
న్యూఢిల్లీ: ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో ఈరోజు(మంగళవారం) చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో ఆయన ఎట్టకేలకు దిగిచ్చారు. తాను చేసినవ్యా ఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని, అందుకు క్షమాపణలు తెలుపుతున్నానని అన్నారు. దీనిలో భాగంగా డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్కఉ క్షమాపణలు చెప్పారు.
జాతీయ ఎడ్యుకేషన్ పాలసీపై తాము చర్చ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, మంత్రి ధర్మంద్ర ప్రదాన్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఆ క్రమంలోనే ప్రభుత్వాని తోసి వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ మండిపడింది. ఆయన వ్యాఖ్యలు అవమానకంగా ఉన్నాయని, అసభ్య పదజాలాన్ని వాడారని, అది క్షమించరానిదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు.
ఆ వ్యాఖ్యలకు కచ్చితంగా ఖర్గే క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు అదే సమయంలో ఆయన వాడిన పదాన్ని కూడా రికార్డులనుండి తొలగించాలన్నారు. దాంతో దిగి వచ్చిన ఖర్గే.. రాజ్యసభ చైర్మన్ కు క్షమాపణలు తెలియజేశారు. ‘నేను ఇక్కడ సభను ఉద్దేశించో, లేక మిమ్మల్ని( రాజ్యసభ చైర్మన్ చైర్)ను ఉద్దేశించో ఆ వ్యాఖ్యలు చేయలేదు. కేవలం ప్రభుత్వ విధానాలపైనే ఆ వ్యాఖ్యలను చేశాను. ఆ వ్యాఖ్యలు మీకు అభ్యంతరకరంగా ఉంటే వెనక్కి తీసుకుంటాను. అందుకు క్షమాపణలు తెలియజేస్తున్నాను’ అని ఖర్గే పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, తమిళుల మనోభావాలు దెబ్బతీశారంటూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై డీఎంకే పార్టీ.. ఆయనపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది. ఆయన చట్ట సభను తప్పుదోవ పట్టించారని డీఎంకే ఎంపీ కనిమొళి లోక్‌సభలో ఈ తీర్మానం దాఖలు చేశారు.
తమిళనాడు.. అక్కడి ప్రజలు అనాగరికులు(Uncivilized) అంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన తమిళిలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డీఎంకే, 8 కోట్ల మంది మా ప్రజల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను’ అని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment