హైదరాబాద్‌కు చెందిన డ్రోన్ టెక్నాలజీ కంపెనీ మారుత్ డ్రోన్‌టెక్ నిధులు సమీకరించేందుకు పూనుకుంది. అందులో భాగంగా తాజాగా 6.2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.55 కోట్లు) పెట్టుబడులు సమీకరించింది. లోక్ క్యాపిటల్ నుంచి ఈ నిధులు సమీకరించినట్లు సంస్థ తెలిపింది. వార్షికంగా 3,000 డ్రోన్ల స్థాయికి తయారీ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు, వచ్చే అయిదేళ్లలో రూ.1,000 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని సాధించే దిశగా కార్యకలాపాలు పటిష్టం చేస్తున్నట్లు మారుత్ డ్రోన్స్ సీఈవో ప్రేమ్ కుమార్ విశ్లావత్ పేర్కొన్నారు.
అధునాతన వ్యవసాయ డ్రోన్లను అభివృద్ధి చేసేందుకు, ద్వితీయ–తృతీయ శ్రేణి పట్టణాల్లోకి చానల్ పార్ట్‌నర్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు, గ్రామీణ ప్రాంత వినియోగదార్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఈ నిధులను ఉపయోగించనున్నట్లు ప్రేమ్ వివరించారు. దేశీయంగా కేంద్రం నమోదీదీ పేరుతో స్వయం సహాయక సంఘాల మహిళలకు డ్రోన్ అందించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో దేశీయ కంపెనీల ఉత్పత్తులకు స్థానికంగా గిరాకీ ఏర్పడుతుందని సంస్థలు భావిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో మహిళలకు ఉపాధి చేకూరుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: మార్కెట్.. ‘ట్రంపె’ట్!
మారుత్ డ్రోన్‌టెక్ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో 9,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో కార్పొరేట్ కార్యాలయాన్ని ఇప్పటికే ప్రారంభించింది. తన డీలర్ల నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నట్టు, 2028 నాటికి డీలర్ల సంఖ్యను 500కు పెంచుకోనున్నట్టు గతంలోనే ప్రకటించింది. కస్టమర్లకు అత్యుత్తమ సేవలు, సహకారం అందించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో సర్వీస్ సెంటర్లను ఏర్పా టు చేస్తున్నట్టు తెలిపింది. ఐదేళ్లలో 30,000 డ్రోన్ల విక్రయాల లక్ష్యాన్ని చేరుకోనున్నట్టు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment