. డీజీసీఏ నుంచి ఎస్ఓపీకి ఆమోదం లభించిన నాటి నుంచి ఏడాది పాటు ఈ సడలింపులు అమల్లో ఉంటాయని తెలిపింది. తాజా అనుమతులతో సుదూర ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలకు వ్యాక్సిన్లను చేరవేర్చడానికి దోహదపడనుంది. రాష్ట్రం ఈ సడలింపులు కోరినా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సైతం ఈ ప్రయోజనం పొందనున్నాయి. వికారాబాద్‌లో ట్రయల్స్... వికారాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ నెల 4వ వారంలో లేదా జూన్ ప్రారంభంలో డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లను జిల్లాలోని మారు మూల గ్రామాల పీహెచ్‌సీలకు తరలించేందు కు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ట్రయ ల్స్‌లో వచ్చిన ఫలితాల ఆధారంగా డ్రోన్ల ద్వారా టీకాల పంపిణీ కోసం విధివిధానాలను రూపొందించనున్నారు. 24 రోజుల పాటు డ్రోన్లతో ట్రయల్స్ నిర్వహించడానికి ఐటీ శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఇక్కడ చదవండి: తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు తండాలో నో కరోనా.. ఆదర్శంగా నిలుస్తున్న గిరిజనులు -
డ్రోన్ల ద్వారా పంపిణీకి కేంద్రం అనుమతి
సాక్షి, హైదరాబాద్: ప్రయోగాత్మకంగా ఆకాశ మార్గంలో మానవ రహిత విమానాలు(డ్రోన్ల) ద్వారా కోవిడ్–19 వ్యాక్సిన్ల పంపిణీకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యాక్సిన్ల పంపిణీ కోసం డ్రోన్లు వినియోగించడానికి వీలుగా.. మానవ రహిత విమాన వ్యవస్థ(యూఏఎస్) నిబంధనలు–2021కు సడలింపులు ఇవ్వాలని మార్చి 9న రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి పట్ల తాజాగా కేంద్ర పౌర విమానయాన శాఖ సానుకూలంగా స్పందించింది. కంటి చూపు మేర(విజువల్ లైన్ ఆఫ్ సైట్/వీఎల్ఓఎస్)లో ఎగిరే డ్రోన్ల ద్వారా ప్రయోగాత్మకంగా వ్యాక్సిన్ల పంపిణీకి షరతులతో కూడిన సడలింపులు ఇస్తూ ఆ శాఖ జాయింట్ సెక్రటరీ అంబర్ దూబె గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది కాలం లేదా తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఈ సడలింపులు అమల్లో ఉంటాయని తెలిపారు. వ్యాక్సిన్ల పంపిణీకి డ్రోన్ల వినియోగంలో పాటించాల్సిన ప్రామాణిక పద్ధతి(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్/ఎస్ఓపీ)ను సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) ఏప్రిల్ 26న ఆమోదించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కంటి చూపు పరిధి రేఖకు దాటి(బియాండ్ ది విజువల్ లైన్ ఆఫ్ సైట్/బీవీఎల్ఓఎస్) డ్రోన్లను ఎగురవేయడానికి సడలింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ప్రయత్నాలు చేస్తోంది. మారుమూల గ్రామాలకు వ్యాక్సిన్లను చేర్చడానికి డ్రోన్లను వినియోగంలోకి తెస్తే సమయంతో పాటు రవాణా ఖర్చులు సైతం ఆదా కానున్నాయి. తొలుత