దేశంలో నేటి నుంచి ర్యాపిడ్ రైలు మరింత దూరం పరుగులు తీయనుంది. ఇది ఆధునిక రైల్వే యుగంలో మరో ముందడుగు కానుంది. మీరట్ సౌత్ ఆర్‌ఆర్‌టీఎస్ స్టేషన్ నుంచి ర్యాపిడ్ రైలు రాకపోకలు ప్రారంభం కానున్నాయిని నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎన్‌సీఆర్‌టీసీ) తెలిపింది. దీంతో ఢిల్లీలోని ప్రయాణికులు ఎన్‌సీఆర్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ వరకు రాకపోకలు సాగించగలుగుతారు.
82 కిలోమీటర్ల రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్‌ఆర్‌టీఎస్)లో 42 కి.మీల వినియోగం ఆదివారం నుంచి అమలులోకి వస్తుందని ఎన్‌సీఆర్‌టీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈరోజు (ఆదివారం) మీరట్ మొదటి స్టేషన్ మధ్యాహ్నం రెండు గంటలకు తెరుచుకోనుంది. ఇప్పటి వరకు నమో భారత్ రైలు సర్వీసులు ఘజియాబాద్ నుంచి మోదీనగర్ నార్త్ వరకు మాత్రమే నడిచేవి. ఇప్పుడు మీరట్ నగరంలో సర్వీసు ప్రారంభం కావడంతో ఘజియాబాద్, ఢిల్లీ వైపు వెళ్లే వారి ప్రయాణం మరింత సులభతరం కానుంది.
ఆర్‌ఆర్‌టీఎస్ 2023, అక్టోబర్‌లో ఘజియాబాద్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఘజియాబాద్‌లోని సాహిబాబాద్- దుహై డిపోల మధ్య 17 కిలోమీటర్ల దూరం ఉంది. ఇప్పటి వరకు ఈ మార్గంలో 22 లక్షల మంది ప్రయాణించారు. ఢిల్లీ - మీరట్ మధ్యనున్న కారిడార్‌లో మొత్తం 25 స్టేషన్లున్నాయి. జూన్ 2025 నాటికి ఢిల్లీ- మీరట్ మధ్య మొత్తం విస్తరణను పూర్తి చేయాలని ఎన్‌సీఆర్‌టీసీ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment