RRTS
-
నేటి నుంచి ర్యాపిడ్ రైలు సేవల్లో మరో ముందడుగు
దేశంలో నేటి నుంచి ర్యాపిడ్ రైలు మరింత దూరం పరుగులు తీయనుంది. ఇది ఆధునిక రైల్వే యుగంలో మరో ముందడుగు కానుంది. మీరట్ సౌత్ ఆర్ఆర్టీఎస్ స్టేషన్ నుంచి ర్యాపిడ్ రైలు రాకపోకలు ప్రారంభం కానున్నాయిని నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎన్సీఆర్టీసీ) తెలిపింది. దీంతో ఢిల్లీలోని ప్రయాణికులు ఎన్సీఆర్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ వరకు రాకపోకలు సాగించగలుగుతారు.82 కిలోమీటర్ల రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్)లో 42 కి.మీల వినియోగం ఆదివారం నుంచి అమలులోకి వస్తుందని ఎన్సీఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈరోజు (ఆదివారం) మీరట్ మొదటి స్టేషన్ మధ్యాహ్నం రెండు గంటలకు తెరుచుకోనుంది. ఇప్పటి వరకు నమో భారత్ రైలు సర్వీసులు ఘజియాబాద్ నుంచి మోదీనగర్ నార్త్ వరకు మాత్రమే నడిచేవి. ఇప్పుడు మీరట్ నగరంలో సర్వీసు ప్రారంభం కావడంతో ఘజియాబాద్, ఢిల్లీ వైపు వెళ్లే వారి ప్రయాణం మరింత సులభతరం కానుంది.ఆర్ఆర్టీఎస్ 2023, అక్టోబర్‌లో ఘజియాబాద్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఘజియాబాద్‌లోని సాహిబాబాద్- దుహై డిపోల మధ్య 17 కిలోమీటర్ల దూరం ఉంది. ఇప్పటి వరకు ఈ మార్గంలో 22 లక్షల మంది ప్రయాణించారు. ఢిల్లీ - మీరట్ మధ్యనున్న కారిడార్‌లో మొత్తం 25 స్టేషన్లున్నాయి. జూన్ 2025 నాటికి ఢిల్లీ- మీరట్ మధ్య మొత్తం విస్తరణను పూర్తి చేయాలని ఎన్సీఆర్టీసీ భావిస్తోంది. -
‘నమో భారత్’కు ప్రధాని మోదీ పచ్చజెండా
సాహిబాబాద్: దేశంలో మొట్టమొదటి నమో భారత్ రైలు(ర్యాపిడ్ రైలు సర్వీసు)కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం పచ్చజెండా ఊపారు. ఢిల్లీ–ఘజియాబాద్–మీరట్ మార్గంలో నిర్మిస్తున్న రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(ఆర్ఆర్టీఎస్)లో 17 కిలోమీటర్ల మేర పూర్తయ్యింది. ఈ 17 కిలోమీటర్ల కారిడార్‌తోపాటు ఇదే మార్గంలో ‘నమో భారత్’ రైలును మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్ నుంచి దుహాయి డిపో వరకు ఆయన నమో భారత్ రైలులో ప్రయాణించారు. రైలులో పాఠశాల విద్యార్థులు, రైల్వే సిబ్బందితో మాట్లాడారు. ఢిల్లీ–ఘజియాబాద్–మీరట్ ఆర్ఆర్టీఎస్ మొత్తం పొడవు 82.15 కిలోమీటర్లు. మిగిలిన మార్గం మరో ఏడాదిన్నరలో పూర్తవుతుందని, దాన్ని తానే ప్రారంభిస్తానని మోదీ ఈ సందర్భంగా వెల్లడించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌తోపాటు హరియాణా, రాజస్తాన్‌లో నగరాలు, పట్టణాలను అనుసంధానించేలా మరికొన్ని నమో భారత్ ప్రారంభించబోతున్నామని తెలిపారు. ఈస్ట్–వెస్ట్ కారిడార్, బెంగళూరు మెట్రో రైలును కూడా ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. -
హైదరాబాద్–విజయవాడ మధ్య ఆర్ఆర్టీఎస్ రైలు!