వికారాబాద్‌లో ట్రయల్స్... ఔషధాలు, ఇతర వైద్యారోగ్య సంబంధిత వస్తువులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సురక్షితంగా చేర్చడంలో డ్రోన్ సర్వీస్ ప్రొవైడర్ల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఐటీ శాఖ ఇప్పటికే ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ)ను ఆహ్వానించగా, 16 సంస్థలు ముందుకు వచ్చాయి. ఇందులో 8 మందిని ఐటీ శాఖ షార్ట్‌లిస్ట్ చేసింది. తొలుత వికారాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లను మారుమూల గ్రామాల పీహెచ్‌సీలకు తరలించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన జరుపుతోంది. వ్యాక్సిన్లతో డ్రోన్లు వికారాబాద్ ఏరియా ఆస్పత్రిలో టేకాఫ్ చేసి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), ఉపకేంద్రాల్లో ల్యాండింగ్ చేసే విధంగా ప్రణాళికలను రూపొందిస్తోంది. జిల్లా యంత్రాంగం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇందుకు సంబంధించిన సన్నాహాలను చేపట్టింది. ఈ వ్యవహారాలను పర్యవేక్షించడానికి నోడల్ అధికారిని సైతం నియమించింది. తొలుత ప్రతి డ్రోన్ ద్వారా డమ్మీ వైల్స్‌తో పాటు అసలు టీకాలను కలిపి పంపించి వీటి పనితీరును పరీక్షించి చూడనున్నారు. ట్రయల్స్‌లో వచ్చిన ఫలితాల ఆధారంగా పూర్తి స్థాయిలో డ్రోన్ల ద్వారా టీకాల పంపిణీ కోసం విధివిధానాలను రూపొందించనున్నారు. ఇప్పటికే ఎంపిక చేసిన 8 సంస్థలను 4 బ్యాచ్‌లుగా విభజించి ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఒక్కో బ్యాచ్‌లో రెండు సంస్థలు ఉండనున్నాయి. ఒక్కో బ్యాచ్ 6 రోజుల పాటు డ్రోన్లను ఎగిరించి తమ సామర్థ్యాన్ని నిరూపించుకోనున్నాయి. 24 రోజుల పాటు డ్రోన్లతో వ్యాక్సిన్ పంపిణీకి ట్రయల్స్ నిర్వహించడానికి ఐటీ శాఖ ప్రణాళికలు రూపొందించింది. వికారాబాద్ గగన తలంలో డ్రోన్ల వినియోగంపై ఏయిర్ ఫోర్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) సైతం అనుమతి ఇచ్చింది. డ్రోన్లపై ముందు చూపు... రాష్ట్ర ఐటీ శాఖలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ 2019లో రాష్ట్ర డ్రోన్ల విధానాన్ని ప్రకటించింది. దీని అమలులో భాగంగా ‘వింగ్స్ 2020’ పేరుతో హైదరాబాద్‌లో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించింది. ఆకాశ మార్గంలో మందుల సరఫరా (మెడిసిన్ ఫ్రమ్ ది స్కై/ఎంఎఫ్టీఎస్) వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. డ్రోన్ల వాడకంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు కోవిడ్ –19 వ్యాక్సినేషన్‌కు ఉపయోగపడబోతున్నాయి. వ్యాక్సిన్ల పంపిణీకి డ్రోన్ల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ హర్షం వ్యక్తం చేశారు. ( చదవండి: DCGI Approval: కోవిడ్‌కు సరికొత్త చికిత్స! ) -
డ్రోన్ల ద్వారా కరోనా టెస్ట్ కిట్ల సరఫరా
