ఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పరస్పరం ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఈసీ స్పందించింది. ఇరు పార్టీల అధ్యక్షులు జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేలకు వేర్వేరుగా లేఖలు రాసింది.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఈసీకి ఇటీవల బీజేపీ ఫిర్యాదు చేసింది. మరో వైపు.. కేంద్ర మంత్రి అమిత్ షా కూడా కోడ్ ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఫిర్యాదులపై ఈ నెల 18వ తేదీ(సోమవారం) మధ్యాహ్నం ఒంటిగంట లోపు అధికారికంగా వివరణ ఇవ్వాలంటూ ఆ పార్టీల అధ్యక్షులకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవల లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జాతీయ పార్టీల స్టార్ క్యాంపెయినర్లకు చేసిన సూచనలను ఈసీ ప్రస్తావిస్తూ.. ఇతరులకు ఆదర్శంగా మెలగాలంటూ హితవు పలికింది. ఎన్నికల ప్రచార సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కచ్చితంగా పాటించాల్సిందేనని ఎన్నికల సంఘం తాజాగా మరోసారి గుర్తు చేసింది.
ఇదీ చదవండి: జో బైడెన్‌లాగే ప్రధాని మోదీకి మతిపోయినట్లుంది: రాహుల్
Comments
Please login to add a commentAdd a comment