వాషింగ్టన్ డీసీ : అమెరికాలో బస్ హైజాక్ కలకలం రేపుతోంది. అయితే ఆ బస్సులో హైజాకర్స్ ఎంత మంది ఉన్నారు. బందీలు ఎంత మంది ఉన్నారో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
పలు అమెరికన్ మీడియా కథనాల ప్రకారం.. లాస్ ఏంజిల్స్‌లోని 6వ స్ట్రీట్, సౌత్ అలమెడా స్ట్రీట్ సమీపంలో నిందితులు బస్సును హైజాక్ చేశారని, ప్రయాణికుల్ని బంధించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటన జరిగిన ప్రాంతంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
హైజాక్‌పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజీలను క్షణ్ణంగా పరిసీలించారు. బస్సుల్లో డ్రైవర్, ప్రయాణికులు, హైజాకర్స్ ఉన్నట్లు తేలింది. అయితే హైజాకర్స్ నుంచి డ్రైవర్ తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు అమెరికా మీడియా కథనాలు చెబుతుండగా.. హైజాక్ గురించి మరిన్ని వివరాలు సేకరించేందుకు అధికారులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు.
ఈ ఏడాది మార్చిలో సైతం
ఈ ఏడాది మార్చిలో సైతం లాస్ ఏంజెల్స్ డౌన్‌టౌన్‌లో బస్సును నిందితుడు బస్సును హైజాక్ చేశాడు. బస్సును తన ఆధీనంలోకి తీసుకున్న హైజాకర్ ఇతర వాహనాల్ని ఢీకొట్టి నానా హంగామా చేశాడు.
⚡️ Los Angeles Police engaged in a standoff with a hijacked bus, the driver and passengers are reportedly being held inside
Online images show that a SWAT team is at the scene
Follow us on Telegram https://t.co/8u9sqgdo0n pic.twitter.com/jQlQQbiDN6— RT (@RT_com) September 25, 2024
Comments
Please login to add a commentAdd a comment