లండన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో ఇద్దరు ట్రైనీ డాక్టర్లు ప్రారంభించిన స్టార్టప్ ప్రాజెక్టు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. హమాద్ జిలానీ, క్రిస్టోఫర్ లా అనే ఈ వైద్యులు మెడికల్ డ్రోన్ డెలివరీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి సేకరించిన కరోనా వైరస్ నమూనాలు, టెస్టింగ్ కిట్లు, పీపీఈ కిట్లను ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి.. ఆసుపత్రుల నుంచి ఇళ్లకు డ్రోన్ల ద్వారా చేరవేయడమే దీని ఉద్దేశ్యం. ఈ డ్రోన్లకు చిన్న రెక్కలు ఉంటాయి. ఇవి దాదాపు 2 కిలోల బరువును 96 కిలోమీటర్లదాకా మోసుకెళ్లగలవు. మెడికల్ డ్రోన్ డెలివరీ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి దాదాపు రూ.12.48 కోట్ల ఆర్థిక సాయం అందజేయడానికి యూకే అంతరిక్ష పరిశోధనా సంస్థ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ముందుకొచ్చాయి. వైరస్ శాంపిల్స్, టెస్టింగ్ కిట్లను డ్రోన్లతో చేరవేస్తే కరోనా వ్యాప్తిని చాలావరకు అరికట్టవచ్చని జిలానీ, క్రిస్టోఫర్ లా చెబుతున్నారు. -
‘అనంత’లో డ్రోన్ ప్రయోగాలు
సాక్షి, అమరావతి: సుదీర్ఘ ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా అత్యవసర మందులు, ఇతర వస్తువులను సరఫరా చేసే పరీక్షలకు అనంతపురం జిల్లా వేదిక కానుంది. దేశంలోనే తొలిసారిగా కంటికి కనిపించనంత దూరంగా (బీవీఎల్వోఎస్) డ్రోన్లను పరీక్షించేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతులిచ్చింది. రాష్ట్రానికి చెందిన వాల్యూథాట్‌తో పాటు కర్ణాటకకు చెందిన ఇన్ డ్రోన్స్ సంస్థలు కన్సా ర్షియంగా ఏర్పడి ఏపీ డ్రోన్ కార్పొరేషన్‌తో కలిపి అనంతపురం జిల్లా పుట్టపర్తి సమీపంలో ఈ ప్రయోగాలు నిర్వహించనున్నాయి. డ్రోన్‌కు సుమారు 8 కిలోల బరువున్న వస్తువులను అమర్చి 27.5 కి.మీ దూరం రిమోట్ సాయంతో పంపి పరీక్షలు నిర్వహించనున్నట్లు వాల్యూ థాట్ సీఈవో మహేష్ అనిల్ నంద్యాల ‘సాక్షి’కి వివరించారు. జీపీఎస్ ద్వారా డ్రోన్ తీసుకెళ్లిన వస్తువులను నిర్దేశిత గమ్యానికి సురక్షితంగా చేర్చి తిరిగి వచ్చిందా లేదా పర్యవేక్షిస్తామని, ఈ విధంగా 100 గంటలు ప్రయోగం చేయాల్సి ఉంటుందని సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వంశీ మాదిరెడ్డి తెలిపారు. ఈ ప్రయోగాలకు అనుమతులు, ఏర్పాట్లను ఏపీ డ్రోన్ కార్పొరేషన్ అందిస్తుంది. పుట్టపర్తి ఎయిర్‌పోర్టు సమీపంలోని ఒక ప్రభుత్వ రంగ సంస్థ స్థలాన్ని ప్రయోగానికి వేదికగా నిర్ణయించారు. ఈ నెలాఖరు నుంచి పరీక్షలు జరుగుతాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రకృతి విపత్తులు, సరిహద్దుల రక్షణ, అత్యవసర మందులు, ఆహార సరఫరా వంటి కార్యక్రమాల్లో డ్రోన్స్‌ను విరివిగా వినియోగించుకోవచ్చు. -
స్విగ్గీ, జొమాటో డ్రోన్ డెలివరీ..
