వాషింగ్టన్ : అమెరికాలో మరో విమానం గల్లంతయ్యింది. 10 మంది ప్రయాణికులతో సెస్నా 208బీ విమానం అలస్కా మీదిగా ప్రయాణిస్తుంది. ఆ సమయంలో రాడార్ నుంచి జాడ అదృశ్యమైనట్లు సమాచారం. విమాన అదృశ్యంపై సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.
అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4 గంటలకు సెస్నా 208బీ విమానం ఉనల్కలేట్ నుంచి నోమ్‌కు వెళుతుంది. ఆ సమయంలో రాడార్ నుంచి విమానం జాడ అదృశ్యమైంది. విమాన అదృశ్యంపై సమాచారం అదుకున్న సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. విమానం జాడ కోసం శోధించాయి. అయితే నార్టోన్ సౌండ్ ఏరియాలో ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించిన సహాయ బృందాలు అక్కడి చేరుకున్నాయి.
❗️Bering Air plane VANISHES over Alaska with ten people on board — rescue crews desperately hunt for missing aircraft#Alaska
RT pic.twitter.com/YosTNTRbrV— Moh Musthafa Hussain (@musthafaaa) February 7, 2025
Comments
Please login to add a commentAdd a comment