సాక్షి, అమరావతి: హైదరాబాద్–విజయవాడ మధ్య ఇంటర్సిటీ రైల్ సర్వీసులు ఆధునిక సొబగులు సంతరించుకోనున్నాయి. ఇప్పటికే ఈ రెండు నగరాల మధ్య వందే భారత్ రైలు సర్వీసు ఈ నెల 19న ప్రారంభం కానుంది. తాజాగా హైదరాబాద్– విజయవాడ మధ్య అత్యాధునిక రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (ఆర్ఆర్టీఎస్) రైల్వే వ్యవస్థ ఏర్పాటుకు ప్రతిపాదించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో మెట్రో రైలు కంటే మెరుగైన ఇంటర్సిటీ మోడల్ రైల్వే వ్యవస్థగా ఆర్‌ఆర్‌టీఎస్‌ను ప్రస్తుతం ఢిల్లీ–మీరట్ మధ్య నిర్మిస్తున్నారు. ఆ రెండు నగరాల మధ్య ఆర్ఆర్టీఎస్ రైల్వే వ్యవస్థ 2024 చివరకు అందుబాటులోకి రానుంది. తరువాత దేశంలో మరో ఏడు ఆర్ఆర్టీఎస్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించారు. వీటిలో రెండు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. మిగిలిన ఐదింటిలో హైదరాబాద్–సికింద్రాబాద్ మార్గంలో నిర్మించాలన్న ప్రతిపాదన ఉంది. ఏమిటీ ఆర్ఆర్టీఎస్.. ఇంటర్సిటీ రైలు సర్వీసుల్లో ఆర్ఆర్టీఎస్ వ్యవస్థ అత్యాధునికమైనది. మెట్రో రైళ్లు ఓ నగర పరిధిలో సేవలందిస్తాయి. రెండు లేదా అంతకంటే ఎక్కువ నగరాల మధ్య ఇంటర్సిటీ సర్వీసులుగా ఆర్ఆర్టీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. విద్య, ఉద్యోగ, వ్యాపార తదితర అవసరాల కోసం ప్రయాణికులు అత్యధికంగా రాకపోకలు సాగించే సమీపంలోని ప్రధాన నగరాల మధ్య ఏర్పాటు చేసే వ్యవస్థే ఆర్ఆర్టీఎస్. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆర్ఆర్టీఎస్ ఏర్పాటు చేస్తాయి. అందుకోసం ప్రత్యేక కారిడార్ ఏర్పాటుచేసి, రైల్వేశాఖతో నిమిత్తం లేకుండా ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి సమాంతరంగా నిర్వహిస్తాయి. తొలిసారిగా 1998–99లో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. రెండు దశాబ్దాల తరువాత తొలి ఆర్ఆర్టీఎస్ వ్యవస్థను ఢిల్లీ–మీరట్ మధ్య ఏర్పాటు చేస్తున్నారు. అత్యున్నత ప్రమాణాలతో ఆధునిక రైలు ప్రయాణం ఆర్ఆర్టీఎస్ రైళ్లు అత్యాధునిక ప్రమాణాలతో ప్రత్యేక ప్రయాణ అనుభూతి కలిగిస్తాయి. రైల్వే కోచ్‌లలో రెక్లయినర్ సీట్లు, విశాలౖమెన నడవా, ప్రతి సీటుకు ప్రయాణించే రూట్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకంగా లగేజీ ర్యాక్‌లు, మొబైల్ఫోన్లు/ల్యాప్‌టాప్ చార్జింగ్ సాకెట్లు ఉంటాయి. సీసీటీవీ కెమెరాలు, డబుల్ గేజ్ అద్దాల కిటికీలు, ఫైర్/స్పోక్ డిటెక్టర్లు మొదలైన ఆధునిక భద్రతా ప్రమాణాలతో కోచ్‌లను రూపొందిస్తారు. ప్రయాణికుల కోసం రైల్వే స్టేషన్లలో ప్రత్యేక లాంజ్ ఏర్పాటు చేస్తారు. ఆర్ఆర్టీఎస్ వ్యవస్థతో గంటకు 160 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వేగంతో ఆధునిక రైలు ప్రయాణ అనుభూతిని ఆస్వాదించవచ్చును. మరో రెండింటికి ఓకే.. దేశం మొత్తం మీద రైల్వేశాఖతో నిమిత్తంలేకుండా 1,835 కిలోమీటర్ల మేర మెట్రో, ఆర్ఆర్టీఎస్ లైన్లుగా కేటాయించారు. వాటిలో 824 కిలోమీట్లు మెట్రోరైల్ లైన్లు కాగా మిగిలిన 1,011 కిలోమీటర్లను ఆర్ఆర్టీఎస్ పరిధిలోకి చేర్చారు. తరువాత ఢిల్లీ–హరిద్వార్, ఢిల్లీ–అల్వార్, ఢిల్లీ–జైపూర్, ఢిల్లీ–ఛండీగఢ్, రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలోని హైదరాబాద్– విజయవాడ, హరియాణలోని ఫరీదాబాద్–గురుగావ్, ఉత్తరప్రదేశ్‌లోని లక్నో–కాన్పూర్ మధ్య ఆర్ఆర్టీఎస్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. వీటిలో ఢిల్లీ–హరిద్వార్, ఢిల్లీ–అల్వార్ ప్రాజెక్టులు ఓకే అయ్యాయి. వీటి తరువాత ఐదు ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రతిపాదనలు వచ్చాయని ఢిల్లీలోని నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎన్సీఆర్టీసీ) ఎండీ వినయ్‌కుమార్ సింగ్ వెల్లడించారు. ఆర్ఆర్టీఎస్ కారిడార్ నిర్మాణానికి ప్రస్తుత అంచనాల ప్రకారం కిలోమీటరుకు రూ.370 కోట్ల వ్యయం అవుతుంది. 2024 చివరకు హైదరాబాద్–విజయవాడతోపాటు ఇతర ఆర్ఆర్టీఎస్ల నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందించే ప్రక్రియ చేపడతామని ఎన్సీఆర్టీసీ వర్గాలు చెప్పాయి. -
ఆర్ఆర్టీఎస్ రైలు ఫస్ట్‌లుక్ ఇదే..