ముంబై: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గీ, డన్‌జోలు సరికొత్త రీతిలో వినియోగదారులను ఆకర్శించనున్నాయి. అందులో భాగంగానే త్వరలో డ్రోన్లను ఉపయోగించుకుంటు పుడ్ డెలివరీలు చేయనున్నాయి. దాదాపు 13 సంస్థల యాజమాన్యాలు డ్రోన్లను ఉపయోగించేందుకు ప్రభుత్వ అనుమతి లభించిందని తెలిపారు. డ్రోన్లను ఉపయోగించేందుకు భారత వైమానిక దళం గతంలోనే సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. కాగా జులై మొదటి వారంలోనే డ్రోన్లను ఉపయోగించడం ప్రారంభిస్తామని త్రొట్టల్ ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు నాగేందర్ కందస్వామి పేర్కొన్నారు. తాము ఉపయోగించే ముందు డ్రోన్లును పరీక్షించాలనుకున్నాం.. కానీ కరోనా వైరస్, లాక్డౌన్ నేపథ్యంలో ఆలస్యం జరిగిందని అన్నారు. అయితే, పరిస్థితులు కుదుటపడిన వెంబడే డ్రోన్ల పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. డ్రోన్ల ద్వారా తక్కువ ఖర్చుతో ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని తెలిపారు. మరోవైపు డ్రోన్లను రూపొందించడానికి బిలియన్ డాలర్లు అవసరం ఉండదని ప్రభుత్వ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే సాఫ్ట్వేర్ సేవలను అందించడంలో భారత్ ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే. పవర్ జెనరేటర్స్, ఆయిల్ కంపెనీలలో సాఫ్టవేర్‌ను ఉపయోగించడంలో దేశీయ ఐటీ కీలక పాత్ర పోషిస్తుందని.. అలాగే డ్రోన్ల ఉపయోగించే క్రమంలో ఐటీ సేవల ద్వారా ఖర్చును తగ్గించవచ్చని సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. చదవండి: స్విగ్గీ గుడ్ న్యూస్ : 3 లక్షల ఉద్యోగాలు -
పంజాబ్‌లో ఖలిస్తాన్ ఉగ్రవాదుల అరెస్ట్
చంఢీఘర్ : పంజాబ్‌లోని తార్న్ తారన్ జిల్లాలో ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులను సోమవారం పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 10 లక్షల విలువైన ఆయుధాలు, పెద్ద ఎత్తున నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్‌లో రిజిస్ట్రేషన్ అయిన మారుతీ స్విఫ్ట్ కారులో అమృత్‌సర్‌కు వెళుతున్న బల్వంత్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, హర్బజన్ సింగ్, బల్బీర్ సింగ్‌పై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. వీరిలో ఆకాశ్‌దీప్ సింగ్, బల్వంత్ సింగ్‌లపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిపారు. కాగా, ఈ వాదనలకు బలం చేకూరుస్తూ.. జమ్మూ-కశ్మీర్లో మరోసారి భయాందోళనను సృష్టించేందుకు పాకిస్తాన్, భారత్ సరిహద్దులో ఉన్న అమృత్‌సర్‌లో డ్రోన్ల ద్వారా ఎకె-47, గ్రనైడ్లను వదిలివెళ్లినట్లు సమాచారం అందిందని పంజాబ్ పోలీసులు నిర్దారించారు. కేవలం నెల వ్యవధిలోనే 8 డ్రోన్ల ద్వారా ఆయుధాలతో పాటు సాటిలైట్ ఫోన్లను భారతగడ్డపై వదిలివెళ్లినట్లు గుర్తించామని తెలిపారు. ఈ డ్రోన్లు అత్యంత వేగంగా ఎగురుతూ 5 కేజీల బరువును సలువుగా మోస్తాయని, సమాచారాన్నివేగంగా పసిగడతాయని వెల్లడించారు. అలాగే వారిని అదుపులోకి తీసుకున్న ప్రదేశంలో సగం కాలిపోయిన డ్రోన్ దొరికిందని, పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లే సమయంలో డ్రోన్‌లో ఇబ్బంది తలెత్తడంతో ఉగ్రవాదులే దానిని కాల్చడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. గత ఆగస్టులో ఇదే తరహాలో పంజాబ్‌కు చెందిన కౌంటర్ ఇంటెలిజెన్స్ టీం అమృత్‌సర్‌లో పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును దర్యాప్తు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థను కోరినట్లు పంజాబ్ పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌లో దాడులు చేసేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదులకు డ్రోన్ల ద్వారా ఆయుధాలను సరఫరా చేస్తుందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కల్పించుకొని వీలైనంత తొందరగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నట్లు తెలిపారు. -
కోరుకుంటే చాలు.. వచ్చి వాలిపోతుంది!
