‘నమో’ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్
న్యూఢిల్లీ: దేశీయ ఐటీ కంపెనీ ఇన్నోవేజన్ తన నూతన యాంటీవైరస్ (వైరస్‌ల నుంచి కంప్యూటర్లకు రక్షణ) కు ‘నమో’గా నామకరణం చేసింది. ఎన్నికల ముందు నమో (నరేంద్రమోడీ) వైరస్ దేశవ్యాప్తంగా సోకి బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇన్నోవేజన్ తన నూతన శ్రేణి యాంటీ సాఫ్ట్‌వేర్‌కు నరేంద్రమోడీ సంక్షిప్త నామాన్ని ఎంచుకోవడం విశేషం.
మాల్వేర్, వైరస్ దాడుల నుంచి రక్షణ కల్పించేలా అడ్వాన్స్‌డ్ సాఫ్ట్‌వేర్‌ను నమో పేరుతో విడుదల చేయనున్నట్లు ఇన్నోవేజన్ వెల్లడించింది. దేశంలో యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించని 57 శాతం మంది నెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని దీనిని తెస్తున్నట్లు కంపెనీ సీఈవో అభిషేక్ గగ్నేజా తెలిపారు. తమ కంపెనీకి ఏ రాజకీయ పార్టీతో అనుబంధం లేదని స్పష్టం చేశారు.