ముంబై: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గీ, డన్‌జోలు సరికొత్త రీతిలో వినియోగదారులను ఆకర్శించనున్నాయి. అందులో భాగంగానే త్వరలో డ్రోన్లను ఉపయోగించుకుంటు పుడ్ డెలివరీలు చేయనున్నాయి. దాదాపు 13 సంస్థల యాజమాన్యాలు డ్రోన్‌లను ఉపయోగించేందుకు ప్రభుత్వ అనుమతి లభించిందని తెలిపారు. డ్రోన్‌లను ఉపయోగించేందుకు భారత వైమానిక దళం గతంలోనే సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. కాగా జులై మొదటి వారంలోనే డ్రోన్లను ఉపయోగించడం ప్రారంభిస్తామని త్రొట్టల్ ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు నాగేందర్ కందస్వామి పేర్కొన్నారు. తాము ఉపయోగించే ముందు డ్రోన్లును పరీక్షించాలనుకున్నాం.. కానీ కరోనా వైరస్, లాక్‌డౌన్ నేపథ్యంలో ఆలస్యం జరిగిందని అన్నారు.
అయితే, పరిస్థితులు కుదుటపడిన వెంబడే డ్రోన్ల పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. డ్రోన్ల ద్వారా తక్కువ ఖర్చుతో ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని తెలిపారు. మరోవైపు డ్రోన్లను రూపొందించడానికి బిలియన్ డాలర్లు అవసరం ఉండదని ప్రభుత్వ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే సాఫ్ట్‌వేర్ సేవలను అందించడంలో భారత్ ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే. పవర్ జెనరేటర్స్, ఆయిల్ కంపెనీలలో సాఫ్టవేర్‌ను ఉపయోగించడంలో దేశీయ ఐటీ కీలక పాత్ర పోషిస్తుందని.. అలాగే డ్రోన్ల ఉపయోగించే క్రమంలో ఐటీ సేవల ద్వారా ఖర్చును తగ్గించవచ్చని సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment