Live Updates..
ఢిల్లీ:
- పార్లమెంటు ఉభయసభలు రేపటికి వాయిదా
- అంబేద్కర్ అంశంపై విపక్షాల ఆందోళన
- ముందుకు సాగని సభా కార్యక్రమాలు
👉విపక్షాల నిరసనల కారణంగా రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా..
👉పార్లమెంట్ సమావేశాల సందర్బంగా లోక్‌సభలో వాడీవేడి చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ నేతలకు బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఉభయ సభల్లో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
#WATCH | On Union HM's speech in RS during Constitution debate, Rajya Sabha LoP and Congress MP Mallikarjun Kharge says "He has insulted Baba Saheb Ambedkar and the Constitution. His ideology of Manusmriti and RSS makes it clear that he does not want to respect Baba Saheb… pic.twitter.com/x9H75vJcZk
— ANI (@ANI) December 18, 2024
👉కాంగ్రెస్ నేతలు నేడు అంబేద్కర్ చిత్రపటంతో సభలు వచ్చారు. ఈ సందర్బంగా అమిత్ షా రాజీనామా చేయాలని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతల నిరసనలను బీజేపీ ధీటుగా కౌంటరిచ్చింది.
👉మరోవైపు.. అంబేద్కర్‌ను అమిత్ షా కించపరచలేదని కేంద్రమంత్రి మేఘవాల్ చెప్పుకొచ్చారు.
👉రాజ్యసభలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. అమిత్ షా తన ప్రసంగంలో అంబేద్కర్‌పై గౌరవ భావాన్ని స్పష్టంగా చూపించారు. అలాగే అంబేద్కర్ బ్రతికుండగానే ఆయనను కాంగ్రెస్ ఎలా అవమానించిందో అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వలేదు. ఇన్ని సంవత్సరాలు భారతరత్న ఎందుకు ఇవ్వలేదు. 1952లో కుట్రతో ఎన్నికల్లో ఓడించింది. నేను బౌద్ధుడిని ఈ దేశంలో బాబా సాహెబ్ చూపిన బాటలో నడిచే వ్యక్తిని . బాబా సాహెబ్ 1951లో న్యాయ మంత్రి పదవికి అంబేద్కర్ రాజీనామా చేశారు. అనంతరం, 71 సంవత్సరాల తర్వాత, ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి బౌద్దుడిని న్యాయ మంత్రిని చేశారు.
#WATCH | In Rajya Sabha, Union Minister Kiren Rijiju says "Yesterday, Union HM Amit Shah clearly showed our sense of reverence in his speech. He also said how Congress insulted Ambedkar ji when he was alive...The Congress party did not award him with Bharat Ratna for so many… pic.twitter.com/0G6MaEG1AN
— ANI (@ANI) December 18, 2024
Comments
Please login to add a commentAdd a comment