కొండమీది కోతైనా సరే.. కోరుకుంటే క్షణాల్లో మీ ముందు వచ్చి వాలిపోతుంది. ఇలాంటివి సహజంగా పౌరాణిక సినిమాల్లో చూసుంటాం. కానీ ఇప్పుడు అటువంటి అద్భుతాలే మనముందు ఆవిష్కృతం కాబోతున్నాయి. మనసులో కోరుకోకపోయినా నోటిమాట ద్వారా చెబితేచాలు క్షణాల్లో మనకు కావాల్సింది మనముందు ప్రత్యక్షమవుతుంది. ఇదెలా సాధ్యం? అనే సందేహం మనిషి బుర్రకు కలగడం సహజం. కానీ అదే బుర్ర ఈ అద్భుతాన్ని సాకారం చేస్తోంది. డ్రోన్ డెలివరీ.. ఆ వివరాలేంటో ఓసారి చదవండి... అంటే ఏంటీ..?: మనకు నచ్చిన వస్తువును సెలెక్ట్ చేసుకొని, ఆర్డరిస్తే కొరియర్ కంపెనీల ద్వారా సరుకు మన ఇంటికి చేరేది. ఇందుకు చాలా సమయమే పడుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు అభివృద్ధి చెందుతున్న వ్యవస్థే ‘డ్రోన్ డెలివరీ’. ఇప్పటికే రకరకాల అవసరాలకు డ్రోన్లను వాడుతున్నారు. ఇకపై ఈ-కామర్స్ రంగంలో కూడా డ్రోన్లను వినియోగించడం ద్వారా తమ సేవలను మరింత వేగవంతం చేయాలని ఆన్లైన్ దిగ్గజ కంపెనీలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. రంగంలోకి గూగుల్: ఇంటర్నెట్ గురించి తెలిసిన ప్రతివారికి గూగుల్ గురించి పరిచయం చేయనక్కరలేదు. ఈ ప్రతిష్టాత్మక కంపెనీ ఇప్పుడు డ్రోన్ డెలివరీపై దృష్టిసారించింది. 2017 నాటికి పూర్తిస్థాయి సేవలందిస్తామని ప్రకటించింది. ‘ప్రాజెక్ట్ వింగ్’ పేరుతో డ్రోన్ డెలివరీ సేవలు అందించేందుకు తెరవెనుక పెద్ద ప్రయత్నమే చేస్తోంది. వాషింగ్టన్లో నిర్వహించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోస్ కన్వెన్షన్‌లో గూగుల్ సంస్థ ప్రతినిధి డేవిడ్ వోస్ ఈ విషయాన్ని వెల్లడించారు. గూగుల్ డ్రోన్ డెలివరీకి సంబంధించిన ప్రయోగాలను 2014లోనే ప్రారంభించింది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని సీక్రెటివ్ రీసెర్చ్ ల్యాబ్‌లో ఈ ప్రయోగాలు జరుగుతున్నాయని సమాచారం. అత్యవసర సేవలకే...: ప్రస్తుతానికి అత్యవసర సేవల కోసమే ఈ డ్రోన్ డెలివరీ సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని గూగుల్ భావిస్తోంది. వైద్య పరికరాలు, మందులు వంటివాటిని ఆర్డరిచ్చిన మరుక్షణంలో సరఫరా చేసేందుకు డ్రోన్లను ఉపయోగించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఆ తర్వాత దశలవారీగా సేవలను ఇతర అవసరాల కోసం కూడా వినియోగించాలని నిర్ణయించారు.