మన పెద్దవాళ‍్లు ధాన్యం, ఎండు మిరపకాయలు, వడియాలు, పిండి వంటి ఆహార పదార్థాలను ఆరు బయట ఎండ పెట్టేవారు. పైగా పక్షులు, కోతులు వచ్చి పాడుచేయకుండా ఉండటానికి వల లేక దాన్ని భయపెట్టించేలా శబ్దాలు చేయడం లేదా చనిపోయిన పక్షి బొమ్మలు పెట్టడం వంటివి చేసేవారు. అప్పుడు మనం ఇళ్లలోకి రానివ్వక పోవడం వల్లనో మరీ ఏమో గానీ ఇక్కడోక కాకి ఫుడ్ డెలివరీ చేసే ఒక డ్రోన్‌ని ఇది మా గగన విహారం నువ్వు ఎగరడానికి వీల్లేదూ....అన్నట్లుగా దాన్ని తరిమికొట్టేదాక వదల్లేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటో ఆ విషయం అని ఆశ్చర్యంగా ఉంది కదూ!
కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రా గూగుల్ భాగస్వామ్యంతో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన డ్రోన్ వింగ్‌ని ప్రజా సేవల వినియోగ నిమిత్తం 2019 నుంచి ప్రారంభించింది. ఈ డ్రోన్ ఆహారం, మెడిసిన్, కాఫీ తదితర వాటిని ప్రజలకు సరఫరా చేయడానికి వినియోగిస్తోంది. ఇటీవల కోవిడ్ సమయంలో ప్రజలకు కావల్సిన ఆహారం, నిత్యావసరాలకు సంబంధించిన పదివేల ఆర్డర్‌లను డెలవరీ చేసి ఎంతో విశేష ప్రజాదరణ పొందింది.
(చదవండి: వెరైటీ థెరపీలు... విలువైన ప్రయోజనాలు!)
ఈ క్రమంలో ఆస్ట్రేలియాలోని ఒక కస్టమర్ తాను ఆర్డర్ చేసిన డెలివరీ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో ఒక కాకి ఆకాశంలో ఫుడ్ డెలివరీ చేసే డ్రోన్ పై ఆకస్మాత్తుగా దాడికి పాల్పడింది. దానిని గట్టిగా నోటితో పట్టుకుని ఆపే ప్రయత్నం చేస్తోంది. పైగా ఆ కాకి చూడటానికి ఆకారంలో చాలా పెద్దగా ఉంది. వెంటనే సదరు కస్టమర్ ఆశ్చర్యానికి గురై దాన్ని వీడియో తీశాడు. ఆ డ్రోన్ పై కాకి చాలా భయంకరంగా దాడి చేసింది.
దీంతో ఆ డ్రోన్ ఆ డెలివరీని కింద పడేసింది. ఆ తర్వాత ఆ కాకి ఒక్కసారిగా అక్కడ నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం కొన్ని ప్రదేశాలలో ఆ వింగ్ డ్రోన్‌ని తాత్కాలికంగా నిషేధించారు. ఈ దాడిలో పక్షికి ఏమి కాలేదని, ప్రస్తుతం ఆ ప్రాంతంలో డ్రోన్‌లు తిరగపోవడం వల్ల దాన్ని తరిమి కొట్టడంలో పక్షి విజయవంతమైందని పక్షుల సంరక్షణ నిపుణుడు ఒకరు చెప్పారు.
(చదవండి: అపహరణకు గురైన ఇరాక్ పురాతన శాసనాన్ని తిరిగి ఇచ్చేశాం!)
Comments
Please login to add a commentAdd a comment