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ ప్రాంతీయ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్) రైలు తొలి డిజైన్‌ను పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ శుక్రవారం విడుదల చేసింది. 82 కిలోమీటర్ల పొడవున గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడిచే రైళ్లతో ఆర్ఆర్టీఎస్ క్యారిడార్ దేశంలో ఇదే మొదటిది కావడం గమనార్హం. జాతీయ రాజధాని ప్రాంతం వెంట ఆర్ఆర్టీఎస్ ప్రాజెక్టును అమలుచేసేందుకు ఢిల్లీ, హర్యానా, రాజస్తాన్, యూపీ ప్రభుత్వాలు కలిసి ఎన్సీఆర్టీసీ పేరిట జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేశాయి. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందే ఆర్ఆర్టీఎస్ రైళ్లు స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో నిర్మాణమై తేలికపాటి బరువును కలిగిఉంటాయి. ఈ రైళ్లు పూర్తిగా ఏసీ సౌకర్యాన్ని కలిగిఉంటాయి. చదవండి : యాదాద్రికి ఎంఎంటీఎస్ ఏదీ? -
గంటల్లోనే గమ్యానికి
ఢిల్లీకి పొరుగున ఉన్న మీరట్, పానిపట్, అల్వార్ నగరవాసులకు శుభవార్త. హైస్పీడ్ రైలు ప్రాజెక్టును చేపట్టేందుకు ఉద్దేశించిన యాంబిషియస్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ (ఆర్ఆర్టీఎస్) ప్రాజెక్టును ఢిల్లీ ప్రభుత్వం ఆమోదించింది. అంతా సవ్యంగా సాగితే ఈ మూడు నగరాలకు ఢిల్లీ నుంచి కొన్ని గంటల వ్యవధిలోనే చేరుకోవచ్చు. న్యూఢిల్లీ: హైస్పీడ్ రైళ్లతో రాజధానిని పొరుగున్న నగరాలకు అనుసంధానం చేసేందుకు ఉద్దేశించిన యాంబిషియస్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ (ఆర్ఆర్టీఎస్) ప్రాజెక్టుకు ఢిల్లీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కింద మీరట్, పానిపట్, ఆల్వార్-ఢిల్లీ మధ్య హైస్పీడ్ రైలు మార్గాన్ని నిర్మిస్తారు. దీనిని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అనుబంధ నేషనల్ కేపిటల్ రీజనల్ ప్లానింగ్ బోర్డు (ఎన్‌సీఆర్‌పీబీ) ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు కింద తొలి కారిడార్‌ను ఢిల్లీ-సోనిపట్-పానిపట్ మధ్య నిర్మించనున్నారు. ఈ రెండింటి మధ్య దూరం 111 కిలోమీటర్లు. 2016 నాటికల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ మార్గంలో ప్రతిరోజూ 3.77 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని అంచనా. ఇక రెండో కారిడార్‌ను ఢిల్లీ-గుర్గావ్-అల్వార్ మధ్య నిర్మించనున్నారు. దీని పొడవు 180 కిలోమీటర్లు. ఈ మార్గంలో ప్రతిరోజూ ఏడు లక్షల మంది ప్రయాణించొచ్చని అంచనా వేశారు. ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ మధ్య మూడో కారి డార్ నిర్మితమవనుంది. ఈ మార్గం పొడవు 90 కిలోమీటర్లు. ఈ మార్గంలో ప్రతిరోజూ 5.7 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) సహకరించనుంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టును ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లను అనుసంధానం చేసేందుకు ఉద్దేశించింది. అయితే ఈ ప్రతిపాదనను గతంలో షీలాదీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకించింది. దీనిని నగరంలో వరకూ కాకుండా నగర శివార్లకే పరిమితం చేయాలని షీలా ప్రభుత్వం సూచించింది. అయితే అంతలోనే లోక్‌సభ ఎన్నికలు రావడంతో ఈ ప్రాజెక్టు వాయిదాపడింది.